స్టైల్ గా కనిపించే జీన్స్ డ్రెస్సింగ్ లో లేటెస్ట్ ఫ్యాషన్...!

ప్రస్తుత ట్రెండులో యువత బాగా మోజుపడి ఇష్టపడే దుస్తులు జీన్స్. ఒకప్పుడు అబ్బాయిలే ఎక్కువగా ధరించే ఈ దుస్తులపట్ల నేటి తరం యువతులు కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇవి ఫ్యాషన్ పరంగానేకాక అటు ఉద్యోగ నిర్వహణలో అయినా ఇటు ప్రత్యేక సందర్భలలో డిన్నర్లు, పార్టీలకైనా అనువుగా, అనుకూలంగా వుంటాయి. అయితే జీన్స్ శరీరాకృతికి సరిగ్గా సూటవక సరైన స్టయిల్ కానట్లయితే మాత్రం అందం, స్టయిల్‌కు బదులు ఎబ్బెట్టుగా తయారవుతారు. మరి ఆకృతికి తగినట్లుగా ఏవిధంగా ఎంచుకోవాలన్నది అసలు మీమాంస. ఇందుకోసం ఫ్యాషన్ డిజైనర్లు ఇచ్చే సూచనల్ని పరిగణలోకి తీసుకుంటే ఇబ్బంది ఇట్టే తొలగిపోతుంది.

ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ జీన్స్ ప్యాంట్స్. అబ్బాయిలే కాదు.. అమ్మాయిల సంగతీ అంతే.. ఇంకో మాటలో చెప్పాలంటే జీన్స్ ధరించే వారిలో అమ్మాయిలే ఎక్కువే. అబ్బాయిలకు ప్యాంట్స్ విషయంలో ప్రత్యామ్నాయాలున్నా, అమ్మాయిలు మాత్రం జీన్స్, కాటన్స్ మాత్రమే ధరిస్తున్నారు. జీన్స్ స్టైలే వేరని అంటున్నారు. జీన్స్‌లో ఫ్యాషన్, స్టైల్స్‌తోపాటు కంఫర్ట్ కూడా ఉండడంతో వాళ్ళంతా దానికే ఓటేస్తున్నారు. వీళ్ళందరినీ చూశాక మేమెందుకు వేయకూడదంటూ చిన్నపిల్లలు మొదలుకొని అరవై ఏళ్ళ వయసు వాళ్ళ వరకు అందరూ ఇష్టపడి ఇదే కొత్త ఫ్యాషన్‌గా మార్చుకుంటున్నారు. జీన్స్ రెగ్యులర్ వేర్‌లో ఒక భాగంగా మారిపోయింది.

ఈ జీన్స్ ధరించడంలో రకరాకాల ఆకృతిని తెపేవి ఉన్నాయి. అందులో పెటైట్ ఆకృతి, ప్లస్ సైజ్, ఫర్ ఫెక్ట్ ఫిట్ అయ్యే వాటిని ఎంపిక చేసుకోవాలి. క్యాజువెల్ వేర్, టైట్ ఫిట్ ప్యాంట్స్, పెన్సిల్ కట్ ప్యాంట్ వంటి అనేక రకాలైన ప్యాంట్స్ ప్రస్తుతం మార్కెట్లో విరవిగా దొరుకుతున్నాయి. జీన్స్ వేసుకొనే ముందు మరో ముఖ్య విషయం గుర్తించుకోవాలి. జీన్స్ ప్యాంట్ ధరించిన తర్వాత దాని మీద వేసుకొనే టాప్ ఏ రకంగా ధరిస్తే మీ లుక్ ఇతరులు ఆకర్షిస్తుందో తెలుసుకోవాలి. మరి ఏ రకమైన జీన్స్ స్టైల్ ను ప్రస్తుత ట్రెండ్ అలరిస్తున్నదో తెలుసుకొనేందుకు క్రింది మోడల్స్ చూడండి..

జీన్స్ డ్రెస్సింగ్ లో లేటెస్ట్ ఫ్యాషన్ ఏది....?

