For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లిక్విడ్ ఐ లైనర్ ను ఎలా అప్లై చేసుకోవాలో తెలిపే స్టెప్ బై స్టెప్ గైడ్

లిక్విడ్ ఐ లైనర్ ను ఎలా అప్లై చేసుకోవాలో తెలిపే స్టెప్ బై స్టెప్ గైడ్

|

ఐ లైనర్ ను అప్లై చేసుకోవడం కొంచెం కష్టతరమే. దీనికి ఎంతో పేషన్స్ కావాలి. లేదంటే మేకప్ లుక్ మొత్తం పాడైపోతుంది. ఒక్క రాంగ్ మూవ్ వలన పెర్ఫెక్షన్ దెబ్బతింటుంది. ఈ ఆర్టికల్ అనేది ఐ లైనర్ ను అప్లై చేసుకోవడంలో ఇబ్బంది పడే బిగినర్స్ కు ఎంతగానో తోడ్పడుతుంది. ఐ లైనర్ ను ఎలా అప్లై చేయాలో ఇందులో వివరించబడింది. ఇందులో లిక్విడ్ ఐ లైనర్ ను పెర్ఫెక్ట్ గా అప్లై చేసే విధానాన్ని వివరించాము.

అయితే, ఐ లైనర్ ను అప్లై చేసుకోవడానికి ముందు మీరు కొన్ని చిట్కాలను పాటించవలసి ఉంటుంది. మరకలు తో అలాగే మెస్సీగా తయారైన ఐ లైనర్స్ అనేవి మొత్తం లుక్ ను పాడుచేస్తాయి. అందువలన గ్రీజీ ఐ లిడ్స్ ను అవాయిడ్ చేయడం మంచిది. తద్వారా, ఐ లైనర్ అనేది పెర్ఫెక్ట్ గా ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది.

ముందుగా, ఐ లైనర్ అప్లై చేసుకోవడానికంటే ముందు ఐ లిడ్స్ పై కాస్తంత ప్రైమర్ ను అప్లై చేసుకోండి. లిక్విడ్ లేదా క్రీమీ ప్రైమర్ ను అప్లై చేసుకోండి. ఇప్పుడు లిక్విడ్ ఐ లైనర్ ను అప్లై చేసుకునే స్టెప్ బై స్టెప్ గైడ్ ను తెలుసుకుందాం.

How To Apply A Liquid Eyeliner: Step By Step Guide

కావలసిన పదార్థాలు:

లిక్విడ్ ఐ లైనర్

మస్కారా

ఐ ల్యాష్ కర్లర్ (ఆప్షనల్)

స్టెప్ 1

మొదటగా, లిక్విడ్ ఐ లైనర్ ను అప్లై చేసుకునే ముందు ఐ లైనర్ కంటైనర్ ను బాగా షేక్ చేయాలి. ఇప్పుడు అప్పర్ లిడ్స్ పై బ్రష్ ను ఫ్లాట్ గా పట్టుకుని ఐ లైనర్ ను అప్లై చేసుకోవాలి. బ్రష్ ను ఫ్లాట్ గా హోల్డ్ చేస్తే స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. అలాగే మరకలు పడే ప్రమాదం కూడా తగ్గుతుంది. స్ట్రెయిట్ బ్రష్ కంటే పెర్ఫెక్ట్ స్ట్రోక్ వస్తుంది.

స్టెప్ 2:

మనలో చాలా మందికి ఐ లైనర్ ను ఏ విధంగా వేసుకోవాలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అందువలన, నేరుగా అవుటర్ కార్నర్ నుంచి ఐ లైనర్ ను అప్లై చేస్తూ ఉంటారు. అయితే, ముందుగా ఐ లైనర్ ను మధ్యలోంచి అప్లై చేసుకోవడం ప్రారంభించాలి. అలా అవుటర్ కార్నర్స్ కి వెళ్ళాలి.

స్టెప్ 3:

వింగ్ అనేది ఇప్పటి ట్రెండ్. ఇది మీ ఐస్ కి డ్రమాటిక్ టచ్ ని ఇవ్వడంతో పాటు ఎలిగెంట్ లుక్ ను కూడా అందిస్తుంది. ఇది బిగినర్స్ కి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అయితే, పేషన్స్ తో సాధన చేస్తే ఈ లుక్ ను సులభంగా తెచ్చుకోవచ్చు. ముందుగా లోవర్ ఐ లాష్ కార్నర్ నుంచి వింగ్ ను ఫార్మ్ చేయండి. ఇది ఐ లైనర్ ను ఈక్వల్ గా అలాగే పెర్ఫెక్ట్ గా మార్చేందుకు తోడ్పడుతుంది.

స్టెప్ 4:

చివరగా, ఐ ల్యాషెస్ పై మస్కారాతో కొన్ని కోట్స్ అప్లై చేయండి. ఇది ఐస్ కు ఇంటెన్స్ లుక్ ను అందిస్తుంది. మీ ఐస్ కి మరింత డ్రమాటిక్ లుక్ ను అందించాలని అనుకుంటే ఫాల్స్ ఐ ల్యాషెస్ ను వాడండి. ఇవి మార్కెట్ లో లభిస్తాయి.

చిట్కాలు:

1. ఐ లైనర్ ని అప్లై చేయడం కాస్తంత కష్టతరంగా ఉంటే మీరు చిన్న చిన్న డాట్స్ ని డ్రా చేసుకుని వాటిని కలుపుతూ స్ట్రోక్ ను క్రియేట్ చేసుకుంటే పెర్ఫెక్ట్ లుక్ మీ సొంతమవుతుంది.

2. స్మడ్జ్ ప్రూఫ్ ఐ లైనర్ ని కొనుగోలు చేయండి. ముఖ్యంగా వాటర్ ప్రూఫ్ ది ప్రిఫర్ చేయడం వలన ఐ లైనర్ ఎక్కువ సేపు పెర్ఫెక్ట్ గా ఉంటుంది.

3. పెర్ఫెక్ట్ వింగ్ లుక్ రావటం కోసం అవుటర్ కార్నర్ వద్ద ఒక పీస్ ఆఫ్ టేప్ ను వాడండి.

4. ఐ ల్యాష్ కర్లర్ మీ వద్ద ఉంటే ఐ లైనర్ ని ఉపయోగించే ముందు ల్యాషెస్ ని కర్ల్ చేయండి.

5. ఐ లైనర్ లైన్స్ ని సన్నగా వేయడం ప్రారంభించండి. ఆ తరువాత థిక్నెస్ ను పెంచవచ్చు.

6. అప్లై చేసిన తరువాత ఐ లైనర్ ఆరే వరకు పేషన్స్ తో ఉండండి. లేదంటే మరకగా మారుతుంది.

7. కొంత ట్రాన్స్లుసెంట్ పౌడర్ ను అప్లై చేసి ఐ లైనర్ ను సెట్ చేయవచ్చు.

English summary

How To Apply A Liquid Eyeliner: Step By Step Guide

Applying eyeliner can seem to be a tedious task especially if it's a liquid eyeliner. One wrong move can create a huge mess. But as we say practice makes you perfect, this article is meant to all those beginners who find it difficult to just apply a stroke on your eyelids. Holding a flat brush and then making a wing can help you get perfectly lined eyes.
Desktop Bottom Promotion