For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖ అందం రెటింపుచేసేలా పౌడర్ వేసుకోవడం ఎలా

|

అందంగా కనిపించాలని ప్రతి మహిళా ఉబలాటపడుతుంది. అయితే అందరూ పుట్టుకతోనే అందగత్తెలు కారు కదా..! ఎక్కువమంది చూడటానికి సామాన్యంగా ఉంటారు. వీరు తమ అందానికి కొద్దిగా మెరుగుల దిద్దుకుంటే అందంగా కనిపిస్తారు. మరికొంతమంది పుట్టుకతోనే అందగత్తెలుగా ఉంటారు. కానీ ఎంతటి అందగత్తెలైనా సరైన అలంకరణ చేసుకోకపోతే పేలవంగా, నిర్జీవంగా కనిపిస్తారు.
నగరాల్లో నివసించేవారు క్రీములు, మాయిశ్చరైజ్‌లు, స్కిన్‌లోషన్లు, పౌడర్లు వాడితే.. మారుమూల గ్రామల మహిళలు కనీసం పౌడర్‌నైనా వాడుతున్నారు. చర్మతత్వాన్ని బట్టి పౌడర్‌ వాడకం ఉండాలి. ఎవ్వరు ఎలాంటి పౌడర్లు వేసుకుంటే చర్మం సున్నితంగా ఉంటుందో తెలుసుకుందాం.

5 Ways To Apply Face Powder Correctly

పౌడర్ ను మీ చర్మ రంగును బట్టి స్కిన్ పౌడర్ ను సెలక్ట్ చేసుకోవాలి. పౌండేషన్ అప్లయ్ తేశాక ముఖానికి పౌడర్ అద్దాలి. ఈ పౌడర్ యూనిఫాంగా వుండాలి. ఫౌడర్‌ని అతిగా అప్లయ్ చేయడం మంచిది కాదు. ఎక్సెస్ ఫౌడర్‌ని రిమూవ్ చేసుకోవాలంటే పఫ్‌తో నెమ్మదిగా తుడిచి వేయాలి. తర్వత సున్నితంగా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి.

పొడిచర్మం: పొడిచర్మంవారు, చర్మం మడతలు పడినవారు క్రీమ్ పౌడర్ను ఉపయోగించాలి. దీనివల్ల చర్మం మృదువుగా తయారవుతుంది.

జిడ్డుచర్మం: మాయిశ్ఛరైజింగ్ ఎపెక్ట్స్ ఇచ్చే ఫేస్ పౌడర్ కొనుక్కోవాలి.

యూత్ పౌడర్: టీనేజ్ అమ్మాయిలు షమ్మర్ పౌడర్ అప్లై చేసుకుంటే వారిలో అందం మాత్రమే కాదు ముఖానికి చక్కటి మెరపు వస్తుంది.

ఈవినింగ్ పౌడర్: సాయంత్రం వేళల్లో అందునా పార్టీలకు వెళ్లేటప్పుడు గ్లిట్టర్ పౌడర్ ఉపయోగించాలి.

పౌడర్ రాసుకోవడం ఎలా? మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత పౌడర్ రాసుకుంటే బాగుంటింది. పౌండేషన్ అప్లై చేసినప్పుడు ముందుగా ఫౌండేషన్ క్రీమ్ ముఖం మీద సరిగ్గా సెట్ అయిందా లేదో చూసుకోవాలి. ఆ తర్వాత ఫౌడర్ రాసుకోవాలి. ముందుగా పఫ్ తో ఫౌడర్ అద్ది ముఖానికి అద్దండి ఎప్పడూ పఫ్ తో పౌడర్ రాసుకోవద్దు. పౌడర్ ముఖానికి అద్దడానికి పఫ్ వాడండి, ఆ తర్వాత పౌడర్ బ్రష్ తీసుకుని ఫౌడర్ సరి చేయండి. ఫేస్ పఫ్ తో మీడియం సైజులో చక్కటి ఆకరం కలిగి మంచి కలర్స్ లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

అందులో మీ చర్మ తత్వానికి తగ్గ ఫేస్ పఫ్ ను ఎంపిక చేసుకోవాలి. పౌడర్ ను అప్లై చేయడానికి కంటే పౌడర్ అప్లై చేసి బ్రష్ లు తక్కువ పౌండర్ ను అప్లై చేసి సహజంగా కనబడలే చేస్తుంది. ఒకే సారిఎక్కువగా పౌడర్ ను అప్లై చేయకూడదు. ముందుగా బ్రష్ తో పౌడర్ లో అద్ది ముఖానికికంతటికి అప్లై చేయాలి. ఇలా చిన్న చిన్న టిప్స్, ట్రిక్స్ ఉపయోగించినట్లైతే ముఖం అందంగా.. ఆకర్షణీయంగా కనబడుతుంది.

English summary

5 Ways To Apply Face Powder Correctly

There are some people who are in love with face powder and make utter use of it to look fresh and fairer. However, too much of powder on the face may make you look funny and absurd. There are five ways to apply face powder correctly and if these procedures are followed step by step, we can assure you that in the end you will look beautiful.
Story first published: Thursday, May 29, 2014, 18:29 [IST]
Desktop Bottom Promotion