For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్లూ డ్రెస్ ధరించినప్పుడు ఈ అద్భుతమైన మేకప్ ఐడియాస్ ను పాటిస్తే మీ లుక్ బ్రహ్మాండంగా ఉంటారు

బ్లూ డ్రెస్ ధరించినప్పుడు ఈ అద్భుతమైన మేకప్ ఐడియాస్

|

వీకెండ్ బృంచ్ లేదా శాటర్ డే నైట్ అవుట్ లేదా డేట్ కోసం బ్లూ డ్రెస్ లో ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంటున్నారా. హాట్ రాయల్ బ్లూ డ్రెస్ లేదా సబ్టిల్ బ్లూ డ్రెస్ లో కనువిందు చేయాలనుకుంటున్నారా? బ్లూ డ్రెస్ కి సూట్ అయ్యే మేకప్ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ మిమ్మల్ని వేధిస్తోందా?

మీ సమస్యను మేమర్థం చేసుకోగలుగుతాము. బ్లూ అనేది ఆకర్షణీయమైన రంగు. ఈ రంగు హైలైట్ అవడానికి మీరు మేకప్ పై మరింత శ్రద్ధ కనబరచాలి. దాంతో మీ మేకప్ తో పాటు డ్రెస్ కూడా హైలైట్ అవుతుంది.

సేమ్ బోరింగ్ మేకప్ రొటీన్ ను వదిలించుకుని కొన్ని విభిన్నమైన టిప్స్ ను ఫాలో అయితే బ్లూ డ్రెస్ లో అద్భుతంగా మెరిసిపోతారు. మీ ప్రెజన్స్ కి ఎలిగెన్స్ తోడవుతుంది. ఈ టిప్స్ ను పాటిస్తారు కదూ:

కలర్ పాలెట్:

కలర్ పాలెట్:

బ్లూ కలర్ లో అనేక షేడ్స్ తో పాటు వెరైటీస్ కలవు. కాంట్రాస్టింగ్ షేడ్స్ తో అలాగే కలర్స్ తో ఈ కలర్ బాగా కలిసిపోతుంది. మీ అపియరెన్స్ ను ప్లీజింగ్ గా మారుస్తుంది. రెడ్, ఆరెంజ్, పింక్, గ్రీన్ వంటి కొన్ని రంగులు బ్లూ అందానికి వన్నె తెచ్చే కాంట్రాస్ట్ కలర్స్. ఈ బ్రైట్ కలర్స్ తో మిక్స్ ఎండ్ మ్యాచ్ ను ప్రయత్నించడం ద్వారా మీరు మరింత వైబ్రెంట్ గా కనిపిస్తూ ఆకర్షణీయంగా ఉంటారు. పగటిపూట అయితే లైటర్ షేడ్స్ కలిగిన డ్రెస్ ను ఎంచుకోండి. అలాగే, కాంట్రాస్టింగ్ కలర్ కలిగిన ప్యాస్టల్ కలర్ మేకప్ ను ప్రిఫర్ చేయండి. నైట్ టైం కోసమైతే మీ డ్రెస్ కి బ్లింగీ లుక్ ను జోడించండి. కాంట్రాస్టింగ్ బ్లింగీ లుక్ ను ప్రయత్నించండి. మిగతా కలర్స్ ప్రెజన్స్ వలన ఎక్కువ ఎటెన్షన్ లభిస్తుంది.

మేకప్ బేస్:

మేకప్ బేస్:

మేకప్ బేస్ అనేది మేకప్ లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే మీరు ఎటెండ్ అవ్వబోయే ఈవెంట్ ను అలాగే మీరు క్యారీ చేయాలనుకుంటున్న లుక్ ను దృష్టిలో పెట్టుకుని మేకప్ బేస్ ను ఎంచుకోవాలి. ఎప్పుడూ మీ ముఖాన్ని స్క్రబ్ తో అలాగే చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఆ తరువాత, కొంత మాయిశ్చరైయిజర్ ను అప్లై చేసి మేకప్ బేస్ ను ఏర్పరచుకోవాలి. ఇది మీ ముఖాన్ని శుభ్రం చేయడంతో పాటు ముఖంపై ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ మేకప్ అవసరమో తెలియచేస్తుంది.

లైటర్ అలాగే సబ్టిల్ మేకప్ కోసం, ఆరెంజ్, బ్లూయిష్ అలాగే పింక్ లిప్ స్టిక్ తో తిన్ బేస్ కాంకీలర్ ను అలాగే కాంపాక్ట్ పౌడర్ ను వాడవచ్చు. ఇది డే లుక్ కి అవసరమైనంత బేస్ ను అందిస్తుంది. లైటర్ మేకప్ గా ఉపయోగపడుతుంది. బ్లూలోని కూల్ కలర్స్ ఈ మేకప్ కి సరిగ్గా సరిపోతాయి. నైట్ కోసం హెవీ లుక్ అవసరపడుతుంది. ఫౌండేషన్ ను తగినంత అప్లై చేసుకుని ఆ తరువాత కాంకీలర్ ను అప్లై చేయాలి. ప్రత్యేకించి, బ్లేమిషెష్, డార్క్ సర్కిల్స్ వంటి చోట శ్రద్ధ కనబరచాలి. హాట్ పింక్, రూబీ లిప్స్టిక్ వంటి వాటితో ట్రెండీ లుక్ ను సొంతం చేసుకోవచ్చు. అంటే బ్రైట్ కలర్స్ తో డార్క్ మేకప్ అన్నమాట.

