For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివహమహోత్సవానికి వధువు మేకప్ కిట్ ను ఏ విధంగా సన్నద్ధం చేసుకోవాలి?

వివహమహోత్సవానికి వధువు మేకప్ కిట్ ను ఏ విధంగా సన్నద్ధం చేసుకోవాలి?

|

అందమైన వధువుగా మారాలనేది బాల్యం నుంచి ప్రతి అమ్మాయి కనే కల. చిన్నప్పుడు ఆడుకునేటప్పటి నుండి తల్లి చీరలు కట్టుకోవడం, తల్లిలాగా ముస్తాబవ్వడం వంటివి చేస్తుంటారు. దీనిని బట్టి వారు పెళ్లిరోజున ఇంకెంత బాగా కనిపించాలనుకుంటున్నారో, అన్ని విషయాలలో ఎంతలా ఉత్తమమైనవే కోరుకుంటున్నారో తేటతెల్లమవుతుంది.

పెళ్లిరోజు అనేది ప్రతిఒక్కరి జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజు. ఆ రోజున ప్రతి యువతి ఆనందోద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. మీకు పరిచయమున్న ప్రతి ఒక్కరు ఆ రోజు హాజరవుతారు. కనుక మీకు వీలైనంత అందంగా, చూడగానే ఆకట్టుకునేట్టుగా ముస్తాబవ్వడానికి ప్రయత్నిస్తారు.

you need in a bridal makeup kit

అంతేకాకుండా ఆ రోజు మీరు ప్రత్యేకమైన ఫోటోలు కూడా తీసుకుంటారు. భారత దేశంలో పెళ్లిళ్లు చాలా ఆర్భాటంగా జరుగుతాయి. అవి కేవలం తాళి కట్టడంతో మాత్రమే ముగుయవు. మెహంది, సంగీత్, బ్యాచిలర్ పార్టీ మొదలైన కార్యక్రమాలతో కూడుకుని ఉంటుంది. ఇన్ని కార్యక్రమాల కొరకు వైవిధ్యంగా తయారవ్వడం ఒక సవాలే!

మీ అదృష్టం కొద్దీ ఆ అంశాన్ని గురించి ఇక్కడ మేము పూర్తి పరిజ్ఞానాన్ని అందిస్తున్నాం. అన్ని కార్యక్రమాలకు ఈ క్రింద చెప్పబడిన సౌందర్య ఉత్పత్తులు ఉంటే చాలు, మైమరపించే రూపం మీ సొంతమవుతుంది. గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే, ఒకవేళ మీ ముఖం వ్యాక్సింగ్, థ్రెడింగ్ వలన ఎర్రగా మారే అవకాశం ఉంటే, పెళ్లిరోజుకు వారం రోజుల ముందే అటువంటి పనులు పూర్తి చేయాలి.

వధువు మేకప్ కిట్ లో ఈ క్రింది ఉత్పత్తులు తప్పనిసరిగా ఉండాలి. అవేంటో చూద్దాం రండి!

1. ఫౌండేషన్:

1. ఫౌండేషన్:

ఒక మంచి ఫౌండేషన్ ఆడపిల్లలకు మంచి స్నేహితురాలి వంటిది. మీ మేని ఛాయకు సరిగ్గా నప్పే ఫౌండేషన్ ను బాగా పరీక్ష చేసి ఎంపిక చేసుకోండి. మీరు ఫోటోలు తీసుకునేటప్పుడు ఫ్లాష్ కాంతిని ప్రతిఫలించేది కాకుండా, ఆక్సిడైస్ అవ్వకుండా మధ్యస్థాయిలో లేదా పూర్తి కవరేజ్ ఇచ్చే ఫౌండేషన్ ఎన్నుకోండి. ఫ్లాష్ కాంతిని ప్రతిఫలించకుండా ఉండాలంటే SPF లేని HD ఫౌండేషన్ ఉపయోగించండి. పెళ్లిరోజుకు పూర్తి కవరేజ్ ఇచ్చే ఫౌండేషన్ ను, మిగతా కార్యక్రమాలకు మధ్యస్థాయిలో కవరేజ్ ఇచ్చే ఫౌండేషన్ ను వాడాలి ఎందుకంటే పూర్తి కవరేజ్ ఇచ్చే ఫౌండేషన్ మేకప్ కు భారీతనాన్ని జోడిస్తుంది పైగా దానిని ఎక్కువగా వాడకూడదు.

2. కన్సీలర్:

2. కన్సీలర్:

కన్సీలర్లు ముఖం మీద మచ్చలను, మరకలను దాచిపెట్టి ముఖంపై సహజంగా కాంతి ప్రతిఫలించే భాగాలను ప్రస్ఫుటంగా కనపడేటట్టు చేస్తుంది. సాధారణంగా రెండు కన్సీలర్లు అవసరమవుతాయి. భారతీయ స్త్రీలలో కళ్ళ చుట్టూ నల్లని వలయాలు మరియు హైపర్ పిగ్మెంటేషన్ ముఖ్యమైన సమస్యలు సర్వసాధారణం. వీటిని దాచిపెట్టేందుకు పీచ్ రంగున్న కన్సీలర్, మిగిలిన ప్రదేశాల్లో రాయడానికి దానికన్నా రెండు ఛాయలు తేలికైన కన్సీలర్ ను ఉంచుకోండి. వీటిని కంటి క్రింది భాగం ముక్కు మరియు చంపలను మెరిసేటట్టు చేయడానికి వాడండి.

