For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయిల్ స్కిన్ పై మేకప్ ఎక్కువసేపు నిలవడానికి ఈ 8 హ్యక్స్ ని ప్రయత్నించండి!

చర్మంపై అత్యంత చురుకుగా వ్యవహరించే ఆయిల్ గ్లాండ్స్ వలన చర్మంలో సెబమ్ లేదా సహజసిద్ధమైన నూనె అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. తద్వారా, మేకప్ అనేది ఎక్కువసేపు నిలిచి ఉండదు. మేకప్ ని అప్లై చేసిన వెంటనే ల

|

చర్మంపై అత్యంత చురుకుగా వ్యవహరించే ఆయిల్ గ్లాండ్స్ వలన చర్మంలో సెబమ్ లేదా సహజసిద్ధమైన నూనె అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. తద్వారా, మేకప్ అనేది ఎక్కువసేపు నిలిచి ఉండదు. మేకప్ ని అప్లై చేసిన వెంటనే లుక్ బాగానే ఉన్నా, ఆ లుక్ అనేది ఎక్కువ సేపు క్యారీ అవదు. కొద్దిసేపట్లోనే మేకప్ అనేది కేకీగా ఆలాగే అస్తవ్యస్తంగా మారుతుంది.

ఆయిలీ స్కిన్ సమస్యని ఎన్నో రకాల హోమ్ రెమెడీస్ తో పాటు కాస్మెటిక్స్ తో నివారించవచ్చు. అయితే, ఆయిలీ స్కిన్ పై మేకప్ ని అప్లై చేయడం మాత్రం కాస్తంత కష్టమైన విషయమే.

long lasting makeup

అయితే, కొన్ని చిట్కాలతో అలాగే ఉపాయలతో ఈ సమస్యను సులభంగా నివారించవచ్చు. తద్వారా, ఆయిలీ స్కిన్ పై మేకప్ ఎక్కువసేపు నిలిచి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. కాబట్టి, ఈ ఉపాయాలపై అలాగే చిట్కాలపై కాస్తంత దృష్టి సారించి వీటిని సరైన విధంగా పాటిస్తే మేకప్ ని ఆయిలీ స్కిన్ పై ఎక్కువ సేపు నిలిపి ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

ప్రైమర్ తో ప్రారంభించండి

ప్రైమర్ తో ప్రారంభించండి

ఆయిలీ స్కిన్ అనేది మేకప్ కి తగిన చర్మం కాదని వినడం కాస్తంత బాధాకర విషయమే. చర్మంపై ఉత్పత్తయ్యే అదనపు నూనె అనేది మేకప్ ని నిలిచి ఉండనివ్వదు. అందువలన, కొద్ది సమయంలోనే మేకప్ అనేది కేకీగా మారిపోయి అస్తవ్యస్తంగా తయారవుతుంది. కాబట్టి, ఆయిలీ స్కిన్ పై మేకప్ ను అప్లై చేసేటప్పుడు ప్రైమర్ ని వాడటం తప్పనిసరి. కాబట్టి ఆయిల్ రెసిస్టెంట్ తో పాటు మాట్టే ఫినిష్ కలిగి ఎక్కువసేపు నిలిచి ఉండే ప్రైమర్ ని వాడటం ఉత్తమం. ప్రైమర్ అనేది ఆయిలీ టెక్స్చర్ ను మేకప్ కు అనుగుణంగా మారుస్తుంది. కళ్ళకు ఐ ప్రైమర్ ను ప్రత్యేకించి వాడటం తప్పనిసరి. తద్వారా, మేకప్ అనేది చక్కగా సెటిల్ అవుతుంది.

మినరల్ మేకప్

మినరల్ మేకప్

ఆయిలీ స్కిన్ పై దట్టమైన మేకప్ ని వేయాలని భావించే వారు ఆయిల్ ఫ్రీ ఇనార్గానిక్ మినరల్స్ కలిగిన మినరల్ మేకప్ ని వాడితే చర్మంలో సహజసిద్ధంగానున్న ఆయిల్ కంటెంట్ వలన ఇబ్బందులు తలెత్తవు. జింక్ ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్ లతో మినరల్ మేకప్ అనేది తయారవుతుంది. ఈ రెండు చర్మానికి సన్ స్క్రీన్ ఏజెంట్ గా వ్యవహరిస్తాయి. కాబట్టి, మినరల్ మేకప్ ని ప్రయత్నించే ముందు చర్మంపై వాటి ప్రభావం గురించి దిగులు చెందనవసరం ఉండదు, మరోవైపు, ఇది సన్ స్క్రీన్ ఏజెంట్ గా పనిచేస్తుంది. మినరల్ మేకప్ ప్రోడక్ట్స్ అనేవి మేకప్ స్టోర్స్ లో సులభంగా లభిస్తాయి. అలాగే, ఆన్లైన్ లో కూడా ఇవి బాగానే లభ్యమవుతాయి.

ఫేస్ పౌడర్ - మేకప్ ని ఎక్కువ సేపు నిలిపి ఉంచే అద్భుత సాధనం

ఫేస్ పౌడర్ - మేకప్ ని ఎక్కువ సేపు నిలిపి ఉంచే అద్భుత సాధనం

ఫేస్ పౌడర్ ని వాడటం ద్వారా మేకప్ ని ఎక్కువ సేపు నిలిపి ఉంచవచ్చు. మీరు ఎంత అందంగా మేకప్ ని వేసుకున్నా ఆయిలీ స్కిన్ వలన చర్మం జిడ్డుగా తయారవుతుంది. కాబట్టి, ఫేస్ పౌడర్ ని వాడి టచ్ అప్స్ ఇస్తూ ఉంటే చర్మంలోని జిడ్డుతనం మటుమాయమవుతుంది. అదేవిధంగా, ఫౌండేషన్ అనేది చర్మంపై ఎక్కువసేపు నిలిచి ఉండేందుకు ఫేస్ పౌడర్ ఉపయోగపడుతుంది. ముఖం మొత్తాన్ని ఫేస్ పౌడర్ తో పెయింట్ చేయకుండా కేవలం ముఖం యొక్క పెరిమీటర్ వద్ద అలాగే నుదుటి మీద, చెంపలపై అలాగే గడ్డంపై అప్లై చేయడం ద్వారా మంచి లుక్ ని పొందవచ్చు.

