మేకప్ విషయంలో మీరు చేసే తప్పిదాలు వెంటనే మానేయాల్సినవి

By Super

మహిళలు తమ అందాన్ని మరింత సౌందర్యంగా కనబడాలని మేకప్ వేసుకుంటుంటారు. అయితే వారుఏవిధంగా వేసుకుంటారు?మేకప్ వేసుకొన్న తర్వాత వారి సౌందర్యం మరింత పెరుగుతుంది. మరింత అందంగా కనబడుతుంటారు. మేకప్ మిమ్మల్నిప్రకాశవంతంగా కనబడేలా చేయడమే కాకుండా, వారిలోని దోశరహితమైన చర్మాన్ని (డార్క్ లైన్స్, పింగ్మెంటేషన్ వంటివి)కనబడనియకుండా వారిలో ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్నినింపుతుంది.

అంతే , కాదు మేకప్ వేసుకోవడం వల్ల వారిలో ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది, కానీ ఎక్కువగా మేకప్ వేసుకోవడం వల్ల మీ చర్మం కూడా అందేవిధంగా అనుభూతి చెందుతుంది. ఈ విషయంలో మీరు గందరగోళంగా అనిపిస్తుందా? ఎందుకంటే, కొంత మంది మహిళలు ఎక్కువగా మేకప్ వేసుకుంటుంటారు. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోరు. అలాంటి వారికోసం ఈ ఆర్టికల్. మేకప్ విషయంలో చేసే తప్పిదాలను తప్పనిసరిగా నివారించాల్సినవి కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ చిన్న చిన్న తప్పుల వల్ల మీ చర్మానికి హాని కలుగుతుంది . కాబట్టి, ఈ క్రింది సూచించన మేకప్ మిస్టేక్స్ ను తప్పకుండా నివారించాలి.

#1. నిద్రించే మందు మేకప్ తొలగించకుండా ఉండటం

#1. నిద్రించే మందు మేకప్ తొలగించకుండా ఉండటం

మేకప్ వేసుకొన్న తర్వాత ఆ రోజు గడిచిన తర్వాత నిద్రించడానికి ముందు మేకప్ తొలగించడానికి మీరు బద్దకిస్తుంటే, ముందు ముందు మీ చర్మం మరింత డ్రైగా, రఫ్ గా మరియు వయస్సైన వారిగా కనబడేలా చేస్తుంది.ఎక్కువగా మేకప్ వేసుకోవడంవల్ల ఆ వ్యక్తి యొక్క చర్మంలోని షోషన చెంది, వారి మరింత వయసైన వారిలా కనబడేలా చేస్తుంది. చర్మరంద్రాలు నూనెగ్రంధులతో మూసుకొని ఉన్నప్పుడు, క్రమంగా మొటిమలకు దారితీస్తుంది. మరియు అందువల్ల, సమస్యకు గురి అవ్వడం కంటే, ప్రీమెచ్యుర్ ఏజింగ్ పొందడం కన్నా, ఈ సమస్యను నివారించుకోవడానికి నిద్రించే ముందు తప్పనిసరిగా మేకప్ తొలగించుకోవడం ఉత్తమం.

 #2. మేకప్ బ్రష్ ను శుభ్రం చేయకుండా వాటిని ఉపయోగించడం

#2. మేకప్ బ్రష్ ను శుభ్రం చేయకుండా వాటిని ఉపయోగించడం

మేకప్ వేసుకొన్నప్పుడు, మీరు ఉపయోగించే బ్రష్ లను అప్పుడప్పుడు, బేబీ షాంపు , గోరువెచ్చని నీటిని ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే, ఈ మరికిపడ్డ బ్రెషులను ఉపయోగిస్తారో, వాటిలో ఇంతకు మందు ఉపయోగించిన మేకప్ సామాగ్రి ఉండటం వల్ల చర్మరంధ్రాలను మూసుకొనేలా చేస్తుంది. అందువల్ల, మీరు ఫ్రెష్ గా మేకప్ వేసుకొన్నా, మీ అందాన్నిపూర్తిగా పాడు చేస్తుంది.

 #3. కళ్ళకు వేసే మేకప్ ను తప్పుగా శుభ్రపరుచుకోవడం

#3. కళ్ళకు వేసే మేకప్ ను తప్పుగా శుభ్రపరుచుకోవడం

సహజంగా కళ్ళ వద్ద మేకప్ తొలగించుకోవడానికి తడిగా ఉండే కాటన్ బాల్స్ ను ఉపయోగిస్తుంటారు. అయితే, మీ కళ్ళచుట్టూ ఉండే చర్మం చాలా సున్నితమైనదని మీరు గ్రహించాలి, అది ముడుతలకు దారితీస్తుంది. అదనంగా కళ్ళకు వేసే ఐ లాషెష్ కూడా కళ్ళకు చాలా హాని కలిగిస్తుంది.