3. బ్లష్ పేలేట్:

3. బ్లష్ పేలేట్:

వివిహ విషయానికి వస్తే విడివిడిగా వివిధ రంగుల బ్లష్ లను కొనడం కన్నా బ్లష్ పేలేట్ ను కొనడం మంచిది. ఎందుకంటే మీరు వేసుకునే దుస్తుల రంగులను అనుసరించి, లిప్ స్టిక్ మరియు ఐ షేడ్ రంగులకు నప్పే బ్లష్ ను వాడాలి. బ్లష్ పేలేట్ లు అయితే చిన్నవిగా ఎక్కడికైనా తీసుకెళ్లడానికి సులువుగా ఉంటాయి. ఒక వధువుకు అవసరమైన అన్ని రంగులు, అది పీచ్ అయినా, న్యూట్రల్ రంగులైనా, కొట్టొచ్చినట్లు ఉండే ఎరుపు రంగైనా అందులో ఉంటాయి.

4. బ్రాంజర్:

4. బ్రాంజర్:

బ్రాంజర్లు ముఖకవళికలను స్పష్టంగా కనిపించేటట్లు ముఖానికి ఒక రంగునిస్తాయి. బ్రాంజర్ ద్వారా ముఖంపై కాంటూరింగ్ చేసి కవళికలకు లోతును ఆపాదించవచ్చు. షిమ్మర్ బ్రాంజర్ కు బదులుగా మ్యాట్ బ్రాంజర్ ను వాడండి. షిమ్మర్ బ్రాంజర్ వలన చర్మానికి టెక్స్చర్ చేకూరుతుంది

5. బనానా పౌడర్:

5. బనానా పౌడర్:

వివాహ ముస్తాబుకు బాగా రంగు ఎక్కువగా ఉండే కాంపాక్ట్ పౌడర్ల కన్నా లూస్ పౌడర్లలను వాడటం మంచిది. కాంపాక్ట్ పౌడర్ల వలన ముఖంపై పౌడర్ అట్టకట్టినట్లు కనిపిస్తుంది. పసుపు ఛాయ కలిగిన బనానా పౌడర్ ను కళ్ళ కింద అద్దటానికి వాడటం వలన కన్సీలర్ పనితనం ఇంపుగా తయారవుతుంది. పసుపు రంగు పౌడర్ మీ చర్మానికి అతిగా రంగును అద్దినట్టు చేయకుండా కాంతివంతంగా ఉండేటట్లు చేస్తుంది. కన్సీలర్ అద్దిన చోటంతా బనానా పౌడర్ ను అద్ది అధికంగా అంటుకున్న పౌడర్ ను కొద్ది నిమిషాల తరువాత బ్రష్ తో తుడిచేయండి. దీనివలన మీ ముఖానికి రోజంతా నిలిచి ఉండే మచ్చలేని శోభ చేకూరుతుంది.

6. ఐ షాడో పేలేట్:

6. ఐ షాడో పేలేట్:

మీరు ఎంపిక చేసిన ఐ షాడో పేలేట్ లేత మరియు ముదురు రంగుల మిశ్రమంగా ఉండటం తప్పనిసరి. కానీ ముదురు రంగులపై ఎక్కువ ధ్యాస పెట్టండి, ఎందుకంటే భారతీయ వివాహ వేడుకలలో ముదురుగా, ప్రకాశవంతంగా ఉండే రంగుల దుస్తులు వాడతారు. రస్ట్, ముదురు నారింజ మరియు టాప్ కలర్లతో పాటు గోల్డ్ మరియు బ్రాంజ్ రంగులు కూడా అవసరమే! ఒకే పేలేట్ లో ఈ రంగులన్నీ ఉంటే మీ పని సులభతరం అవుతుంది.

7. లిక్విడ్ లైనర్:

7. లిక్విడ్ లైనర్:

రెక్కలుగా తీర్చిదిద్దిన కళ్ళు భారతీయ వధువు ముఖానికి కళను తెస్తుంది. బాగా నల్లగా ఉండే వాటర్ ప్రూఫ్ ఐ లైనర్ ను వాడండి. స్మడ్జ్ ప్రూఫ్ లైనర్ వాడితే చెమట, కన్నీరు వలన కరిగిపోయి ముఖం నల్లబడకుండా ఉంటుంది.

8. కాటుక:

8. కాటుక:

భారతీయ వధువు ముస్తాబు కాటుక రేఖ అద్దకుండా పరిపూర్ణం కాదు. వాటర్ ప్రూఫ్ మరియు స్మడ్జ్ ప్రూఫ్ కాటుకతో మీ పైకనురెప్ప మరియు కింది కనురెప్పను తీర్చిదిద్దండి. దానిపైన ఒకసారి బ్రష్ ను నడిపితే చూడటానికి మరీంత అందంగా ఉంటుంది.

9. హైలైట్:

9. హైలైట్:

వధువు మోముకు మైమరపించే మెరుపును అందివ్వటానికి హైలైట్ ఉపయోగపడుతుంది. మరీ మెత్తగా ఉండే, మెరుపుతో కూడిన హైలైట్ కాకుండా సన్నని పౌడర్ మాదిరిగా ఉండే హైలైట్ ను వాడండి.

10. సెట్టింగ్ స్ప్రే:

10. సెట్టింగ్ స్ప్రే:

సెట్టింగ్ స్ప్రే మేకప్ ను ముఖానికి బాగా అంటిపెట్టుకుని ఉండేటట్టు చేసి చెరగనివ్వదు.

English summary

How To Build Your Bridal Makeup Kit

Wedding day is one of the most awaited days ever in your life. On this D day, you need to look gorgeous and beautiful than ever. For which you need the perfect foundation, eyeliner, primer, bronze, etc. While buying a foundation, go for HD foundations that are free of SPF to avoid flashback.Your wedding day can pretty much be the biggest day of your life.
Story first published:Wednesday, April 4, 2018, 13:44 [IST]
Desktop Bottom Promotion