ప్రస్తుత ట్రెండ్ ను అలరిస్తున్న టాప్ 10 లిప్ స్టిక్ కలర్స్

లిప్ స్టిక్స్ ట్రెండ్ ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ప్రతి సీజన్ లోనూ ట్రెండ్ కు తగ్గట్టుగా డిఫరెంట్ లిప్ స్టిక్ షేడ్స్ వస్తుంటాయి. ఇక ఈ మాన్ సూన్ లో ట్రెండింగ్ లిప్ కలర్స్ బెర్రీ షెడ్స్ లో ఇట్టే ఆకర్షించేస్తున్నాయి. బెర్రీ లిప్ కలర్స్ నేచురల్ షేడ్స్ ఇవి వివిధ రకాల సిట్రస్ బెర్రీస్ అంటే స్ట్రాబెర్రీ, మల్బెర్రీ మొదలగునవి. ఈ బెర్రీ లిప్ కలర్ లిప్ స్టిక్స్ ఈ మాన్ సూన్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. మాన్ సూన్ మేకప్ తో నిస్తేజంగా ఉన్న వాతావరణాన్ని ఓడించి ప్రకాశవంతంగా మెరుసేలా చేస్తుంది.

ప్రస్తుత రోజుల్లో చాలా మంది సెలబ్రెటీలను బెర్రీ లిప్ కలర్స్ లో చూస్తూనే ఉన్నాం. ఈ ట్రెండింగ్ లిప్ కలర్స్ 2013కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నుండి చాలా పాపులర్ అయినాయి. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో చాలా మంది సెలబ్రెటీలను వారి నచ్చిన ట్రెండీ బెర్రీ లిప్ కలర్స్ లిప్ స్టిక్ లను వాడారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఉత్తమ రంగుల్లో వివిధ రకాల షేడ్స్ లో ఉన్నాయి.

వీటిలో కొన్ని లిప్ స్టిక్ షేడ్స్ చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. మరి కొన్ని పరిమితమైనవి మరియు ప్రతి రోజూ ధరించే దుస్తులకు అనుకూలంగా ఉన్న లిప్ స్టిక్స్ కూడా ఉన్నాయి. అందుకని, మీ చర్మ ఛాయకు సరిపడే, మీకు నచ్చే మరియు మీరు మెచ్చే బెర్రీ లిప్ కలర్స్ ను ఎంపిక చేసుకోండి. మరి ఈ మాన్ సూన్ సీజన్ కు మీకు నచ్చే మీరు మెచ్చే ట్రెండింగ్ లిప్ కలర్స్ ను బోల్డ్ స్కై ఎంపిక చేసింది. వీటిలో మీకు నచ్చిన కలర్ ను ఎంపిక చేసుకొని మాన్ సూన్ మేకప్ తో బెర్రీ లిప్ కలర్స్ తో ఎదుటి వారి మనుషులను కొల్లగొట్టండి.

వర్షం కాలంలో అట్రాక్షన్ గా కనిపించే బెర్రీ లిప్ కలర్స్!

స్ట్రాబెర్రీ రెడ్: ఈ బ్రైట్ అండ్ డెలిషియస్ రెడ్ కలర్ తాజా బెర్రీ షేడ్స్ ను కలిగి ఉంటాయి. ఈ కలర్ ను వైట్ అండ్ బ్లాక్ సూట్ మీదకు అప్లై చేసుకోవచ్చు. అలాగే అన్ని రకాల చర్మఛాయలకు బాగా నప్పుతుంది.

వర్షం కాలంలో అట్రాక్షన్ గా కనిపించే బెర్రీ లిప్ కలర్స్!

గోజి బెర్రీ మెరూన్: ఈ లిప్ కలర్ టెక్నికల్ గా మెరూన్ కలర్ లో కనబడుతుంది. కానీ బెర్రీ కలర్స్ లో ఇది బాగా పండిన గోజి బెర్రీ కలర్. ఈ మెరూన్ కలర్ ఎల్లో, బ్లూ, మరియు గ్రీన్, బ్లాక్ డ్రెస్సులకు బాగా నప్పుతుంది.

వర్షం కాలంలో అట్రాక్షన్ గా కనిపించే బెర్రీ లిప్ కలర్స్!

