For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖ అందంలో మీ బుగ్గలు హైలెట్ అవ్వాలంటే: మేకప్ చిట్కాలు

మనం తరచూ పర్ఫెక్ట్ చీక్ బోన్స్ ని కలిగివున్న ఎంతోమంది సెలబ్రిటీస్ ని చూస్తూవుంటాం మరియు అలా ఉండాలని మనలో చాలామంది కోరుకుంటారు. కానీ మనం ఆవిధంగా మేక్ అప్ వేసుకోగలమా లేదు అని చింతిస్తూ వుంటారు. అయితే, మ

By Ashwini Pappireddy
|

మనం తరచూ పర్ఫెక్ట్ చీక్ బోన్స్ ని కలిగివున్న ఎంతోమంది సెలబ్రిటీస్ ని చూస్తూవుంటాం మరియు అలా ఉండాలని మనలో చాలామంది కోరుకుంటారు. కానీ మనం ఆవిధంగా మేక్ అప్ వేసుకోగలమా లేదు అని చింతిస్తూ వుంటారు. అయితే, మనం సరైన షేడ్స్ ని ముఖంలో సరైన భాగంలో ఎలావుపయోగించాలో తెలిసి వున్నట్లయితే ఇది చాలా సులభమైనది.

మీ బుగ్గలకు మేకప్ చేసుకోవడం వలన బాగా అందంగా కనిపిస్తారు మరియు ఇవి మీ అందానికి ఒక నిర్దిష్ట రూపాన్నిఇస్తాయి. కొన్ని బ్యూటీ చిట్కాలను ఉపయోగించడం ద్వారా అలాంటి అందమైన చీక్ బోన్స్ ని సులభంగా పొందవచ్చు.

makeup tips

కొందరు పుట్టుకతోనే అందమైన చీక్ బోన్స్ ని కలిగివుంటారు. మరికొందరికి వివిధ రకాల మేకప్ ల సహాయంతో చీక్ బోన్స్ ఉన్నట్లు వూహించుకోవాల్సివుంటుంది. అయితే, మనకి నచ్చిన రూపాన్ని పొందడానికి సహాయపడే అనేక రకాల సౌందర్య ఉత్పత్తుల ను టన్నుల కొద్దీ మనకు అందుబాటులో ఉంచినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పవచ్చు.

కానీ మీరు కలలుగనే మరియు అనుకున్న రూపాన్ని పొందడానికి కొంచం కష్టపడాల్సి ఉంటుంది మరియు ఈ ఆర్టికల్లో, మేము స్టెప్ బై స్టెప్ మేకప్ ని ఎలా అప్లై చేసుకోవాలో తెలియజేయడం జరిగింది. దీనిని అనుసరించడం ద్వారా మిమల్ని మీరు మరింత అందంగా చూసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం అదేంటో చూసేద్దామా...

1. మీ స్కిన్ టైపు గురించి తెలుసుకోండి

1. మీ స్కిన్ టైపు గురించి తెలుసుకోండి

ఒక్కక్కరు ఒక్కో స్కిన్ టోన్ ని కలిగివుంటారు. అందులోనూ మీది ఏ రకమైన స్కిన్ టోన్ అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ చర్మం కోసం సరైన ఉత్పత్తిని ఎంచుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. మీరు పొడి చర్మం కలిగి ఉంటే, మీ చర్మం తేమను కలిగించే విధంగా, క్రీమ్ బ్లుష్-ఆన్ ని ఉపయోగించాలి. జిడ్డు చర్మం నుండి సాధారణ స్కిన్ వరకు పౌడర్ బ్లుష్-ఆన్ మంచిగా ఉంటుంది.

2. ఒక మాయిశ్చరైజర్ ని వాడండి

2. ఒక మాయిశ్చరైజర్ ని వాడండి

మీరు ఒకవేళ పొడి చర్మాన్ని కలిగి వున్నట్లైతే, మీ ముఖం తేమగా ఉండటం చాలా ముఖ్యం. మీరు మీ ముఖానికి మేకప్ అప్లై చేసే ముందు మీ చర్మానికి మాయిశ్చరైజర్ ఉండేలా నిర్ధారించుకోండి. పొడి చర్మంపై మేకప్ పొరలుగా కనిపిస్తుంది మరియు కేకేడ్ అప్ చేస్తుంది. మాయిశ్చరైజర్ మీ చర్మానికి రక్షణను కలిపిస్తుంది మరియు మీ చర్మానికి గ్లో నిస్తుంది.

