Latest Updates
-
ఈ రెండు గ్రహాల మధ్య అరుదైన దశాంక యోగం.. ఈ రాశుల వారికి ఎన్నడూ దక్కని అదృష్టం -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన బాదం నూనె..ఈజీగా చేసుకోండిలా -
పండగకైనా, పార్టీకైనా స్పెషల్ స్వీట్ మాల్పువా..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
శ్రావణ శుక్రవారం స్పెషల్.. అమ్మవారికి నైవేద్యంగా కమ్మనైన ఆవ పులిహోర ఇలా చేయండి.! -
అయినవారితో ఏకీభవించలేకపోతున్నారా.. ఈ విషయాల్లో మాత్రం ‘కాదు’ అని చెప్పాల్సిందే.! -
కొత్తగా ఏదైనా తినాలని ఉందా? ఒక్కసారి ఈ రవ్వ రొట్టె చేసి చూడండి..చచ్చేదాకా ఇదే కావాలంటారు! -
ప్రపంచ అవయవదాన దినోత్సవం.. ఆర్గాన్ డొనేషన్‌పై ఇప్పటికీ వీడని అపోహలు.. వాస్తవాలివే.! -
ఈ పొడి వేసి పచ్చిమిరపకాయ వేపుడు చేస్తే.. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు! -
చపాతీ పిండి ముద్ద మిగిలితే ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. వాడే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
బీపీ, కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే నల్ల వెల్లుల్లి.. దీని ప్రయోజనాలు అదుర్స్!
సెక్సీయస్ట్ బ్యూటీ ప్రియాంకా చోప్రా బ్యూటీ సీక్రెట్
అబ్బ.. అందమంటే ఈమెదే. జీరో సైజుకు తగ్గినా, కండలు పెంచినా.. ప్రియాంక స్టైలే వేరు.బాక్సర్ మేరీ కోమ్‌గా కుర్రకారుకు కిక్కిచ్చి ఆ చరిష్మా మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఆసియాలోనే అత్యంత సెక్సీయెస్ట్ మహిళగా ప్రియాంక చోప్రా ఎంపికయిన సందర్భంగా.. ఆ అందం వెనుక రహస్యాలు మీకోసం..
ప్రియాంక రొటీన్ వ్యాయామం చేస్తుంది. వారంలో నాలుగురోజులు జిమ్‌కి వెళుతుంది. కానీ మేరీకోమ్ సినిమా కోసం ప్రత్యేకంగా క్రంచెస్, బై సెప్స్, రన్నింగ్ చేసి కండలు పెంచింది. వీటితోపాటు రోజూ యోగా ప్రాక్టీస్ చేసింది. దీంతో శారీరకంగానే కాదు.. మానసికంగానూ ప్రశాంతంగా అనిపించిందట. అందుకే యోగాని ఇక కంటిన్యూ చేద్దామనుకుంటోంది. ప్రియాంక భోజన ప్రియురాలు. ఆయిల్ ఫుడ్‌ను మాత్రం అస్సలు ముట్టుకోదు. రెండు గంటలకోసారి తప్పకుండా ఏదో ఒకటి పొట్టలో పడాల్సిందేనట! స్నాక్స్, బేకింగ్ ఐటమ్స్ అంటే నోరూరుతుందని చెప్తుంటుంది. క్యారెట్స్, మొలకలు అంటే ప్రాణమట. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల తన చర్మం మెరుపునకు కారణమంటోందీ ప్రియాంక. ఇంతకీ ప్రియాంకకి ఇష్టమైన డ్రింక్ ఏంటో తెలుసా? కొబ్బరినీళ్లు. వారాంతంలో మాత్రమే కేక్స్, చాక్లెట్స్ తింటుంది.

మరి అందానికి బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం..
1. మేకప్ లేకుండా :అందాల తార అయినా షూటింగ్ లేనప్పుడు మేకప్ లేకుండా ఉండడానికి ఇష్టపడుతుంది ప్రియాంక. తన బాడీ పట్ల చాలా కేర్ తీసుకుంటుంది.

2. జుట్టు : తరచుగా హెయిర్ స్టయిల్స్ మారుస్తుంటుంది. ట్రెండీగా, ఫ్యాషనబుల్‌గా ఉండే యాక్సెసరీస్ ధరిస్తుంది. శిరోజాల పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంది. కచ్చితంగా వారంలో మూడుసార్లు హాట్ ఆయిల్‌తో మసాజ్ చేయిస్తుంది. ఇది హెయిర్ లాస్ అవ్వకుండా కాపాడుతుందని నమ్ముతోంది ప్రియాంక.

3. స్కిన్ : వైటిష్‌గా ఉండే స్కిన్‌టోన్ అంటే బాలీవుడ్‌లో అందరికీ జెలసీనే. అందుకే స్కిన్ క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్‌లో పక్కాగా ఉంటుంది. ప్రతిరోజూ వీటితో పాటు 8 గ్లాసుల నీళ్లే తన అందానికి అసలు రహస్యమని చెబుతోంది.

4. కళ్లు : ప్రియాంక కళ్లు ఎంత ఇన్నోసెంట్‌గా ఉంటాయో కదా! ఎక్కువగా ఆకుపచ్చ రంగు కాంటాక్ట్ లెన్స్‌ని పెట్టుకుంటుంది. దీనివల్ల స్కిన్ ఫేర్‌గా కనిపిస్తుందట. కళ్లకు కాటుక, ఐ లైనర్ మంచి అందానిస్తాయని చెబుతోంది ప్రియాంక. వీటితోపాటు మ్యాచింగ్ మస్కర వేస్తే హ్లైట్‌గా ఉంటుందట.

5. లిప్స్ : బాడీ షాప్ లిప్ బామ్స్, లిప్ స్టెయిన్‌లే తన పెదవుల్ని మరింత అందంగా కనిపించేలా చేస్తాయంటోంది. మాల్‌బెర్రీ, న్యూడ్ బ్రౌన్, పింక్ కలర్ లిప్‌స్టిక్స్ వేసుకోవడం ఎక్కువగా ఇష్టపడుతుంది.

6. మేకప్ : మేకప్ అందాన్ని రెట్టింపు చేసి చూపుతుంది. అయితే మేకప్ సామాన్లతో పాటు మాయిశ్చరైజర్ కూడా తప్పక ఉండి తీరాల్సిందేనట. చెంపలకు బ్లష్‌గా పింక్, పీచ్, పీచ్ - బ్రౌన్ కలర్‌లని ఎక్కువగా వేసుకుంటుందట.




Click it and Unblock the Notifications