Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
నల్లిని పెదవులకు లిప్ స్టిక్ ఎంపిక చేసుకోవడం ఎలా?
సాధారణంగా ముఖంలో అందంగా కనబడాలంటే కళ్ళు, తర్వాత స్థానం పెదాలకు వెళుతుంది. పెదాలు అందంగా సహజంగా ఉంటే ఆ అందం మరింత గొప్పగా తెలుస్తుంది. కొంత మందికి పెదాలు నల్లగా ఉంటాయి. అయినా కూడా పెదాలకు లిస్టిక్ వాడరు. అది వారకి నచ్చకపోవడం లేదా ఫర్ ఫెక్ట్ లిప్టిక్ కలర్స్ ను ఎంపిక చేసుకోవడం తెలియకపోవడం. డార్క్ లిప్స్ కలవారు వారికు ఫర్ ఫెక్ట్ గా నచ్చేటటువంటి కొన్ని లిప్ స్టిక్స్ ఇక్కడ అంధిస్తున్నాం. మేకప్ చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోనటువంటి బ్యూటీ ప్రొడక్ట్ లిప్ స్టిక్. మీరు అందంగా కనబడాలంటే, మంచి మన్నికైన లిప్ స్టిక్ ను ఎంపిక చేసుకోవాలి. అది మిమ్మల్ని ఎల్లప్పుడు అందంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఒక పార్టీకి కానీ లేదా పెళ్ళికి గానీ పూర్తిమేకప్ తో వెళ్ళేటప్పుడు అది అసంపూర్ణంగా భావిస్తారు?
ఎవరైతే డార్క్ స్కిన్ కలిగి ఉంటారో వారు, వారి స్కిన్ టోన్ కు లిప్ స్టిక్ సరిపోదని భావిస్తుంటారు. బ్యూటి ఎక్స్ పర్ట్ ప్రకారం, డార్క్ స్కిన్ కలిగినటువంటి మహిళల కోసం కొన్ని లిప్ కలర్స్ ఉన్నాయి. వాటిని అప్లై చేయడం వల్ల అందంగా కనబడుతారంటారు. నల్లగా ఉండే వారు డార్క్ కరల్స్ మరియు బోల్డ్ కలర్స్ ను నివారించడం ఉత్తమం. ఈ రెండుకలర్స్ వారి స్కిన్ టోన్ కు మ్యాచ్ అవ్వవు. లైట్ కలర్స్ బాగా నప్పుతాయి.
నల్లగా మారిన పెదాలను అందంగా మార్చుకోవడం ఎలా?
ఈ చిట్కాలను మీరు మనస్సులో ఉంచుకోవడం వల్ల, ఎప్పుడైనా మీరు షాపింగ్ కు వెళ్ళినప్పుడు వీటిని కొనుగోలు చేయవచ్చు. ఈ బ్యూటీ టిప్స్ ఉపయోగకరమైనవి . ఈ బ్యూటిఫుల్ లిప్ స్టిక్స్ మీ డార్క్ లిప్స్ అప్లై చేయండి మరియు లిప్ స్టిక్ అప్లై చేయడం ద్వారా అందంగా డ్రెస్ చేయడం వల్ల పెదాలు మరింత అందంగా ఉంటాయి. దాంతో మీకు ఆశ్చర్యకంగా మీకు కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి. డార్క్ లిప్ కోసం క్రింద కొన్ని లిప్ స్టిక్ షేడ్స్ ఇవ్వబడినవి, ఇవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోండి..

ప్లమ్ కలర్:
మీరు ఛామన ఛాయలో కనబడుతుంటే, అప్పుడు మీరు ప్లమ్ కలర్ ను ఎంపిక చేసుకోవాలి. ఈ ప్లమ్ లిప్ కలర్ చూడాటనికి ఫుల్ గా మరియు బ్యూటిఫుల్ గా కనబడేలా చేస్తుంది.