3. ఒక బ్రోన్జెర్ ని వాడండి

3. ఒక బ్రోన్జెర్ ని వాడండి

మీరు చీక్ బోన్స్ కింద సరైన భాగంలో బ్రోన్జెర్ ని అప్ప్లై చేసుకోవాలి. కానీ మీరు ఖచ్చితమైన స్పాట్ గుర్తించడం ఎలా? ఇది చాలా సులభం. మీ బుగ్గలను తాకి చూసినప్పుడు మీకు ఎక్కడ ఉన్నదో మీకు తెలుస్తుంది.

లేదా మీరు మీ బుగ్గలను తాకడం మరియు మీ వేళ్లు తో తాకడం ద్వారా చీక్ బోన్స్ ని సులభంగా కనుగొనవచ్చు. ఇప్పుడు, 45 డిగ్రీల కోణంలో మీ బ్రష్ను తిప్పండి మరియు మీ చెవుల వైపు ఒక వికర్ణ కదలికలో బ్రష్ను తిప్పండి.

ఇప్పుడు, మీ బ్రష్ ని బ్రాంజర్తో ముంచండి. మీ సాధారణ స్కిన్ టోన్ కంటే కొంచం ముదురు రంగుని ఎంచుకోండి. ఇప్పుడు, మీ బ్రోష్తో మీ సన్నని గీతతో చెవి నుండి ప్రారంభించి, మీ ముఖం లోపలికి వెళ్లి మీ చీక్ బోన్ దగ్గర ఆపండి.

4. దీనిని సరిగా కలపండి:

4. దీనిని సరిగా కలపండి:

మీరు బ్రోన్సర్ ని కలపడానికి బ్రష్ లేదా మీ చేతివేళ్లు ఉపయోగించవచ్చు. మీ చర్మం మీద ఎలాంటి పదునైన గీతలు లేదా గీతలు లేకుండా నిర్ధారించుకోండి, కానీ మీ చెంప మొత్తం ఆపిల్ బ్రోంజర్ తో వ్యాప్తి చేయకండి. ఒకవేళ మీకు షేడ్ తక్కువ అనిపిస్తే మీరు మరొక బ్రాంజర్ లేయర్ ని అప్లై చేసుకోవచ్చు.

5. మీ ఫేస్ మొత్తం సమానంగా అప్లై చేయండి

5. మీ ఫేస్ మొత్తం సమానంగా అప్లై చేయండి

మీ కడతల మీద బ్రోన్జెర్ ని అప్లై చేయండి మరియు మీ దవడ కిందిభాగం వరకు అప్లై చేసుకోండి అది మీ ఎముక భాగాన్ని బాగా కనిపించేలా చేస్తుంది.

6. బ్లుష్ ని అప్లై చేయండి:

6. బ్లుష్ ని అప్లై చేయండి:

బ్లుష్ ని అప్లై చేయడం చాలా ముఖ్యం. లేదంటే మీ ముఖం పాలిపోయినట్లు మరియు పసుపు రంగులో కనిపిస్తుంది. ఏ రంగు ని ఉపయోగించాలో ఖచ్చితంగా తెలియదా? చింతించకండి మేము మీకు సహాయం చేస్తాము.

ఫెయిర్ చర్మం ఉన్న వ్యక్తులు మృదువైన పింక్ షేడ్ పీచ్ అండర్ టోన్ ని ఎంచుకోవచ్చు. ఆలివ్-స్కిన్ టోన్ కోసం, ఒక ప్రకాశవంతమైన షేడ్ తో నీలం రంగు అండర్ టోన్ ని ఉపయోగించండి.

నల్లటి చర్మం కలిగిన వారు బ్రైట్ర్ కలర్స్ ని ఎంచుకోండి అనగా పింక్. దీనిని మీ చీక్ బోన్స్ మరియు అలాగే బ్రష్ను తో బుగ్గల కింద అప్లై చేసుకోండి.

7. కన్సీలర్ ని అప్లై చేయండి:

7. కన్సీలర్ ని అప్లై చేయండి:

ఒక బ్రష్ తో కాంటూర్ కిందిభాగం లో కన్సీలర్ ని అప్లై చేయండి. ఇది మీ చీకబోన్స్ ని మరింత అందంగా కనిపించేలా చేస్తుంది.

8. హైలైట్ను అప్లై చేయండి:

8. హైలైట్ను అప్లై చేయండి:

మీ చీకబోన్స్ ని విస్తరించేందుకు, మీ చర్మం కలర్ కంటే కొద్దిగా లైట్ గా వున్న దానితో హైలైట్ చేయండి. ఒకవేళ మీరు నల్లగా వున్నట్లైతే మీకు గోల్డెన్ హైలైటర్ మీకు బెస్ట్ ఛాయస్ అని చెప్పవచ్చు. లైట్ స్కిన్ ఉన్న వ్యక్తులు లైట్ కలర్స్ ని ఎంచుకోవచ్చు. కావాలనుకుంటే లైట్ గా మీ

చీక్ బోన్స్ కూడా రాసుకోవచ్చు.

