For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ ఉదయం ఇలా మేకప్ చేసుకుంటే అందంగా, ఆకర్షనీయంగా కనబడుతారు

సహజంగా మహిళలకు మేకప్ వేసుకోవడం అంటే ఇష్టం. అయితే మేకప్ వేసుకోవడంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మేకప్ కోసం ఎంపిక చేసుకునే కలర్స్, ఫార్ములాస్, ప్రొడక్ట్స్ విషయంలో తప్పిదాలు చేస

By Mallikarjuna D
|

సహజంగా మహిళలకు మేకప్ వేసుకోవడం అంటే ఇష్టం. అయితే మేకప్ వేసుకోవడంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మేకప్ కోసం ఎంపిక చేసుకునే కలర్స్, ఫార్ములాస్, ప్రొడక్ట్స్ విషయంలో తప్పిదాలు చేస్తుంటారు. పగటి పూట మేకప్ వేసుకోవడం వల్ల చర్మంలో చారలు, ముడతలు, స్కార్స్, డార్క్ సర్కిల్స్ వంటివి కనబడనివ్వకుండా కవర్ చేయవచ్చు.

మేకప్ విషయం ఏ చిన్న పొరపాట్లు చేసినా న్యాచురల్ అందం కాస్తా పోతుంది, చూడటానికి అలసటగా కనబడుతారు, అలా జరగకూదనే మీకోసం కొన్ని సింపుల్ అండ్ బ్యూటిఫుల్ టిప్స్ ను అందిస్తున్నాము.

look best with these amazing beauty tips every morning

ఈవెనింగ్ వేసుకునే మేకప్ కంటే పగట పూట వేసుకునే మేకప్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పగటి పూట వేసుకునే మేకప్ రాత్రి సమయంలో వేసుకునే దానికంటే లైట్ గా ఉండాలి. పగటి పూట స్మోకి మేకప్ లేదా హెవీ మేకప్ వేసుకోవడం వల్ల అంత అందంగా కనబడరు.

కాబట్టి, పగటి పూట వేసుకునే మేకప్ గురించి కొన్ని మెళుకువలు తెలుసుకోవడం మంచిది. కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకున్నట్లైతే మీరు వేసుకునే మేకప్ ఎక్కువ సమయం నిలిచి ఉండటం మాత్రమే కాదు ఇది, అందంగా, లైట్ గా కనబడేలా చేస్తారు.

ఈ ఆర్టికల్లో మీ మేకప్ ఎలాంటి ప్రొడక్ట్స్ అవసరం అవుతాయి, డే సమయం మేకప్ ఎలా వేసుకుంటే అందంగా కనబడుతారు అనే విషయాలను తెలపడం జరిగింది. మరి అవేంటో ఒకసారి చూద్దామా...

ముఖం శుభ్రం చేసుకోవాలి:

ముఖం శుభ్రం చేసుకోవాలి:

మేకప్ అప్లై చేయడానికి ముందు ముఖం శుభ్రంగా కడుక్కోవడం వల్ల చర్మంలో మలినాలు తొలగిపోతాయి,. ఫేస్ క్లియర్ గా ఉంటుంది. అందుకు జెంటిల్ క్రీమ్ లేదా ఫేస్ క్లెన్సర్ ను ఉపయోగించాలి.

ఫేస్ క్లెన్సర్ ను ముఖానికి అప్లై చేసి రబ్ చేయాలి. 5 నిముషాలు మర్ధన చేసి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి క్లీన్ టవల్ తో తుడుచుకోవాలి.

చర్మానికి మాయిశ్చరైజర్ :

చర్మానికి మాయిశ్చరైజర్ :

మీ చర్మ తత్వానికి సరిపడే మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల ఇది మేకప్ కు మంచి ఫౌండేషన్ అవుతుంది. ఇది మేకప్ ముఖం మీద ఎక్కువ సమయం నిలిచి ఉండటానికి సమాయపడుతుంది. మాయిశ్చరైజర్ ముఖం, మెడ, పెదాలు, ఐలిడ్స్ మరయు ముక్కుకు అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ చర్మంలోకి పూర్తిగా ఇమిడే వరకు ఉండి తర్వాత మేకప్ వేసుకోవాలి.

సన్ స్క్రీన్ తప్పనిసరి:

సన్ స్క్రీన్ తప్పనిసరి:

సంవత్సరం మొత్తం సన్ స్క్రీన్ తప్పనిసరి. ఇది యూవి కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. ఎల్లప్పుడు బోర్డ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ ను ఎంపిక చేసుకోవాలి. అంటే మినిమం 15 ఎస్ఎఫ్ పి కలిగిన క్రీమ్ ఎంపిక చేసుకుని, ముఖం, మెడకు అప్లై చేయాలి. సన్ స్క్రీన్ ప్రీమెచ్యుర్ ఏజింగ్, ముడుతలు, డార్క్ స్పాట్స్, ఫ్రాక్ల్సె మొదలగు సమస్యలను నివారిస్తుంది.

