Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
మీ స్కిన్ టోన్ కు తగ్గ లిప్ స్టిక్ ను ఎంపిచేసుకోవడం ఎలా
ఆడవాళ్లు ఎన్ని రకాలుగా రెడీ అయినప్పటికీ ఇంకా ఏదో లోటు ఉందనే అనుకుంటారు. ఎంత అందంగా మేకప్ వేసుకున్నా కూడా...అందమైన పెదవుల దగ్గరికి వచ్చేసరికి ఎలాంటి లిప్‌స్టిక్ వాడాలి అనే విషయంలో సందేహాలు ఉండనే ఉంటాయి. కొంత మంది తెలిసీ తెలియకవాడే లిప్‌స్టిక్‌లు అందానికి దిష్టిచుక్కలా కనబడతాయి. స్కిన్ టోన్ (చర్మఛాయ)కు, పెదవుల రంగుకు సరిపోయే లిప్‌స్టిక్‌ను ఎంచుకోవడం ద్వారా స్త్రీలు తమ అందాన్ని మరింతగా పెంచుకోవచ్చు.
లిప్‌స్టిక్‌ను పెదవులకు అప్లై చేసిన తర్వాత అండర్ టోన్ కలర్ ద్వారానే అసలు షేడ్ కనబడుతుంది. ఇది కచ్చితంగా తెలుసుకోవాలంటే మీరు ఒక తెల్ల కాగితం మీద చిన్న మరకలాగా లిప్‌స్టిక్‌ను రాసి టేస్ట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇన్నర్ షేడ్ ఎలా కనబడుతుందో పరిశీలిస్తే మీకు అర్థం అవుతుంది. మామూలుగా చర్మం మీద అప్లై చేస్తే లిప్‌స్టిక్ ఇన్నర్‌షేడ్‌ను కచ్చితంగా తెలుసుకోవడం కష్టం.
కాబట్టి మీ స్కిన్ టోన్, పెదాల రంగును బట్టి లిప్‌స్టిక్ అండర్‌టోన్‌లు ఎంపిక చేసుకోవడానికి కొన్ని మార్గాలు క్రింది విధంగా ఉన్నాయి..

1. ఎరుపు లేదా పింక్: ఈ లిప్‌స్టిక్‌లు చూసేందుకు కొంత గాఢమైన అనుభూతిని ఇస్తాయి. మీ శరీరఛాయలో కూడా ఎరుపు రంగు ఉంటే ఇది పూర్తిగా మీకు సూట్ అవుతుంది. ఒక్క పెదవుల రంగే కాదు శరీరం రంగును కూడా లిప్‌స్టిక్ విషయంలో పరిశీలించండి.
2. పసుపు లేదా ఆరెంజ్: ఇవి సున్నితమైన ఫీలింగ్‌ను కలగజేస్తాయి. ఇది ఉపయోగించాలంటే, శరీరం రంగుకూడా ముదురుగా ఉండాలి. అంటే తెల్లని తెలుపు, లేదా బాగా ఎరుపు రంగు చర్మం ఉన్నవారు దీన్ని ఉపయోగించాలి. పాలిపోయినరంగు ఉన్న వారికి ఈ లిప్‌స్టిక్ సరిపోదు.
3. నీలం: అవతలి వారు మిమ్మల్ని చూడగానే ఆకర్షించేలా చేస్తాయి. ఈ రంగులు అంటే గాఢమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. వీటిని రాత్రి పూట వాడడం కంటే పగటిపూట వాడితేనే బాగుంటుంది. ఈ లిప్‌స్టిక్‌లు వాడితే మీరు ఒక ఫ్లోరోసెంట్ కింద నిలబడి, అది మీ పెదవులపై ప్రతిబింబిస్తుందన్న అనుభూతిని కలిగిస్తాయి. కాబట్టి వీటిని అరుదైన సందర్భాల్లో తప్ప రోజూ వాడకుంటే మంచిది.
4. సిల్వర్, బూడిద రంగు : ఇవి రాత్రిపూట ఎక్కువగా ఉపయోగించేందుకు వీలుగా ఉంటాయి. ఎందుకంటే ఇవి పెదవులకు మెరుపును ఇస్తాయి తప్ప గాఢమైన ప్రభావాన్ని కలిగించవు. దీనివల్ల పెదవులు సున్నితమైన మెరుపును కలిగి ఉంటాయి. లైట్ల వెలుగు వీటిమీద పడి తగినంతగా మాత్రమే ప్రతిఫలిస్తుంది.
5. ఆకుపచ్చ: దీన్ని ఎక్కువగా వాడకుండా ఉంటే మంచిది. ఈ రంగు చూసేందుకు మరీ ప్రత్యేకంగా కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications
