బేసిక్ మేకప్ ని ప్రొఫెషనల్ గా అప్లై చేసుకోవడమెలా? స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్

Subscribe to Boldsky

చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి మేకప్ కాన్సెప్ట్ అనేది అత్యద్భుతంగా అనిపించేది. నిజమే కదా? మన ఫేవరేట్ సెలెబ్రిటీస్ ప్రభావంతో మనమందరం కొన్ని బేసిక్ మేకప్స్ ని ప్రయత్నించే ఉండుంటాము. అవి ఎక్కువ సార్లు ఫెయిల్ అయి ఉండుంటాయి కదా? ఇలా జరగడానికి కారణమేంటంటే అనుభవరాహిత్యం అలాగే అవగాహనారాహిత్యం.

మీలో చాలా మందికి అసలు ఈ బీబీ క్రీమ్ వలన ఉపయోగాలేంటో దాన్నెలా వాడాలో తెలిసి ఉండకపోవచ్చు. బీబీ క్రీమ్ కి అలాగే ఫౌండేషన్ కి మధ్య గల తేడా కూడా తెలియకపోవచ్చు. కాంకీలర్ ని ఎలా అప్లై చేయాలో తెలిసి ఉండకపోవచ్చు. అసలీ మేకప్ ఇంగ్రిడియెంట్స్ అవసరమేనా? వీటిని ఎలా ఎంచుకోవాలి? మేకప్ విషయంలో బిగినర్స్ ని ఈ ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి.

How To Apply Basic Make Up Like A Pro? A Step By Step Tutorial

ఈ రోజు, బ్లాగ్స్, యూ ట్యూబ్ ట్యుటోరియల్స్ వంటి ఎన్నో ప్లాట్ ఫార్మ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మేకప్ మరియు బ్యూటీ టిప్స్ విస్తృతంగా లభిస్తున్నాయి.

ఈ ఆర్టికల్ లో బిగినర్స్ కోసం బేసిక్ మేకప్ ట్యుటోరియల్ ను స్టెప్ బై స్టెప్ గా వివరించాము. ఈ టిప్స్ ని పాటిస్తే ప్రొఫెషనల్ లా మేకప్ ని అప్లై చేసుకోగలుగుతారు. కాబట్టి, నెక్స్ట్ టైమ్ ఏదైనా పార్టీకి లేదా సింపుల్ ఫంక్షన్ కి వెళ్లదలచుకుంటే ఈ సింపుల్ స్టెప్ బై స్టెప్ మేకప్ ట్యుటోరియల్ ని పాటించి మంచి లుక్ ను సొంతం చేసుకోండి.

స్టెప్ 1 : చర్మాన్ని క్లీన్స్ చేసుకోండి:

స్టెప్ 1 : చర్మాన్ని క్లీన్స్ చేసుకోండి:

మేకప్ ని వేసుకోవడానికి మొదటి అడుగు ఏంటంటే చర్మాన్ని శుభ్రంగా క్లీన్స్ చేసుకోవడం. మొదటగా, ముఖాన్ని జెంటిల్ క్లీన్సర్ తో శుభ్రపరచుకోవాలి. ఈ స్టెప్ వలన చర్మంపై పేరుకున్న దుమ్ము తొలగిపోతుంది.

మీ ముఖాన్ని క్లీన్స్ చేసుకున్న తరువాత చర్మాన్ని జెంటిల్ స్క్రబ్ తో ఎక్స్ఫోలియెట్ చేసుకోవాలి. ఎక్స్ఫోలియేషన్ వలన డెడ్ స్కిన్ సెల్స్ అనేవి తొలగిపోతాయి. మీ ముఖం తాజాగా అలాగే మేకప్ కి రెడీగా మారుతుంది.

ఇప్పుడు, స్కిన్ పై మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి. ఈ స్టెప్ వలన మేకప్ కి బేస్ ఏర్పాటవుతుంది. అందువలన, మేకప్ అనేది చర్మంపై ఎక్కువసేపు నిలిచి ఉండగలుగుతుంది.