ఫేస్ ప్రైమర్ ను అప్లై చేయాలి:

ఫేస్ ప్రైమర్ ను అప్లై చేయాలి:

మేకప్ వేసుకునే వారికి ప్రైమర్ తప్పనిసరి, ఇది మేకప్ ఎక్కువ సమయం నిల్చి ఉండటానికి సహాయపడుతుంది , ముఖ్యంగా ఫేస్ ప్రైమర్ ముఖ చర్మం స్మూత్ గా కనబడేలా చేస్తుంది. ముఖంలో మచ్చలు, ముడుతలు, స్పాట్స్, ఆయిల్స్ వంటివి కంట్రోల్ చేస్తుంది.

కొద్దిగా ప్రైమర్ ను చేతిలోకి తీసుకుని, ఇండెక్స్ ఫింగర్ తో ముఖం మొత్తం అప్లై చేయాలి.

మీ స్కిన్ టోన్ కు సరిపడే ఫౌండేషన్ అప్లై చేయాలి:

మీ స్కిన్ టోన్ కు సరిపడే ఫౌండేషన్ అప్లై చేయాలి:

మేకప్ వేసుకునే వారు మీ చర్మ తత్వానికి తగిన ఫౌండేషన్ అప్లై చేయాలి. మీది ఆయిల్ స్కిన్ అయితే లిక్విడ్ ఫౌండేషన్ బెస్ట్ చాయిస్. అలాగే పౌడర్ ఫౌండేషన్, మరియు కాంపాక్ట్స్ పౌడర్ ను అప్లై చేసుకోవచ్చు. ఫౌండేషన్ స్కిన్ టోన్ అందంగా మార్చుతుంది, స్కిన్ డిస్కలరేషన్ ను కవర్ చేస్తుంది.

ఎలా అప్లై చేయాలి:

ఫౌండేషన్ ను పల్చటి లేయర్ లాగా అప్లై చేయాలి. స్పాజ్ లేదా ఫింగర్స్ తోటి అప్లై చేయవచ్చు. ఎక్స్ ట్రా లేయర్స్ ను వేయకండి, తర్వాత అది ఎక్కువ అయిపోతుంది

నోట్:

నోట్:

మీరు ఫౌండేషన్ కొనే ముందు , కొద్దిగా మీ గడ్డంకు అప్లై చేసి చూసుకుంటే మీ స్కిన్ కలర్ కు మ్యాచ్ అయ్యే విధంగా ఎంపిక చేసుకోవాలి.

చేతుల వెనుకభాగం అప్లై చేయకండి, ముఖం చర్మానికి చేతుల మీద చర్మానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.

కన్సీలర్ ను ఉపయోగించాలి:

కన్సీలర్ ను ఉపయోగించాలి:

మీ చర్మ తత్వానికి సరిపడే కన్సీలర్ ను ఉపయోగించుకోవాలి. డార్క్ సర్కిల్స్ ఉన్నట్లైతే లైటర్ షేడ్ కన్సీలర్ ను ఎంపిక చేసుకోవాలి. ఇది పిగ్మెంటేషన్ , మచ్చలను, రెడ్ నెస్ ను కవర్ చేస్తుంది.

ఎలా అప్లై చేయాలి:

కొద్దిగా కన్సీలర్ తీసుకుని కళ్ళ క్రింద నల్లని వలయాల మీద, మచ్చల మీద అప్లై చేయాలి.

తర్వాత చేతి వేళ్ళతో సరిచేసుకోవాలి.

పౌడర్ అప్లై చేయాలి:

పౌడర్ అప్లై చేయాలి:

ఇది అవసరమైతేనే, ఫౌడేషన్ మరియు కన్సీలర్ రెండూ వేసుకోవాలనుకుంటే, అప్పుడు పౌడర్ ను పల్చటి లేయర్ గా ఫ్లఫీ బ్రష్ తో అప్లై చేయాలి. ఇది మీ ముఖానికి లైటర్ లుక్ ను అందిస్తుంది.

మీ బుగ్గల మీద బ్లష్ చేయాలి:

కలర్స్ ను బుగ్గ మీద బ్లష్ చేయడం వల్ల ముఖంలో బ్రైట్ నెస్ వస్తుంది. అయితే బ్లష్ తో ఓవర్ గా అప్లై చేయకూడదు. కొద్దిగా మీ చీక్ బోన్స్ మీద అప్లై చేసి పైకి క్రిందికి స్ట్రోక్ సాప్ట్ బ్రష్ తో బ్లష్ చేయాలి

ఫెయిర్ స్కిన్ కు లైట్ పింక్, పీచ్ లేదా లైట్ షేడ్స్ ఎంపిక చేసుకోవాలి.

