Latest Updates
-
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు!
శృంగార తారగా కాకుండా.. భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా కేన్స్ లో విద్యాబాలన్
ఏ దేశమేగినా ఎందు కాలిడినా.. ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా... పొగడరా నీ తల్లి భూమి భారతిని... నిలుపురా నీ జాతి నిండు గౌరవము...' అనే దేశభక్తి గీతానికి తగ్గట్టుగా విద్యాబాలన్ మన దేశప్రతిష్టను కాపాడే వస్త్రధారణలో వేడుకలకు హాజరు కావడం విశేషం. సినిమాల్లో మినహా విడిగా నిండైన చీరకట్టులో కనిపించే విద్యా ఈ వేడుకల్లో పాశ్చాత్య దుస్తుల్లో కనిపిస్తారని చాలామంది ఊహించారు. కానీ, మన భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే వస్త్రధారణలో కాన్స్ వేదికపై మెరిసి, శభాష్ అనిపించుకున్నారామె. పైగా, మనదైన శైలిలో ‘నమస్కారం' అంటూ ఆమె అభివాదం చేయడం అందర్నీ ఆకర్షించింది.
‘నిద్రపోయేటప్పుడు కూడా నన్ను నేను నిండైన చీరకట్టులో చూసుకుంటాను. కాన్స్‌లో కూడా అలానే కనిపిస్తాను. భారతీయ సంప్రదాయాన్ని సూచించే దుస్తులే ధరిస్తాను' అంటూ విద్యా పేర్కొన్నారు. ప్రారంభోత్సవం నాడు వేదికపై హాఫ్ వైట్, బ్లాక్ లెహెంగా, చోళీలో తళక్కుమన్న విద్యా ఆ తర్వాత కాక్‌టైల్ పార్టీకి మెరూన్ కలర్ లెహెంగా, చోళీలో దర్శనమిచ్చారు. అలాగే హాఫ్‌వైట్ నూలు చీరలో చాలా నిరాడంబరంగా కనిపించారు. ఈ మూడు దుస్తుల్లోనూ ఆమె చాలా సంప్రదాయబద్ధంగా కనిపించారు.
శృంగార తారగా పేరొందిన 35ఏళ్ల విద్యాబాలన్ భారత సంప్రదాయానికి చిహ్నమైన చీరకట్టుతో అంతర్జాతీయ కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటోంది. బాలీవుడ్ అందాలతార విద్యా బాలన్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ పదిమంది జ్యూరీలో సభ్యురాలిగా పాల్గొంటోంది. ఈ ఫెస్టివల్‌లో తనకు న్యాయనిర్ణేతగా అవకాశం లభించినందుకు ఎంతో సంతోషాంగా ఉందని తెలిపింది. ఈ చిత్రోత్సవంలో ఆమె భారతీయ సంప్రదాయ వస్త్రాల్లో దర్శనమిస్తూ కనువిందుచేస్తోంది. ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన వస్త్రాల్లో ఆమె ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడిచేస్తున్నారు.

తుస్సార్ సిల్క్ శారీ:
ఈ ట్విన్ షేడ్ తుస్సార్ సిల్క్ శారీలో శ్వాసపీల్చుకోలేని విధంగా కనువిందు చేశారు. ఓ అందమైన చిరునవ్వుతో రెడ్ కార్పెట్ మీద అలా దర్శనమిచ్చారు.

సవ్వసాచి:
బంగారు వర్ణపు పైస్లే వర్క్ మరియు చివర్లలో బ్రౌన్ కలర్ గోల్డ్ బ్రైడ్ ట్రిమ్ చేసిన ఈ గ్రీన్ షుడ్ శారీ వావ్...!అద్భుతం. ఈ శారీని తన డిజనైర్ ఫ్రెండ్ సవ్వసాచి డిజైన్ చేసినవి. ప్రస్తుతం జరగుతున్నా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు సంబంధించి విద్యాబాలన్ అవుట్ ఫిస్ట్ ఈ సవ్వసాచి మాత్రమే తయారు చేశారు.