జీన్స్ మరియు స్వెటర్ టైప్ టాప్: జీన్స్ ధరించినప్పుడు, దాని మీదకు స్వెట్టర్ టైప్ టాప్ ధరిస్తే అందమైన లుక్ ఉంటుంది. ఇందులో కరీనా కపూర్ అదే లుక్ తో కనబడుతున్నారు.

జీన్స్ డ్రెస్సింగ్ లో లేటెస్ట్ ఫ్యాషన్ ఏది....?

సెమీ ఫార్మల్ లుక్: ఆఫీస్ కు రెగ్యులర్ డ్రెస్సులను ధరించినా కూడా శుక్రవారంలో సెమిఫార్మల్స్ కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అందరిలోకి మీరే అట్రాక్టివ్ గా కనబడుతారు. అందుకు ఉదాహరణగా ఇక్కడా కరిష్మాకపూర్ ధరించిన డ్రెస్ ఫార్మల్ లుక్ తో స్టైలిష్ గా అలరిస్తోంది.

జీన్స్ డ్రెస్సింగ్ లో లేటెస్ట్ ఫ్యాషన్ ఏది....?

రెడ్ జీన్స్: ఈ బోల్డ్ కలర్ లో ఉండే రెడ్ జీన్స్ ఎక్స్ ట్రార్డినరీగా కనబడటమే కాకుండా... ఈ రెడ్ కలర్ బ్లూ మీదకు లైట్ కలర్, లైట్ బ్లూలు, పాస్టెల్ కలర్, లైట్ ఎల్లో, పేల్ ఎల్లో వంటివి ఫర్ ఫెక్ట్ లుక్ ను ఇస్తాయి.

జీన్స్ డ్రెస్సింగ్ లో లేటెస్ట్ ఫ్యాషన్ ఏది....?

రెట్రో స్టైల్: జీన్ ధరించి దాని మీదకు ఫార్మల్ షర్ట్ తో ముడి వేసి, స్కార్ఫ్ ను జడకు చుట్టుకోవడం వల్ల ఇది సెవన్ టీస్ లో అమ్మాయిల్లా మ్యాజిక్ చేసిన రెట్రో స్టైల్.

జీన్స్ డ్రెస్సింగ్ లో లేటెస్ట్ ఫ్యాషన్ ఏది....?

కూల్ అర్బన్ లుక్ ఇస్తున్న జీన్స్: ఎక్కువగా బ్లాక్ జీన్స్ మీదకు వైట్ కలర్ టాప్స్ అద్భుతంగా కనిపిస్తూ, ఇతరులను ఇట్టే ఆకర్షించేస్తాయి. దీపికా పదుకొనే కూల్ అర్బన్ లుక్ జీన్, వైట్ షర్ట్ లో ఫేడెడ్ జీన్స్ బ్యాగ్ తో ఆకర్షించబడుతోంది.

జీన్స్ డ్రెస్సింగ్ లో లేటెస్ట్ ఫ్యాషన్ ఏది....?

హిప్ హాప్ లుక్: హిప్ హప్ లుక్ తో ప్రియాంకచోప్రీ మార్వెలెస్ లుక్ తో అలరిస్తోంది. బ్రైట్ కలర్ మ్యాగ్నెటా జీన్స్ మీదకు ముడి వేసి లైన్స్ షర్ట్ తో, వైట్ హైహీల్స్ తో అద్భుతంగా కనబడుతోంది.

జీన్స్ డ్రెస్సింగ్ లో లేటెస్ట్ ఫ్యాషన్ ఏది....?

కౌగ్లర్స్ లుక్: జీన్ కు తగ్గట్టుగా ఎప్పుడైతే కౌబాయ్ షూ వేస్తేరో దానికి సరిపోయే సన్నని దారాలతో తయారు చేసి జాకెట్ ఫర్ ఫెక్ట్ లుక్ అందిస్తుంది.

జీన్స్ డ్రెస్సింగ్ లో లేటెస్ట్ ఫ్యాషన్ ఏది....?