ఆప్రికాట్, మావా లేదా బెర్రీ వంటివి మీడియం స్కిన్ టోన్ కు ఎంపిక చేసుకోవాలి.

ఆలివ్ స్కిన్ టోన్ కు బ్రోజ్, ఆరెంజ్, రోస్

డార్క్ స్కిన్ కు బ్రిక్, ట్యాంగ్రరిన్, ఎండు ద్రాక్ష కలర్ ఎంపిక చేసుకోవాలి.

పౌట్ కలర్ :

పౌట్ కలర్ :

పౌట్ కోసం లైట్ పింక్ లేదా న్యూట్రల్ కరల్డ్ లిప్ స్టిక్, లేదా లిప్ గ్లాస్ ఎంపిక చేసుకోవాలి. బోల్డ్ , బ్రైట్ కలర్స్ ను మానేయండి ముఖ్యంగా పగటి పూట ఈ కలర్స్ మ్యాచ్ కావు. అలాగే క్రీమ్ లిప్ స్టిక్ , లిప్ లైనర్ అప్లై చేయకుండా వేసుకోవచ్చు. లిప్ స్టిక్ అప్లై చేసిన తర్వాత చేతితో బ్లెండ్ చేయాలి. సాఫ్ట్ పింక్ షేడ్స్, న్యాచురల్ లిప్ కలర్ ను ఎంపిక చేసుకోవాలి.

ఐ షాడో అప్లై చేయాలి:

ఐ షాడో అప్లై చేయాలి:

రోజూ డిఫరెంట్ గా కనబడాలంటే, న్యూట్రల్ ఐ షాడో కలర్స్ ను ఎంపిక చేసుకోవాలి. ఇవి డే టైమ్ మేకప్ కు బాగా నప్పుతాయి. గ్రే, బ్లూ టోన్స్, గోల్డ్, మరియు బ్రౌన్ కలర్స్ ఎంపిక చేసుకోవాలి. ఇటువంటి షేడ్స్ ను మీ కళ్ళ కలర్ ను బట్టి అప్లై చేయాలి.

ఎలా అప్లై చేయాలి:

మొదట, చర్మరంగును బట్టి బేస్ షాడో అప్లై చేయాలి. ఐబ్రో హైలెట్ అయ్యోలా ఐఈల్డ్ ను బ్రస్ తో అప్లౌ చేయాలి. లేదంటే మీ చేతి వేళ్ళతో నే ఐ షాడో అప్లై చేయాలి.

ఇప్పుడు మీడియం కలర్ షాడో అప్లై చేసి, ఐ లాష్య్ ను అప్లై చేయాలి. తర్వాత కలర్స్ బ్లెడ్ చేసి, బ్రస్ తో వేసుకోవాలి

ఐలైనర్ అప్లై చేయాలి:

ఐలైనర్ అప్లై చేయాలి:

బ్రౌన్, న్యావీ బ్లూ, చార్కోల్ లైనర్ కంటికి అప్లై చేయాలి. రాత్రుల్లో మీ ఫేవరెట్ బ్లాక్ కలర్ ను వేసుకోవచ్చు.

ఎలా అప్లై చేయాలి:

ఐలాష్ మీదగా ఐలైనర్ ను అప్లై చేయాలి. ఐషాడోను కూడా అప్లై చేయాలి. కళ్ళు స్మూత్ గా కనబడుతాయి.

మీరు పెన్సిల్ లైనర్ లేదా లిక్విడ్ లైనర్ ను ఉపయోగించాలి.

లోయర్ లిడ్ కు ఐలైనర్ అప్లై చేయకూడదు.

మస్కార అప్లై చేయాలి:

మస్కార అప్లై చేయాలి:

పగటి పూట మేకప్ కు బ్లాక్ లేదా బ్రౌన్ కలర్ మస్కారా ఉపయోగపడుతుంది. ఈ మస్కారాను పై రెప్పలకు మాత్రమే అప్లై చేయాలి. మీరు మస్కారా ఉపయోగించనట్లైతే ఐలాష్ ఉపయోగిస్తే న్యాచురల్ లుక్ వస్తుంది.

ఐబ్రోస్ ను దువ్వాలి

ఐబ్రోస్ ను దువ్వాలి

మీ ఐబ్రోస్ కు నచ్చిన ఐషాడో ఎంపిక చేసుకుని, సున్నితమైన బ్రష్ తో అప్లై చేయాలి.

English summary

Look Best With These Amazing Beauty Tips Every Morning

Makeup you wear during daytime is very different as compared to the makeup you wear during the evening. Daytime makeup should be more light and subtler. You will not look good if you opt for a smoky look during the daytime, or apply a heavy makeup..
Story first published:Sunday, January 21, 2018, 8:30 [IST]
Desktop Bottom Promotion