బ్లష్ లుక్

బ్లష్ లుక్

చీక్స్ పై పింక్ కలర్ ని రుద్దటం మాత్రమే బ్లషింగ్ కాదు. మీ లుక్ కు చీక్స్ మాత్రమే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కాకూడదు. బ్లూ కలర్ మిమ్మల్ని సహజంగా అందంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. కాబట్టి, పీచ్ బ్లష్ లేదా లైట్ రోజీ కలర్ బ్లష్ ని డార్కర్ మేకప్ పై ప్రయత్నించండి. ఇది సబ్టిల్ లుక్ ని అందిస్తుంది. లైట్ మేకప్ కోసం మీరు హైలైటర్ గా బ్రాన్జ్ బ్లష్ ని ప్రయత్నించండి. ఇది బ్లూ కలర్ తో బాగా సెట్ అవుతుంది. బ్లష్ బ్రష్ తో చీక్స్ పై ఒత్తిడి ఎక్కువగా పెట్టకండి.

పదాల కంటే కళ్ళు ఎక్కువగా మాట్లాడతాయి

పదాల కంటే కళ్ళు ఎక్కువగా మాట్లాడతాయి

మీ అట్టైర్ లో మీ ఐ మేకప్ ఎక్కువ పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. కాజల్ మరియు ఐ లైనర్ తో ఒకే రకమైన లుక్ ను ఎన్నాళ్ళు మెయింటైన్ చేస్తారు? క్యాట్ ప్రింట్స్ ను అలాగే ఐ షాడోస్ కోసం ప్రింటెడ్ మేకప్ ను ప్రయత్నించండి. బ్లూ డ్రెస్ కి కాంట్రాస్ట్ కలర్స్ లో ఈ మేకప్ ని ప్రయత్నించండి. మీ డ్రెస్ పై వేరే కలర్ కి చెందిన ప్రింట్ లేదా డిజైన్ ఉంటే ఆ డిజైన్ కలర్ ను ఐషాడోగా ఎంచుకోండి. ఇది మంచి ఎఫెక్ట్ ఇస్తుంది. బ్లూ ఐ లైనర్స్ ట్రెండ్ కూడా ఇప్పుడు ఫ్యాషన్ వరల్డ్ లో నడుస్తోంది.

పెదాలను హైలైట్ చేయండి:

పెదాలను హైలైట్ చేయండి:

పింక్ లేదా రెడ్ షేడ్స్ ను వాడటం కొంచెం బోరింగ్. కాబట్టి, కొంచెం వైవిధ్యాన్ని ప్రదర్శించండి. బ్లూ కలర్ లిప్ షేడ్ అనేక అన్ని రకాల బ్రాండ్స్ లో లభ్యమవుతుంది. మీరు ఫ్యాషన్ లో వైవిధ్యాన్ని అనుసరించడానికి ఇష్టపడే వ్యక్తి అయితే బ్లూ లిప్ షేడ్ ను ప్రయత్నించండి. మీరు డ్రమాటిక్ అలాగే లౌడ్ ఐ మేకప్ ను వేసుకుంటే న్యూడ్ లిప్ షేడ్ ను ప్రయత్నించండి. ఇది మీకు యూనిక్ లుక్ ను అందిస్తుంది. అలాగే, మీ లౌడ్ ఐస్ తో బాగా సెట్ అవుతుంది. సబ్టిల్ డ్రెస్ కోసం డే లుక్ కై నియాన్ పింక్ లేదా క్రిమ్సం కలర్ బాగా నప్పుతుంది.

ఫైనల్ టచ్ అప్:

ఫైనల్ టచ్ అప్:

మీ లుక్ ను పూర్తి చేసి మేకప్ ను సీల్ చేయడానికి, ఏదైనా మేకప్ సీలర్ స్ప్రే ను వాడండి. ఇది మీ ముఖంపై మేకప్ ని సీల్ చేస్తుంది. అలాగే ముఖంపై రోజంతా తాజా లుక్ ని అందిస్తుంది. కొంత హైలైటర్ తో పాటు కొంత షిమ్మర్ మినరల్ పౌడర్ ను వాడితే చంద్రబింబంలాంటి మీ ముఖంలోని ఆకర్షణను రోజంతా అలాగే కొనసాగుతుంది.

డేట్ అయినా సండే బృంచ్ అయినా బ్లూ డ్రెస్ లో మీరు రాక్ చేయడం మాత్రం పక్కా. పైన చెప్పిన యూనిక్ మేకప్ టెక్నీక్స్ ను పాటించి టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వండి మరి.

English summary

Amazing Makeup Ideas When You Are Wearing A Blue Dress

Blue is a very attractive colour and deserves an extraordinary makeup. A makeup that will grab the attention for itself as well as for the dress. To get your makeup right, ensure that you have the right contrast coloured palette, base makeup, blush, eyeshadow palette, and dark lipstick.Pair your blue dress with contrasting shade makeup, eyeshadow, lipstick, and blush.
Story first published:Monday, May 7, 2018, 18:01 [IST]
Desktop Bottom Promotion