హ్యాలురోనిక్ యాసిడ్ తో మాయిశ్చరైజర్

హ్యాలురోనిక్ యాసిడ్ తో మాయిశ్చరైజర్

ఆయిలీ స్కిన్ కలిగిన వారు తరచూ స్కిన్ పోర్స్ వలన సమస్యలకు గురవుతూ ఉంటారు. మేకప్ ని అప్లై చేయడం వలన ఆయిలీ స్కిన్ కలిగిన వారి చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. హ్యాలురోనిక్ యాసిడ్ కలిగిన మాయిశ్చరైజర్ ని అప్లై చేసిన తరువాత మేకప్ ని అప్లై చేయడం అనేది ఈ సమస్యను నిర్మూలించే ఉపాయం. మాయిశ్చరైజర్ లో కలిగిన హ్యాలురోనిక్ యాసిడ్ అనేది చర్మానికి తగినంత తేమను అందిస్తుంది. అలాగే, చర్మ రంధ్రాలను కృశింపచేస్తుంది. ఆ విధంగా మేకప్ వలన కలిగే పోర్ క్లాగింగ్ సమస్యను అరికడుతుంది.

ఆయిలీ స్కిన్ కి తగిన కాంపాక్ట్

ఆయిలీ స్కిన్ కి తగిన కాంపాక్ట్

కాస్మెటిక్స్ ని కొనేటప్పుడు, ఆయిలీ స్కిన్ కి తగిన కాంపాక్ట్ ను వాడాలి. మార్కెట్ లో లభ్యమైన వివిధ ప్రోడక్ట్స్ యొక్క బ్రాండ్స్ తమ ఉత్పత్తులను ఆయిల్ కంట్రోల్ ఉత్పత్తులుగా ప్రచారం చేసుకున్నా వాటిలో కొన్ని మాత్రమే పోర్ క్లాగింగ్ సమస్యను అలాగే కేకీ లుక్ ను నివారించగలిగినవి. కాబట్టి, తగిన పరిశోధన చేసిన తరువాత ఆయిలీ స్కిన్ కి సూట్ అయ్యే కాంపాక్ట్ ని వాడటం ఉత్తమం. కుషన్ కాంపాక్ట్స్ తో పటు లుమినస్ కాంపాక్ట్స్ వైపు వెళ్లక పోవడం మంచిది. ఇవి, ఆయిలీ స్కిన్ కి సూట్ అవ్వవు.

బ్లాటింగ్ పేపర్స్ ని వెంట ఉంచుకోండి

బ్లాటింగ్ పేపర్స్ ని వెంట ఉంచుకోండి

మేకప్ అనేది చర్మంలోని ఆయిలీనెస్ వలన తొలగిపోతోందని మీరు గ్రహించిన వెంటనే బ్లాటింగ్ పేపర్ ని తీసుకుని ఆయిలీ నెస్ కలిగిన ప్రదేశాలలో అద్దండి. ఈ విధంగా, చర్మంపైనున్న అదనపు నూనెను తొలగించుకోవచ్చు. తద్వారా, చర్మం మరింత మృదువుగా మారుతుంది. అయితే, బ్లాటింగ్ పేపర్ ని చర్మంపై రుద్దవద్దు. కేవలం అద్దడం ద్వారానే ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు.

సరైన కాంకీలర్ ను ఎంచుకోండి

సరైన కాంకీలర్ ను ఎంచుకోండి

చర్మతత్వం ఏదైనా కాంకీలర్ అనేది తప్పనిసరిగా వాడవలసిన మేకప్ ప్రోడక్ట్. మొటిమలు, మచ్చలు లేదా మొటిమల మచ్చలు వంటివి మేకప్ ని పాడుచేయకుండా ఉండేందుకు కాంకీలర్ ని తప్పనిసరిగా వాడాలి. చర్మంపై మచ్చలను కాంకీలర్ ని వాడటం ద్వారా కవర్ చేయవచ్చు. కాంకీలర్స్ లో కూడా వివిధ రకాలు లభ్యమవుతాయి. ఆయిలీ స్కిన్ కలిగిన వారు తమ చర్మతత్వాన్ని తగిన కాంకీలర్ ను ఎంచుకుంటే మేకప్ అనేది సరైన లుక్ ని ఇస్తుంది. ఆయిలీ స్కిన్ కలిగిన వారు స్పాట్ కరెక్టర్ కాంకీలర్ పెన్ ను వాడాలి. కైలీ స్కిన్ కలిగిన వారు ఆయిల్ బేస్డ్ లిక్విడ్ కాంకీలర్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదు.

English summary

Long Lasting Makeup | Long Lasting Makeup On Oily Skin | Makeup For Oily Skin

For oily skin women, makeup is a big concern as within some time of applying it, the makeup becomes cakey and muddy.Here comes the role of some hacks and tips, following which makeup can also stay long on an oily skin.From priming your skin at first to carrying blotting papers, check out the hacks.
Story first published:Tuesday, January 16, 2018, 17:41 [IST]
Desktop Bottom Promotion