మెరూన్ రెడ్ బ్లౌజ్:
ఈ గ్రీన్ షేడ్ సిల్క్ శారీ మీదకు మెరూన్ రెడ్ బ్లౌజ్ అద్బుతంగా ఆకట్టుకొన్నది. ఫుల్ స్లీవ్ నెక్ లైన్ బ్లౌజ్ విద్యకు బాగా సూట్ అయ్యింది.

పొట్లి:
విద్య స్టైల్ కు శారీకి సరిగ్గా మ్యాచ్ అయ్యే విధంగా పొట్లి(చిన్న హ్యాడ్ బ్యాగ్)చేతిలో ఇది మరో ఆకర్షణ. ఈ పూర్తి దేశీ లుక్ లో విద్య ధరించిన అమరపల్లి సర్క్యులర్ డ్రాప్ ఇయర్ రింగ్స్, బంగారు గాజులు, మల్టీ స్టోన్ ఫింగర్ రింగ్స్ అద్భుతంగా..ఆకర్షణీయంగా సింపుల్ గా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.

కళ్ళు:
విద్య కళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే!ఎందుకంటే తన అందమైన కళ్ళు, మత్తు కళ్ళు, ఆ కళ్ళ అందానికి అద్భుతంగా తీర్చి దిద్దిన కను బొమ్మలు..కాన్స్ లో ఆమె అందం వర్ణణాతీతంగా ఉంది.

కాన్స్ మొదలైన రెండవ రోజున:
కాన్స్ మొదలైన రెండవ రోజున విద్యబాలన్ చూడటానికి ఫాషన్ డిజాస్టర్ గా కనిపించారు. సవ్యసాచి డిజైన్ చేసిన ఆ చీర అద్భుతం. అయితే, విద్యబాలన్ ధరించిన ముక్కు రింగ్ తన పూర్తి అందాన్ని హరించినట్లు కనబడుతోంది.

సోనమ్ కపూర్ ను అనుకరించి:
సోనమ్ కపూర్ కాన్స్ మొదటి రోజున రెడ్ కార్పెట్ మీద ప్రదర్శించింది. మొదటి రోజున సోనమ్ కపూర్ నోస్ రింగ్(ముక్క రింగ్ )ధరించడం వల్ల.. విద్య కూడా ప్రయత్నించారు. కానీ అది ఆమె అందానికి సరిపోలేకపోయింది.

ప్రారంభ వేడుక:
కేన్స్ 2013 ప్రారంభోత్సవంలో, విద్యాబాలన్ పూర్తి ఫ్యాషన్ డిజాస్టర్. తను ధరించిన లహంగా మరియు పల్లూ అద్భుతమైన ఫ్యాషన్ ఫాక్స్ పాస్ ఉన్నాయి.

డల్ క్రీమీ వైట్:
ఈ డ్రెస్ లో విద్య చూడటానికి పాత కాలపు స్త్రీలా పూర్తి సాంప్రధాయకరంగా ఆకర్షించారు. పూర్తి క్రీమ్ వైట్ శారీలో పూసల నెక్ లెస్ పెద్ద ఇయర్ రింగ్స్ తో అలరించారు.

రెడ్ కలర్ లో:
2013కేన్స్ కు చేరుకొన్నప్పుడు విద్య రెడ్ కలర్ డ్రస్ లో వచ్చారు. కాన్స్ కు రావడానికి ముందు సవ్వసాచి డిజైన్ చేసిన లెహంగా దానికి మీదకు బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ జెర్రీతో అలరించారు.

రెడ్ శారీలో మెరిపించారు:
కేన్స్ 2013 రెడ్ కార్పెట్ మీద ఒక నక్షత్ర తారలా విద్యాబాలన్ నిలబడ్డారు. రెడ్ శారీమీదకు ముత్యాల హారం, ముత్యాల చెవిరింగ్ లు అద్భుతంగా అకట్టుకొన్నాయి.

న్యూడ్ కలర్డ్ లెహంగా :
విద్యాబాలన్ కేన్స్ 2013 ప్రారంభోత్సవానికి ధరించిన న్యూడ్ కలర్డ్ లెహంగా పలువురిని ఆకట్టుకొన్నది. అంతే కాదు మనదైన శైలిలో ‘నమస్కారం' అంటూ ఆమె అభివాదం చేయడం అందర్నీ ఆకర్షించింది.



Click it and Unblock the Notifications











