Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ 5 మంది బాలీవుడ్ తారలు, న్యూడ్ లిప్స్టిక్స్ ఎలా కారీ చెయ్యాలో మనకు ఒక అవగాహనని ఇస్తున్నట్లున్నారు
ఈ 5 మంది బాలీవుడ్ తారలు, న్యూడ్ లిప్స్టిక్స్ ఎలా కారీ చెయ్యాలో మనకు ఒక అవగాహనని ఇస్తున్నట్లున్నారు
స్త్రీల మేకప్ విషయానికి వస్తే, ఖచ్చితంగా లిప్స్టిక్ వారి మేకప్ పూర్తి చేసే ముఖ్యమైన ఉత్పత్తుల్లో ఒకటిగా ఉంటుంది. ఒక గెట్ టుగెదర్ పార్టీ, వివాహ మహోత్సవం, ఎంగేజ్మెంట్, బర్త్డే ఫంక్షన్, వంటి ఏ ఇతర కార్యక్రమాలలోనైనా లిప్స్టిక్ ఖచ్చితంగా అవసరమవుతుంది. ఒక్కోసారి అప్పటికప్పుడు రెడీ అవ్వాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు, సిద్ధంగా ఉండే క్రమంలో భాగంగా మహిళలు వారి హ్యాండ్ బ్యాగ్ లలోనే మేకప్ పరికరాలను ఉంచుకోవడం పరిపాటిగా ఉంటుంది.
ఆ క్రమంలో భాగంగానే లిప్స్టిక్ కూడా ఖచ్చితంగా ఉంటుంది అన్నది వాస్తవం. ఈ లిప్స్టిక్, నారింజ, ఎరుపు, గులాబీ రంగు వంటి అనేక ఇతర రంగులలో లభ్యమవుతూ ఉంటుంది. దుస్తులను మరియు ఇతర స్టైలింగ్ విధానాలను అనుసరించి లిప్స్టిక్ ఎంచుకోవడం పరిపాటిగా ఉంటుంది. క్రమంగా మీ ముఖానికి చీకీ-శాసీ రూపాన్ని ఇవ్వడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం న్యూడ్ లుక్ అనేది సరికొత్త ట్రెండ్. ఈ న్యూడ్ లుక్ మేకప్ విధానంలో న్యూడ్ లిప్స్టిక్ కూడా ముఖ్యం.

ప్రస్తుతం ఈ మేకప్ విషయాలలో మన బాలీవుడ్ అగ్రశ్రేణి తారలు, సెలెబ్రిటీలు, సరికొత్త విధానాలను మనకు తరచుగా పరిచయం చేస్తుంటారు.
ఇక్కడ ప్రకాశవంతమైన లేదా ముదురు రంగు లిప్స్టిక్ లకు బదులుగా న్యూడ్ లిప్స్టిక్ అనుసరించడం ద్వారా సహజసిద్ధమైన మరియు సూక్ష్మ అందానికి ప్రతీకగా కనపడవచ్చునని, ఇప్పటికే అనేకమంది సెలబ్రిటీలు ఉదాహరణలుగా చూపారు.
ఈ న్యూడ్ లిప్స్టిక్ ధరించడం ద్వారా సొగసైన మరియు క్లాసీలుక్ ప్రస్పుటించేలా కనపడవచ్చు. కానీ దుస్తులకు సరిగ్గా నప్పేలా న్యూడ్ లిప్స్టిక్ ధరించడంలో కూడా మెళకువలు పాటించవలసి ఉంటుంది.
న్యూడ్ లిప్స్టిక్ ఉపయోగించి మేకప్ చేసుకోవడానికి కొంత ప్రయత్నం తప్పనిసరి. ఈ న్యూడ్ లిప్స్టిక్ ధరించడంలో తీసుకోవలసిన మెళుకువలను అందివ్వడంలో అనేక మంది ప్రముఖులు సైతం విఫలమయ్యారు.
ఈ న్యూడ్ లిప్స్టిక్ ధరించడంలో ఈ ఐదు మంది బాలీవుడ్ అగ్రశ్రేణి తారలు పాటిస్తున్న విధానాలు చూడండి మరి.

1. ఆలియా భట్ :
ఆలియా భట్ ధరించే, న్యూడ్ లిప్స్టిక్ ఆమెకు సరికొత్త ప్రత్యేకతను జోడించినట్లుగా కనిపిస్తుంటుంది. ఇక్కడ లేత గులాబీ రంగు షేడ్ కలిగి ఉన్న న్యూడ్ లిప్స్టిక్ అనుసరించి, ఫోటోలో కనపడుతున్న సాంప్రదాయక దుస్తులకు నప్పేలా, సొగసైన మరియు క్లాసీలుక్ ప్రతిబింబించేలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. తరచుగా సాంప్రదాయక దుస్తులలోనే కాకుండా, పాశ్చాత్య దుస్తులకు కూడా న్యూడ్ లిప్స్టిక్ అనుసరిస్తుంటుంది ఆలియా భట్. క్రమంగా ఈ న్యూడ్ లుక్, సహజ సిద్దంగా మేకప్ ధరించని విధంగా కనిపిస్తుంటుంది.