స్టెప్ 2: బీబీ క్రీమ్ ను అప్లై చేసుకోండి:

స్టెప్ 2: బీబీ క్రీమ్ ను అప్లై చేసుకోండి:

బీబీ క్రీమ్ అనేది చర్మాన్ని ఫౌండేషన్ లా కవర్ చేస్తుంది. తేలికపాటి మేకప్ ని వేసుకుని సహజమైన లుక్ ను పొందాలనుకునే వారికి ఇది తోడ్పడుతుంది. బీబీ క్రీమ్ ను అప్లై చేసుకున్న వారు ఫౌండేషన్ స్టెప్ ని స్కిప్ చేయవచ్చు. బీబీ క్రీమ్ ను అప్లై చేసుకోవడం చాలా సులభం. ఇందుకు మీరు మేకప్ లో ప్రొఫెషనల్ అవనవసరం లేదు.

బీబీ క్రీమ్ ను ఎంచుకునేటప్పుడు మీ స్కిన్ టోన్ కి తగిన క్రీమ్ ను ఎంచుకోండి. సేల్స్ పెర్సన్ హెల్ప్ ను తీసుకోండి. బీబీ క్రీమ్ ను కొనేముందు ప్యాచ్ టెస్ట్ ను చేసుకోండి.

కొంత బీబీ క్రీమ్ ను తీసుకుని మీ ఫింగర్ టిప్స్ తో లేదా బ్రష్ తో ముఖానికి అప్లై చేసుకోండి. ఈవెన్ స్కిన్ టోన్ వచ్చేలా బీబీ క్రీమ్ ను ముఖంపై ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి. నేచురల్ లుక్ రావాలంటే బీబీ క్రీమ్ ను థిన్ లేయర్ లా అప్లై చేయడం అవసరం.

స్టెప్ 3: కంన్సీలర్

స్టెప్ 3: కంన్సీలర్

బీబీ క్రీమ్ లేదా ఫౌండేషన్ ను అప్లై చేసేటప్పుడు కాంకీలర్ అనేది అవసరపడుతుంది. ఇది డార్క్ సర్కిల్స్ ని తగ్గించేందుకు అలాగే ముఖంపై స్పాట్స్ ని తొలగించేందుకు తోడ్పడుతుంది. కాంకీలర్ ని ఎక్స్ట్రా కవరేజ్ అవసరం అనే ప్రాంతాల్లో అప్లై చేయండి. ఇప్పుడు దీన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి.

స్టెప్ 4: బ్లష్

స్టెప్ 4: బ్లష్

ఈ స్టెప్ అనేది పూర్తిగా అప్షనల్. మీ మేకప్ అనేది మరికొంత పెర్ఫెక్ట్ గా ఉండాలని మీరు భావించినట్లైతే సబ్టిల్ పింక్ షేడ్ ను చీక్స్ ను హైలైట్ చేసేందుకు అప్లై చేయండి. సరైన విధంగా బ్లష్ ని బ్లెండ్ చేయండి. అప్పుడు తేలికపాటి లుక్ వస్తుంది. అతిగా అప్లై చేయకండి.

స్టెప్ 5: కళ్ళు

స్టెప్ 5: కళ్ళు

కంటికి చేసే మేకప్ అనేది మీ అందాన్ని రెట్టింపు చేసేందుకు తోడ్పడుతుంది. ఇందుకోసం, కొంత ప్రైమర్ ను ఐ లిడ్స్ పై అప్లై చేయండి. ఇప్పుడు, సింపుల్ లుక్ కై న్యూట్రల్ కలర్ ఐ షాడో ని అప్లై చేయండి. ఐ లైనర్ లేదా కాజల్ ను అప్లై చేయండి.

చివరగా, ఐ మేకప్ ను ఐ ల్యాషెస్ పై మస్కారాను అప్లై చేయడం ద్వారా ముగించవచ్చు. దీని వలన కళ్ళు పెద్దగా కనిపిస్తాయి. కంటికి డ్రమాటిక్ లుక్ వస్తుంది.

స్టెప్ 6: పెదాలు

స్టెప్ 6: పెదాలు

సింపుల్ మేకప్ లుక్ కై ఇది చివరి స్టెప్. మీరు ఎంచుకునే లిప్ స్టిక్ కలర్ అనేది మీ స్కిన్ టోన్ కు మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి. సింపుల్ లుక్ కై మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి లైట్ కలర్డ్ లిప్ బామ్ ని స్కిన్ టోన్ కి తగినట్టుగా ఎంచుకోవాలి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    How To Apply Basic Make Up Like A Pro? A Step By Step Tutorial

    The concept of make up has always been fascinating to all of us when we were kids, isn't it? Influenced by our favourite celebrities we have all experimented with some basic make ups which most of the time went for a toss. The reason for this being lack of experience and knowledge.
    Story first published: Tuesday, June 26, 2018, 12:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more