Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
బాలీవుడ్ పెళ్లికూతుళ్ల మాదిరిగా మీరూ మెరవాలంటే ?
త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా ? ఎలా రెడీ అవ్వాలి.. ఎలాంటి డ్రెస్సింగ్ బాగుంటుంది.. అని డైలమాలో ఉన్నారా ? డోంట్ వర్రీ.. మీ పెళ్లిలో అందంగా.. స్పెషల్ గా కనిపించడానికి కొన్ని చిట్కాలు ఇక్కడున్నాయి ఫాలో అయిపోండి. సెలబ్రెటీలు.. పెళ్లి సమయంలో అందంగా కనిపించడానికి ఏం చేశారో వివరిస్తూ.. కొన్ని మేకప్ టిప్స్, బ్యూటీ టిప్స్ అందిస్తున్నాం మీకోసం.
జీవితంలో ముచ్చటగా.. ఆనందంగా.. ఇష్టంగా జరుపుకునే.. ప్రత్యేకమైన వేడుక పెళ్లి. పెళ్లంటే అందరిలోనూ పెళ్లికూతురే స్పెషల్ ఎట్రాక్షన్. అందుకే కొంతమంది బాలీవుడ్ ముద్దుగుమ్మలు తమ పెళ్లి రోజు ఎలా రెడీ అయ్యారో.. వాళ్లు ఎలాంటి డ్రెస్ వేశారో.. డ్రెస్ కి తగ్గట్టు ఎలాంటి మేకప్ వేశారో.. ఎలాంటి మాచింగ్ యాక్సెసరీస్ వేశారో చూసి.. మీకు బాగా నచ్చిన వాళ్లను ఫాలో అయిపోండి. స్టన్నింగ్ లుక్ తో.. మీ హబ్బీతో పాటు.. అతిథులందరినీ ఆకట్టుకోండి.

కరీనా కపూర్
పెళ్లికూతురుగా కరీనా కపూర్ లుక్ అదిరిపోయింది. ఎరుపు రంగు లెహంగా ధరించి.. డ్రెస్సింగ్ కి తగ్గట్టు.. డార్క్ మేకప్ వేసుకోవడంతో.. మరింత ఆకర్షణీయంగా కనిపించింది. కళ్లకు డార్క్ గా కాటుక దిద్దుకుని.. పెదాలకు పింక్ కలర్ లిప్ స్టిక్ వేసుకుంది.

విద్యాబాలన్
డస్కీ బ్యూటీ విద్యాబాలన్.. తన పెళ్లిరోజు రెడ్, గోల్డ్ కలర్ కాంబినేషన్ చీరలో.. స్టన్నింగ్ లుక్ ఇచ్చింది. చీరకు తగ్గట్టు.. బంగారు నగలు, ఎరుపు రంగు బొట్టు, పింక్ కలర్ లిప్ స్టిక్ వేసుకుంది ఈ బ్యూటీ. సౌత్ ఇండియన్ సంప్రదాయంలో సింపుల్ లుక్ లో విద్యాబాలన్ మెరిసిపోయింది.

మాధురీ దీక్షిత్
డ్యాన్సింగ్ స్టార్ మాధురీ దీక్షిత్ పెళ్లికూతురుగా ముస్తాబైన తీరు అందరినీ ఆకట్టుకుంది. గోల్డ్ కలర్ గాగ్రాకు సిల్వర్ కలర్ నగలు జత చేయడం.. డార్క్ బ్రౌన్ కలర్ ను పెదాలకు వేయడంతో.. విభిన్నంగా కనిపించింది.

ట్వింకల్ కన్నా
సింపుల్ అండ్ గార్జియస్ లుక్ తో అదరగొట్టింది ట్వింకిల్ కన్నా. న్యూడ్ మేకప్ వేసుకుని.. మెరూన్ కలర్ చీరలో ముస్తాబైంది ట్వింకిల్ కన్నా.

ఐశ్వర్యారాయ్
భారతీయ సంప్రదాయత ఉట్టిపడేలా.. వధువుగా ముస్తాబైంది ఐష్. పాపిడి బిళ్లతో పాటు.. రకరకాల నగలతో అలంకరించుకున్న తీరు అందరినీ మెస్మరైజ్ చేసింది. మేకప్ కూడా చాలా సింపుల్ గానే వేసుకున్నా.. చాలా ఆకర్షణీయంగా కనిపించింది అందాల తార.

కాజోల్
కాజోల్ పెళ్లికూతురుగా చాలా విభిన్నంగా కనిపించింది. పెదాలకు బ్రౌన్ కలర్ లిప్ స్టిక్.. బుగ్గలకు.. బ్లష్ వేసింది. ఇక నుదుటి భాగాన్ని ముత్యాలతో కవర్ చేసింది.

జెనీలియా
సింపుల్ అండ్ గార్జియస్ గా కనిపించాలంటే.. జెనీలియాను ఫాలోఅవడం బెటర్. వధువుగా జెన్నీ.. సింపుల్ మేకప్ వేసుకుంది. రెడ్డిష్ లెహంగా ధరించి.. నుదిటి భాగానికి ముత్యాలతో అలరించడంతో.. చాలా ఎట్రాక్టివ్ గా కనిపించింది.

శిల్పా శెట్టి
ఎక్కువ మేకప్ వేసుకుంటే.. కొంతమందికి సెట్ అవుతుంది. కొంతమందికి లైట్ గానే బావుంటుంది. శిల్పాశెట్టిలా కనిపించాలి అనుకుంటే.. లిప్స్ కి ఎరుపు రంగు.. అలాగే బుగ్గలకు కూడా అదే కలర్ లైట్ గా వేసుకుంటే సరిపోతుంది. అయితే మీ డ్రెస్ కలర్ కి తగ్గట్టు మేకప్ కిట్ ఉంటే ఇంకా బావుంటుంది.

ప్రియాంకా ఒబెరాయ్
బ్రైట్ కలర్ లెహంగా ధరించి.. వధువుగా ప్రియాంకా ఒబెరాయ్ అందరినీ ఆకర్షించింది. పెద్దవిగా కనిపించే కళ్లకు.. రెడ్ షాడో.. బ్లాక్ లైనర్ వాడటంతో మరింత అందంగా కనిపించింది. పెదాల రంగు కూడా.. డ్రెస్ కలర్ కి మ్యాచ్ అయ్యేలా వాడింది.

మీరా రాజ్ పుట్
మీరా రాజ్ పుట్ పెళ్లికూతురుగా ముస్తాబైన తీరు యువరాణిని తలపించింది. పింక్ బ్లష్ తో బుగ్గల అందాన్ని రెట్టింపు చేసింది. పెదాలకు ఎరుపు రంగు కరెక్ట్ గా మ్యాచ్ అయింది. చూశారుగా.. హీరోయిన్స్ తమ పెళ్లిలో ఎంత అందంగా ముస్తాబైయ్యారో.. ఇంకేం ఈ చిట్కాలు ఫాలో అయి.. మీరూ మీ పెళ్లిలో మెరిసిపోండి.



Click it and Unblock the Notifications