2. అదితీ రావ్ :
అదితీ రావ్ మేకప్ విషయానికి వస్తే, సెక్సీ మరియు బాల్డ్ లుక్ ప్రతిబింబించేలా కనపడడం స్పెషాలిటీ. కానీ తన స్మోకీ కళ్ళకు నప్పేలా, న్యూడ్ లిప్స్టిక్ ధరించడం అదితీ రావ్ కే చెల్లిందని విమర్శకులు సైతం పొగుడుతుంటారు. ఈ ఫోటోలో న్యూడ్ లిప్స్టిక్ ధరించిన తర్వాత, గ్లాసీ టచ్ ఇవ్వడం ద్వారా ఫ్రెష్ అండ్ హాట్ లుక్, కేర్ ఆఫ్ అడ్రెస్ మాదిరి కనిపిస్తుంది.

3. సోనం కపూర్ :
“పర్ఫెక్ట్ స్టైల్ దివా ఆఫ్ బాలీవుడ్” అని పిలవబడే సోనంకపూర్, తన ప్రతి లుక్ నందు ప్రత్యేకత కనపడేలా ప్రయత్నిస్తుంటుంది. ఈమద్యే తన వివాహ మహోత్సవం నాడు తాను అవలంబించిన మేకప్ విధానాలు అనేకమంది మన్ననలను కూడా అందుకున్నాయి మరి. ఎక్కువగా లిప్స్టిక్ షేడ్ తో ప్రయోగాలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఒక్కోసారి ముదురు రంగు లేదా ప్రకాశవంతమైన లిప్స్టిక్ ధరించి కనిపిస్తుంది,. ఒక్కోసారి సహజసిద్దమైన న్యూడ్ లిప్స్టిక్ ధరించి కనిపిస్తుంది. ఇక్కడ కూడా, తన దుస్తులకు నప్పేలా న్యూడ్ లిప్స్టిక్ ధరించి ఎంత ప్రత్యేకంగా కనిపిస్తుందో చూడండి.

4. దీపిక పడుకునే :
ఎవరైనా తన నవ్వుతో మిమ్ములను పాదాల వద్దకు తీసుకుని వెళ్ళగలిగే సామర్ధ్యం కలిగిన వారిగా ఉంటే, అది ఖచ్చితంగా దీపికా పడుకునే అయి ఉంటుంది. మెట్ గాల నుండి కేన్స్ వరకు అనేక కార్యక్రమాలలో పాల్గొన్న దీపిక పడుకునే, తన మేకప్ ప్రతి ఒక్క అంశంలోనూ అత్యంత జాగ్రత్తను తీసుకుంటూ ఉంటుంది. ఎక్కువగా న్యూడ్ లిప్స్టిక్ ధరించి కనిపించే దీపిక, అనేక రకాల షేడ్స్ ఎంపిక చేసుకుంటూ దుస్తులకు నప్పేలా జాగ్రత్త వహిస్తుంది. ఇక్కడ ఫోటోలో పీచిష్ పింక్ న్యూడ్ లిప్స్టిక్ ధరించిన దీపికను చూస్తుంటే అమేజింగ్ ఫీల్ వస్తుంది కదా.

5. అనుష్కా శర్మ :
ఎటువంటి కార్యక్రమమైనా వివాహ కార్యక్రమంలా భావిస్తుందేమో అనుష్కా శర్మ అన్నట్లుగా, ప్రతి కార్యక్రమంలోనూ వినూత్నంగా కనిపించే ప్రయత్నం చేస్తుంటుంది. ఒక్కసారి ఆమె పెళ్లి, రిసెప్షన్లలో ఆమె వేషధారణచూస్తే నిశ్చేష్టులవడం గారెంటీ. ముఖ్యంగా ఆమె అనుసరించిన న్యూడ్ లిప్స్టిక్ కూడిన న్యూడ్ మేకప్. తన ఫాలోవర్స్ వావ్ అనేలా, న్యూడ్ లిప్స్టిక్స్ కూడిన ఫొటోలతో నిండిపోయి ఉంటుంది తన ఇన్స్టాగ్రాం అకౌంట్. ఇక్కడ గ్లాసీ టెక్స్ట్చర్ జోడించిన న్యూడ్ లిప్స్టిక్ షేడ్ ధరించి ఎలా పోస్ ఇచ్చిందో చూడండి.



Click it and Unblock the Notifications