Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చీర కట్టుకు తగిన మ్యాజింగ్ బ్లౌజ్ ఎంపిక..
స్త్రీని అందంగా చూపే దుస్తుల ఒక్కోసారి ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. శరీరం సరిగా, అందంగా, సౌకర్యంగా ఉండడంలో జాకెట్, బ్రాలది కీలకపాత్ర వాటికి లాంగ్ లైఫ్ ఇవ్వడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకసారి తెలుసుకుందాం..

ప్రస్తుతం చాలా వరకూ చీరల్లోనే మ్యాచింగ్ జాకెట్లు వస్తున్నాయి. కానీ అప్పుడప్పుడు మ్యాజింగ్ బ్లౌజ్ ల కోసం వెతకడానికి షాపులన్నీ తిరగాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే కావల్సిన జాకెట్ లభిస్తుంది. సిల్క్ చీర కోసం తెల్లగి సిల్క్ నుంచి మ్యాచింగ్ రంగుల వరకు అన్నింటినీ వేసుకోవచ్చు.
కొత్తచీర కొనుక్కోవడం. దానికి జతగా బ్లౌవుజును ఎంచుకుని.. సాదాగానో, బుట్టచేతులు పెట్టి కుట్టించుకోవడమో ఒకప్పటి మాట. ఇప్పుడు బ్లౌజులూ ఆధునికతకు అద్దం పట్టేవిగా ఉండాల్సిందే. నెట్ జోడించి కుట్టిన పొడవాటి చేతులు, వీపు భాగం తక్కువగా ఉండటం.. భుజం దగ్గర పట్టీలు.. ఇలాంటి వైవిధ్యంతో కుట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు అమ్మాయిలు. ప్రత్యేక సందర్భంలో ధరించేందుకు చూడచక్కని పాత తరహా బ్లౌజుల ఎంపిక చేసుకొని వింటేజ్ తరహా పొడవాటి చేతులతో మెరిసిపోతున్నారు.
విభిన్నంగా ఎంబ్రాయిడరీ చేసిన కోర్సెట్ బ్లవుజులు కూడా ఇప్పటి తరహానే అంటున్నారు డిజైనర్లు. కొంతకాలం క్రితం విడుదలైన సాత్ కూన్ మాఫ్' లో మణికట్టుదాకా పొడుగ్గా ఉన్న రవికలు ధరించి ప్రియాంకాచోప్రా సందడి చేస్తే, మొన్నామధ్యన విడుదలైన అరక్షన్ లో వెనక సన్నని తాళ్ళతో మెరిసింది మరో నటి దీపిక. ఒక వెనుక భాగమే కాదు... జాకెట్ ముందు భాగం కూడా విభిన్నంగా కుట్టినట్లు కనిపిస్తేనే ఈ రోజుల్లో సొగసు. అలాగే బ్లౌజ్ డిజైన్లలో కీహోల్ మెడని ఎంపిక చేసుకొని ఫ్యాషన్ వేదికలపై తళుక్కుమంటున్నారు డిజైనర్లు.
ఇక వెనుక భాగం ముడి వేసుకునేలా పట్టీల్లేని బ్లవుజులు, రకరకాల పూసలతో తీర్చిదిద్దిన వన్ షోల్డర్ బ్లవుజులు తాజా ట్రెండే..ఎంపైర్ లైన్ ను కట్ వర్క్ చేయించుకోవడం, భుజాలకు ప్రత్యేకమైన పనితనం వంటివన్నీ ఈ రోజుల్లో చూడచక్కగా ఉంటాయి. అలాంటి డిజైన్లను పొందాలంటే... నెట్, వెల్వెట్, క్రేవ్... వంటి వస్త్రాలను చీరలకు తగినట్లుగా ప్రకాశవంతమైన రంగుల్లో ఎంచుకోవాలని సూచిస్తున్నారు ఫ్యాషన్ నిపుణులు...



Click it and Unblock the Notifications