కొంచెం హనీ సకెల్ కలర్: ఇక్కడ మాధురీ దీక్షిత్ వేసుకొన్న కొంచె పింకె -రెడ్ గ్లో చాలా అద్భుతంగా ఉంది. లైట్ బెర్రీ షేడ్స్ ఇలాగే ఉంటాయి. ఊదా రంగులో మరియు ఎరుపు మిణుగుర రంగులో ఉండేటటువంటి ఈ బెర్రీలు చాలా అరుదుగా ఉన్నాయి. ఈ రంగులను డేటైమ్ లో ధరించడం వల్ల చాలా సింపుల్ గా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది.

వర్షం కాలంలో అట్రాక్షన్ గా కనిపించే బెర్రీ లిప్ కలర్స్!

న్యూడ్ మల్బరీ: మల్బెర్రీస్ ఊదా మరియు గులాబీ రంగుల మధ్య ఒక వింత రంగును కలిగి ఉంటుంది. ఈ రంగు ప్రత్యేకమైనటువంటి షైనీ షేడ్ ను కలిగి ఉంటుంది. ఒక్కో సందర్బంలో ఇది ఫైరీ ఆరెంజ్ లా కనిపిస్తుంది.

వర్షం కాలంలో అట్రాక్షన్ గా కనిపించే బెర్రీ లిప్ కలర్స్!

రాస్ప్బెర్రీ పింక్: రాస్ప్బెర్రీస్ ఒక స్పష్టమైన ఊదా రంగులో ఉండటంతో పాటు ఎరుపు రంగును కలిగి ఉంటుంది. ఈ గులాబీ రంగ్ లిప్ స్టిక్ ఫ్రెష్ నేచురల్ గులాబీ రంగును కలిగి ఉంటుంది. ఈ కలర్ లిప్ స్టిక్స్ ను సిల్వర్ మరియు గోల్డ్ కలర్ దుస్తుల మీదకు బాగా నప్పుతాయి.

వర్షం కాలంలో అట్రాక్షన్ గా కనిపించే బెర్రీ లిప్ కలర్స్!

బ్లాక్ ఎండుద్రాక్ష: ఈ ముదురు మాజెంటా లిప్ కలర్ ఒక బాగా పండిన బ్లాక్బెర్రీ నుండి వెలువడే జ్యూస్ కలర్ వంటిది. మీరు చాలా ఫేయిర్ గా ఉన్నట్లైతే, అప్పుడు ఈ లిప్ కలర్ మీకు బాగా నప్పుతుంది.

వర్షం కాలంలో అట్రాక్షన్ గా కనిపించే బెర్రీ లిప్ కలర్స్!

మౌంటైన్ బెర్రీ పింక్: ఈ తాజా లిప్ కలర్ ఒక సున్నితమైన మేకప్ మీదకు చాలా ఆదర్శంగా ఉంటుంది. పాస్టెల్ కలర్ దుస్తులు మీదు ఈవెనింగ్ టైమ్స్ లో ఈ లిప్ కలర్ ను ఉపయోగించవచ్చు.

వర్షం కాలంలో అట్రాక్షన్ గా కనిపించే బెర్రీ లిప్ కలర్స్!

క్రాన్ బెర్రీ: బ్లడ్ రెడ్ కలర్ లో ఉండే స్పెషల్ వెరైటీ బెర్రీస్ లో క్రాన్ బెర్రీ ఒకటి. ఇది ఒక ప్రత్యేకమైన రకం. మీరు ధరించి మేకప్ మరింత ప్రకాశవంతంగా కనిపించేలా చేసుకోవాలనుకుంటే బ్లడ్ రెడ్ కలర్ ను ఎంపిక చేసుకోవచ్చు.

వర్షం కాలంలో అట్రాక్షన్ గా కనిపించే బెర్రీ లిప్ కలర్స్!

వైన్ బెర్రీ లిప్స్: ఈ డార్క్ మెరరూన్ కలర్ వైన్ తయారీ కోసం ద్రాక్షను తయారు చేసేటప్పులు ఇదే కలర్ ను పోలి ఉంటుంది. అందుకే, ఈ లిప్ కలర్ ను వైన్ కలర్ గా పిలుస్తుంటారు. ఈ కలర్ బ్లాక్ అండ్ బ్లూ డ్రెస్సుల మీదకు బాగా నప్పుతుంది.

Desktop Bottom Promotion