చెర్రీ:
చెర్రీకలర్ కొంచె ఇంచుమించు ప్లమ్ కలర్ కు దగ్గరగా ఉంటుంది. అందువల్ల, ఈ బోల్డ్ లిప్ స్టిక్ షేడ్ ను అందరూ ఎంపిక చేసుకోకూడదు. కాబట్టి, చెర్రీ కలర్ ఎంపిక చేసుకొనేటప్పుడు కాస్త జాగ్రత్తగా పరిశీలించి, మీ స్కిన్ టోన్ కు సరిపోయేది ఎంపిక చేసుకోండి.

బ్రౌన్:
డార్క్ లిప్స్ కలిగిన వారు బ్రౌన్ కలర్ ఎంపిక చేసుకోవడం ఒక ఉత్తమ మార్గం. ఇది స్కిన్ టోన్ కు ఫర్ ఫెక్ట్ మ్యాచ్ కాబట్టి, అందంగా కూడా కనబడుతుంది.

కోకా కలర్:
కోకా కలర్, డార్క్ లిప్స్ కలిగిన మహిళలు లిప్ స్టిక్ ఎంపికకు ఒక సురక్షితమైన ఎంపిక. కోకా ఒక తేలికపాలిటి కలర్ ఇది ఒక జెంటిల్ లుక్ ను అంధిస్తుంది.

కోరల్:
డార్క్ లిప్ స్టిక్ కలిగిన వారు ఎంపిక చేసుకొనే మరో లిప్ కలర్ కోరల్ కలర్. కానీ ఈ లిప్ స్టిక్ ఎంపిక చేసుకోవడంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కలర్ డార్క్ కాంప్లెక్షన్ మీద చూడటానికి కొంచెం బ్రైట్ గా అనిపించవచ్చు. ఎమైనా మీకు మేకప్ అంటే ఇష్టమైనప్పుడు ఇటువంటి కలర్స్ ఎంపిక చేసుకోవడం ఒక ఉత్తమ ఎంపిక.

మావ్:
వైలెట్ కు దగ్గరగా ఉండే ఏ కలర్ అయినా సరే డార్క్ స్కిన్ టోన్ కలిగిన మహిళలకు సురక్షితమైన ఎంపిక. డార్క్ లిప్స్ కు మావ్ కలర్ ఒక బెస్ట్ లిప్ స్టిక్ చాయిస్.

డార్క్ రెడ్:
ఇంతకు ముందు మనం చూసిన కోరల్ లిప్ స్టిక్ మాదిరిగానే, డార్క్ లిప్స్ కోసం మరో లిప్ షేడ్ ఇది. డార్క్ కాంప్లెక్షన్ కలిగిన అందరు మహిళలు ఈ డార్క్ రెడ్ కలర్ షేడ్ లిప్ కలర్ ను ఎంపిక చేసుకోకూడదు. అయితే బోల్డ్ కలర్ డ్రెస్సులను ధరించేటప్పుడు ఇటువంటి డార్క్ రెడ్ కలర్ లిప్ షేడ్స్ ను ఎంపిక చేసుకోవచ్చు.

షిమ్మర్ పింక్:
డార్క్ కంప్లెక్షన్ కలిగిని మహిళలు చాలా మంది ఈ షిమ్మరింగ్ పింక్ కలర్ ను ఎంపిక చేసుకోవచ్చు. డార్క్ లిప్స్ కొరకు ఈ బ్యూటిఫుల్ లిప్ స్టిక్ షేడ్స్ అద్భుతంగా ఉంటాయి.

బ్రోంజ్:
లిప్ స్టిక్ షేడ్స్ లిస్ట్ లో బ్రోంజ్ ఒక డేరింగ్ కలర్. బ్రోంజ్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ మీ పెదాలను మరింత అందంగా కనబడేలా చేస్తుంది.

న్యూడ్:
డార్క్ కాంప్లెక్షన్ స్కిన్ టోన్ కలిగిన వారికి న్యూడ్ ఒక సురక్షితమైన ఎంపిక. డార్క్ లిప్స్ కు న్యూడ్ లిప్ స్టిక్ ఎంపిక చేసుకోవడం వల్ల మీ పల్చగా ఉండే పెద్దాలు పెద్దగా అందంగా ఫుల్ గా కనబడేలా చేస్తుంది.



Click it and Unblock the Notifications