Latest Updates
-
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
KL Rahul's Girlfriend:అతియా శెట్టి అందాల రహస్యాలేంటో తెలుసా...
అతియా శెట్టి అందాల రహస్యాలేంటో చూసెయ్యండి.
క్రికెటర్ కెఎల్ రాహూల్ ప్రియురాలు అతియా శెట్టిని త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు ఇటీవల రూమార్స్ పెరిగిపోయాయి. ఇదివరకే వారిద్దరి మధ్య సీక్రెట్ రిలేషన్ కొనసాగుతున్నట్లు గాసిప్స్ వచ్చాయి.

అయితే వీటన్నింటికీ పుల్ స్టాప్ పెడుతూ తామిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు కెఎల్ రాహూల్ ఓపెన్ అయిపోయారు. దీంతో ఈ జంట చూడముచ్చటగా ఉందని.. చిలక గోరింకల్లా కనిపిస్తున్నారని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే కెఎల్ రాహూల్ ప్రియురాలు అతియా శెట్టి తన అందాన్ని కాపాడుకునేందుకు.. ఎప్పటికప్పుడు నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటుందట. ఈ సందర్భంగా అతియా అందాల రహస్యాలేంటి.. అందరికంటే అందంగా కనిపించేందుకు తాను ఏమి చేస్తుందనే రహస్యాలను ఇప్పుడే చూసెయ్యండి...

ఆకట్టుకునే అందం..
అమ్మాయిలంటేనే అందం.. అందం అంటే అమ్మాయిలు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సందర్భం ఏదైనా.. ఏ సీజన్ అయినా.. అందంగా.. ఆకట్టుకునేలా కనిపించాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది. అందుకే అమ్మాయిలు ఎక్కువగా మేకప్ బాట పడుతుంటారు. ఈ సందర్భంగా అతియా శెట్టి అందాల రహస్యాలేంటో తెలుసుకోండి.. మీ అందాన్ని మరింత పెంచుకోండి..

అందానికి మెరుగులు..
అతియా శెట్టి తన అందాన్ని పెంచుకునేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగా తన ఫేసుకు రెగ్యులర్ గా ఫేస్ మాస్క్ ను వాడుతుందట. అది కూడా తనే స్వయంగా తయారు చేసుకుంటుందట. అదెలాగో మనం కూడా తెలుసుకుందాం.

ఇంట్లోనే ఫేస్ ప్యాక్..
అతియా శెట్టి తన అందానికి మెరుగులు దిద్దుకునేందుకు ఫేస్ ప్యాక్ రెగ్యులర్ గా వాడుతుందట. అది కూడా ఇంట్లోనే చేసుకుంటుదట.
ముందుగా కొబ్బరినీళ్లు - 2 టేబుల్ స్పూన్లు
సగం అరటి పండు
ఒక టేబుల్ స్పూన్ తేనే
2 టేబుల్ స్పూన్లు పెరుగు
పావు కప్పు బొప్పాయ
వీటన్నింటిని ఒక పాత్రలో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ముఖానికి రాసుకోవాలి. ఇది డ్రై అయ్యేటప్పుడు మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.

మేకప్ తీసేందుకు..
తన అందాన్ని కాపాడుకునేందుకు అతియా శెట్టి వారంలో మూడు రోజుల పాటు తన ఫేసుకు కొబ్బరి నూనె రాస్తుందట. అలాగే తన మేకప్ తీసేందుకు బేబీ ఆయిల్ ను వాడుతుందట. కనుబొమ్మలు కాంతివంతంగా కనిపించేందుకు కాస్టర్ ఆయిల్ వాడుతుందట. దీంతో తన ఐబ్రోస్ అందంగా, ఒత్తుగా ఉంటాయని చెబుతోంది ఈ అందాల భామ.

అందాల చిట్కాలు..
ఈ అందాల భామ ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డ్రై స్కిన్ మెరుగుదల కోసం ఓ టిప్ కూడా చెప్పింది. విటమిన్ సి లేదా ఈ క్యాప్సూల్స్ ను కట్ చేసి ఫేసుకు రాసుకుంటే మంచి ఫలితం వస్తుందని చెప్పింది.

హెల్దీ హెయిర్ కోసం..
అతియా తన హెయిర్ హెల్దీగా ఉండేందుకు, తన కురులకు ఆనియన్ ఆయిల్ ను వాడుతుందట. దీని వల్ల తన జుట్టు నల్లగా మెరవడమే కాదు.. ఆరోగ్యవంతంమైన జుట్టు తన సొంతం అవుతుందని నమ్ముతుందట. అలాగే బియ్యం 6, 7 గంటలు నానబెట్టి, ఆ నీటిని ఓ బాటిల్ లో వేసి.. దాన్ని హెయిర్ కు స్ప్రే చేస్తే.. మన జుట్టుకు కావాల్సిన మంచి కండీషనర్ గా పని చేస్తుందని చెబుతోందీ ఈ అందాల భామ.



Click it and Unblock the Notifications