For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రి పండుగ స్పెషల్ అందంగా కనబడటానికి మేకప్ టిప్స్

By Staff
|

నవరాత్రి తొమ్మిది రోజుల పండుగ సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభం అవుతుంది. మీ రూపం మెరుగుపర్చడానికి, మీరు మిరుమిట్లు గొలిపే దుస్తులను ధరించటమే కాకుండా సరైన మేకప్ చిట్కాలు కూడా అవసరం. మీకు ఎటువంటి అవాంతరం లేకుండా మీ రూపాన్ని సెట్ చేయటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

1. మీ ముఖం ప్రకాశవంతముగా ఉండుట
ఈ పండుగ సీజన్లో మీ ముఖం మీద ప్రకాశవంతమైన ప్రభావం ఉండటానికి ఒక బేస్ ఫౌండేషన్ అవసరం ఉంటుంది. ప్రొఫెషనల్ మేకప్ కళాకారుడు మరియు హెయిర్ స్టైలిస్ట్ అర్శిస్ జవెరి మీ ముఖం తప్పనిసరిగా ప్రకాశవంతంగా ఉండాలని సూచించారు. ప్రకాశ వంతమైన ఫౌండేషన్ ద్రవ లేదా క్రీమ్ రూపంలో ఉపయోగించండి. వెంటనే చెంప బోన్స్ మరియు మీ చర్మం లిఫ్ట్ మరియు ప్రకాశవంతముగా మారుతుంది. వాతావరణ ఫీలింగ్ అనుభూతి ఉన్నప్పుడు మీ చర్మం మంచి లుక్ కోసం ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. వేర్వేరు వివిధ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సులంభంగా ఉపయోగించటానికి, మీరు MAC యొక్క ఐకానిక్ స్ట్రోబ్ క్రీమ్ ను ప్రయత్నించండి.

Navratri Special — Look stunning with these make-up tricks

2. మంచి సమన్వయం
మీరు మీ దుస్తులకు మొత్తం 'మ్యాచింగ్' అవసరం లేదు. కానీ మీరు తప్పనిసరిగా బాగా మిళితం అయిన ఒక రూపాన్ని ధరించవచ్చు. గోళ్ళ రంగుతో ఒక ప్రకాశవంతమైన పెదవి రంగు సరిపోతే,మీ రూపానికి ఈ రంగు యొక్క సూక్ష్మ పాప్స్ జోడించడానికి గొప్ప మార్గమని అర్శిస్ సూచించారు. ఒక గులాబీ లేదా ఎరుపు టోన్ పెదాలు మరియు గోర్లకు చాలా బాగుంటుంది. అలాగే తక్కువ ప్రయత్నంతో కనిపిస్తోంది. అంతేకాక MAC రూబీ వూ,OPI బిగ్ ఆపిల్ ఎరుపు మ్యాచ్ అవుతాయి.
పెదవి రంగులను లోతుగా వేయవచ్చు. ఇది పరిమాణం మరియు మీ కంటి రంగు ప్రాముఖ్యంను పెంచుతుంది. మీ లిప్ స్టిక్ లేదా గ్లోస్ ను సులభంగా వేసుకోవచ్చు. మీరు క బాబి బ్రౌన్ క్రీమ్ మాట్టే లిప్ కలర్ ను ప్రయత్నించవచ్చని అయన చెప్పారు.

3. ఐ మ్యాజిక్
మీ ముఖం ఆకర్షణీయంగా కనపడటానికి మీ కంటి మేకప్ కీలకమైనది. వాటిని బాగా వివరణాత్మకముగా చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ మీ ముఖం యొక్క మిగిలిన భాగాన్ని పురిస్తుంది. మీ ఐ షేడ్స్ ఆకర్షించటానికి నలుపు కాకుండా ఇతర మస్కారా రంగులను ప్రయత్నించవచ్చని అర్శిస్ సూచించారు. నీలం, ఆకుపచ్చ మరియు వంకాయ రంగు మస్కారాలు మీ రూపాన్ని తక్షణమే ఎలివేట్ చేస్తాయి. ప్రత్యేకంగా ఈ చిన్న ప్రయత్నంతో మీ మేకప్ ను చూసి అందరు చాలా ఆశ్చర్యపోతారు. అంతేకాక నీలం రంగు మస్కరాను వాడటానికి ప్రయత్నించండి.

4. నిర్దిష్టమైన జుట్టు
మీరు గమనిస్తే మొత్తం ఇంటి పనులను మరియు మతపరమైన వేడుకలలో ఫ్లోర్ డ్యాన్స్ లేదా బిజీగా ఉంటారు. మీ ముఖం మీద మీ జుట్టు ఉంచడానికి ఒక శైలి కోసం వెళ్ళండి. మీరు ఒక పెద్ద నుదురు కలిగి ఉంటే గుర్తుంచుకోండి. బ్యాంగ్స్ లేదా ముఖ నిర్మాణం మృదువుగా కత్తిరించి ఒక సాధారణ అంచును పొందండి. మీ జుట్టుకు మీరు ఒక ఫ్రెంచ్ ఫ్లైట్ ను ఉపయోగించవచ్చు. లేకపోతే ఒక సంప్రదాయ టచ్ తో చక్కగా బన్ ఉపయోగించవచ్చు. మీరు సగం జుట్టును వదిలి,నిలువుగా ఉంచటానికి ప్రయత్నించండి. మిగిలిన జుట్టును కర్లీ గా చేయాలి. తరువాత ఒక స్పష్టమైన సాగే బ్యాండ్ తో సగం పోనీ కట్టాలి.

English summary

Navratri Special — Look stunning with these make-up tricks

The nine-day festival of Navratri is about to begin from September 25 and in order to enhance your looks, you need the right make-up tips apart from your dazzling outfit.
Desktop Bottom Promotion