మీరు మీ చెంప ఎత్తైన స్థలంలో దృష్టి పెడుతున్నారని నిర్ధారించుకోండి. మీ బుగ్గల మీద బ్రష్ తో వృత్తాకార కదలికలో తిప్పండి. మీ ముఖం యొక్క కేంద్ర భాగంలో ఎక్కువగా ఉపయోగించకుండా మానుకోండి. అలాగే మీ బ్రష్ తో లైట్ గా చెవుల వద్ద రాయండి. ఇది మీకు అందమైన చీక్ బోన్స్ ని అందిస్తుంది.

గమనిక:

మీరు పౌడర్ హైలైట్లను ఉపయోగిస్తుంటే, ఒక చిన్న బ్రష్తో మీ బుగ్గల మీద అప్లై చేసుకోండి. లిక్విడ్

హైలైట్ కోసం, మీరు ఒక స్పాంజ్ను ఉపయోగించవచ్చు, లేదా మీరు మీ వేళ్ళ మీద కొన్ని చుక్కలను ఉంచి, మీ చర్మంపై రాసుకోవచ్చు.

మీరు మీ ముఖం మీద ఎక్కువ అందాన్ని జోడించడానికి మీ కంటి యొక్క లోపలి మూలల మీ నుదురు ఎముక పైన ఉన్న కనుబొమ్మల మీద కూడా అప్లై చేసుకోవచ్చు.

9. ఫైనల్ అడ్జస్ట్మెంట్:

9. ఫైనల్ అడ్జస్ట్మెంట్:

పదునైన గీతలను నివారించడానికి మీరు అన్ని రకాల మేకప్లను కలపాలని నిర్ధారించుకోండి. మీరు ఒక లిక్విడ్ హైలైటర్ ను ఉపయోగించినట్లయితే, మీరు ట్రాన్సలూసెంట్ పౌడర్ ని లేయర్ గా అప్లై చేసుకోవాలని గుర్తుంచుకోండి. మీ మేకప్ మీ వేలిముద్రలతో బాగా కలపకపోతే, మృదువైన బ్రష్ను ఉపయోగించండి మరియు వృత్తాకార కదలికలో దీనిని కలపండి.

10. సెట్టింగ్ స్ప్రే ని ఉపయోగించండి:

10. సెట్టింగ్ స్ప్రే ని ఉపయోగించండి:

మీ మేకప్ పూర్తి అయిన తర్వాత, ఇది రోజంతా ఉండాలని మీరు కోరుకుంటారు కదా? అలాగైతే

మీరు రోజంతా ఫ్రెష్ గా మీ మేకప్ అలాగే ఉంచడానికి ఒక సెట్టింగ్ స్ప్రేని ఉపయోగించండి. మరియు మీరు ఎక్కడికి వెళ్లినా పర్ఫెక్ట్ చీక్ లుక్ తో మెరిసిపోండి.

చిట్కాలు:

-సరిగా మేకప్ ని కలపండి.

-ఈ పద్ధతిని పాటించండి. మీరు మొదటి ప్రయత్నంలో దాన్ని పొందలేరు.

-స్నేహితులతో కలిసి ప్రయత్నించండి.

-మీకు సరైన లైటింగ్ ఉందని నిర్ధారించుకోండి. ఇది సరైన షేడింగ్ మరియు హైలైట్ లను -ఎంచుకోవడంలో మీకు సహాయం చేస్తుంది.

-మీరు ఎల్లప్పుడూ ఒక చిన్న బ్రోజర్ తో మరియు తరువాత లేయర్ గా అప్లై చేసుకోండి

-ఇది టేకాఫ్ కంటే అప్లై చేయడానికి సులభంగా ఉంటుంది.

-ఎక్కువసేపు మేకప్ మీ చర్మం మీద ఉండటానికి మంచి బ్లుషెస్ ని కొనుగోలు చేయండి.

-మీ మేకప్ ఎక్కువసేపు ఉండటానికి క్రీం బ్లుషెస్ ని మాచింగ్ కలర్ బ్లష్ తో కలపండి.

English summary

makeup tips | how to create high cheekbones | makeup tips to get high cheekbones

Some women are blessed with high cheekbones, while others need to create the illusion of a higher and defined cheekbone. Achieving the desired look takes a little bit of work. So, here are some easy tips on how to achieve a high cheekbone look.
Story first published:Friday, January 12, 2018, 15:21 [IST]
Desktop Bottom Promotion