 #4. తరచూ వాటర్ ఫ్రూఫ్ మస్కరాను ఉపయోగిస్తుంటారు

#4. తరచూ వాటర్ ఫ్రూఫ్ మస్కరాను ఉపయోగిస్తుంటారు

వాటర్ ఫ్రూవ్ మస్కార చాలా మందికి ఇష్టమైనది, ఎందుకంటే, ఇది ఎక్కువ సమయంలో చెరిగిపోకుండా ఉంటుంది. కానీ, లాషెష్ నిజంగా డ్రై అయిపోయేందుకు కారణం అవుతుంది. మరియు ఇలా గట్టిపడిన వాటర్ ఫ్రూఫ్ మస్కరా తొలగించడానికి మరింత కష్టం అవుతుంది. దాంతో మీరు కళ్ళ మీద ఎక్కువగా రుద్దడం వల్ల కళ్ళకు మరింత హాని కలుగుతుంది. ఇది మీ కళ్ళ చుట్టూ అంటుకోవడమే కాకుండా కాకుండా, లాష్ రాలిపోవడానికి కారణం అవుతుంది.

 #5. బ్రోజర్ ను ముఖానికి మొత్తానికి అప్లై చేయడం

#5. బ్రోజర్ ను ముఖానికి మొత్తానికి అప్లై చేయడం

బ్రోజర్ ను మీ ముఖానికి అప్లై చేయడం వల్ల మీ ముఖంలో అద్భుతంగా కనిపించవచ్చు. అయితే, దీన్నిఖచ్చితంగా ఎక్కడ అప్లై చేయాలో తెలియక, ముఖం మొత్తానికి అప్లై చేయడానికి అంత అందంగా కనబడకపవచ్చు. మీ ముఖం మరియు మెడ వద్ద వ్యత్యాసం కనబడటంతో, మీ అందం పూర్తిగా పాడవుతుంది.అలాకాకుండా టోన్డ్ లుక్ ను మీరు పొందాలని కోరుకుంటున్నట్లైతే, అప్పుడు, దీన్ని మీ ముక్కు, చిక్ బోన్స్ మరియు గడ్డం వద్ద మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది.

#6. ఎక్కువగా ఫౌండేషన్ వేసుకోవడం వల్ల

#6. ఎక్కువగా ఫౌండేషన్ వేసుకోవడం వల్ల

ముఖానికి ఎక్కువగా ఫౌడేషన్ వేసుకోవడం వల్ల, ఫౌండేషన్ అనేది మీ స్కిన్ టోన్ కు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేది ఎంపిక చేసుకోవాలి. ఎక్కువగా ఫౌండేషన్ అప్లై చేయడం వల్ల సాధారణం కంటే, మరింత ఎక్కువగా అసాధారణంగా కనబడుతుంది. బ్రోజర్ వలే, మెడ, భుజాల మీద వేసుకొన్నట్లు, మీ ముఖానికి మాత్రమే ఫౌడేషన్ అప్లై చేసుకోవడం వల్ల, అది మరింత అసహ్యంగా అసాధారణంగా కనిపిస్తుంది.

#7.లిప్ లైనర్ ను తప్పువగా వేసుకోవడం

#7.లిప్ లైనర్ ను తప్పువగా వేసుకోవడం

లిప్ లైనర్ ను పెదాలా చివర్లు కాకుండా, పెదాల మొత్తానికి అప్లై చేయాలి. ఎందుకంటే, కొన్ని గంటల తర్వాత లిప్ కలర్ చెరిగిపోతుంది, తర్వాత లిప్ రింగ్ మరింత డార్క్ గా మారుతుంది.

#8. మీరు ఉపయోగించే కాస్మోటిక్స్ ఎక్కువ రోజులు నిల్వ చేయడం

#8. మీరు ఉపయోగించే కాస్మోటిక్స్ ఎక్కువ రోజులు నిల్వ చేయడం

కాస్మోటిక్స్ కు ఎక్స్ పైరి డేట్ ఉంటుంది, ఏకాస్మోటిక్ అయినా ఆ డేట్ దాటిపోతే, అది చర్మానికి మరింత ప్రమాధకరంగా మారుతుంది.కాబట్టి, మీరు ఉపయోగించే ప్రతి కాస్మోటిక్ ఎక్స్ పైరీ డేట్ అయిపోయాక వాటిని పడేయడం మంచిది.

#9. మీ శరీరానికి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోకపోవడం

#9. మీ శరీరానికి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోకపోవడం

ఇది మహిళల చర్మాన్నిమరింత డ్రైగా మార్చుతుంది. ముఖం అందంగా ఉంచుకోవడం ఎక్కువ సమయం తీసుకుంటారు, కానీ, మిగతా శరీరాన్ని మొత్తం మీద అశ్రద్ద చూపడం వల్ల చర్మం మొత్తం డ్రైగా మారుతుంది. కాబట్టి, ముఖానికి ఇచ్చే ప్రాధాన్యతే మిగిలిన శరీరానికి కూడా ఇవ్వడం వల్ల చర్మాన్ని తేమగా ఉంచుకోవచ్చు. శరీరానికి ఎప్పుడు మాయిశ్చరైజర్ను అప్లై చేయాలి.వేడినీళ్ళ స్నానం మరియు కాలుష్యం నుండి చర్మాన్ని కాపాడుకోవాలి . లేదంటే చర్మాన్ని ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది . కాబట్టి రెగ్యులర్ గా ఒక మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి .

Desktop Bottom Promotion