డే అవుట్ లుక్: మీరు షాపింగ్ వెళ్ళాలనుకొన్నప్పుడు. అదీ వేసవికాలంలో, లేదా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు టామ్ జీన్స్ పర్ ఫెక్ట్ గా ఫిట్ అవుతాయి. అందులోకి బ్రైట్ కలర్ ఎల్లో టీషర్ట్ అద్భుతంగా ఉంటుంది.

జీన్స్ డ్రెస్సింగ్ లో లేటెస్ట్ ఫ్యాషన్ ఏది....?

కొర్సెటెడ్ లుక్: సన్నగా ఉండే అమ్మాయిలకు ఈ లుక్ ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. బూట్ కట్ ఫర్ ఫెక్ట్ లుక్ అందిస్తుంది.

జీన్స్ డ్రెస్సింగ్ లో లేటెస్ట్ ఫ్యాషన్ ఏది....?

జీన్స్ మరియు గుంజి: కత్రినాకైఫ్ జీన్స్ మరియు బ్రైట్ కలర్ టీషర్ట్ తో మరీ సన్నగా, హైహీల్ బూట్స్ ధరించి షైనీ లుక్ తో కనబడుతోంది.

జీన్స్ డ్రెస్సింగ్ లో లేటెస్ట్ ఫ్యాషన్ ఏది....?

రాక్ స్టార్ లుక్: మీరు బ్రైట్ కలర్జీన్స్ ఎంపిక చేసుకొనేటప్పుడు దాని మీదకు స్టైలిష్ గా కనబడే మంచి షైనింగ్ ఇచ్చే జాకెట్ ను ధరించాలి. అందులోనికి పెన్సిల్ హీల్ లుక్ తో రాక్ స్టార్ లా కనబడుతారు.

జీన్స్ డ్రెస్సింగ్ లో లేటెస్ట్ ఫ్యాషన్ ఏది....?

బ్లాజర్ అండ్ జీన్స్: మీరు సాధారణ జీన్స్ ధరించి టాప్ లుక్ ఫాషనబుల్ గా కనబడేలా టీషర్ట్, జాకెట్ ధరిస్తే సింపుల్ బ్లాజర్ గా ఇలా కనబడుతారు. అయితే ఇవి మీ శరీరానికి ఫర్ ఫెక్ట్ గా ఫిట్ అయ్యేలా చూసుకోవాలి.

జీన్స్ డ్రెస్సింగ్ లో లేటెస్ట్ ఫ్యాషన్ ఏది....?

జీన్స్ అండ్ కన్వర్సే: జీన్స్ లోకి క్యాన్ వాస్ షూలు మరియు దాని మీదకు జాకెట్ దరించడం వల్ల మళ్ళీ టీనేజ్ లుక్ ను పొందినట్లే...

జీన్స్ డ్రెస్సింగ్ లో లేటెస్ట్ ఫ్యాషన్ ఏది....?

జీన్స్ మరియు టీ షర్ట్: లైట్ గ్రీన్ కలర్ జీన్స్ మీదకు పీచ్ కలర్ టీషర్ట్ ఫర్ ఫెక్ట్ లుక్ ఇస్తోంది. ఈ డ్రెస్ లో దీపిక మరింత ఆకర్షణీయంగా కనబడుతోంది.

జీన్స్ డ్రెస్సింగ్ లో లేటెస్ట్ ఫ్యాషన్ ఏది....?

జీన్స్ మీదకు వివిధ రంగులు: బ్లూ జీన్స్ మీదకు బ్రైట్ కలర్ టీషర్ట్, దాని మీదగు ఫైనింగ్ లుక్ ఇచ్చే జాకెట్ ఆకర్షణీయంగా కనబడుతోంది.

జీన్స్ డ్రెస్సింగ్ లో లేటెస్ట్ ఫ్యాషన్ ఏది....?

గిర్లి లుక్: ఇటువంటి జీన్స్ ధరించడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది అందులో షోల్డర్ నెట్ టాప్ చాలా హాట్ గా కనబడుతోంది.

Story first published: Monday, February 4, 2013, 13:05 [IST]
Desktop Bottom Promotion