For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Makeup Tips:మీకు అందమైన లుక్ కావాలంటే... మీ స్కిన్ టోన్ కు ఏ లిప్ స్టిక్ సెట్ అవుతుందో చూసెయ్యండి...

మీ స్కిన్ టోన్ ను బట్టి మీరెలాంటి లిప్ స్టిక్ వేసుకోవాలో ఇప్పుడే తెలుసుకోండి.

|

అప్పుడే వేసవి కాలం వచ్చేసింది. అప్పుడే భానుడు భగభగ మండుతూ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. అయితే ఎండాకాలమైనా.. చలికాలమైనా.. వానకాలమైనా.. ప్రస్తుత తరం అమ్మాయిలు ఎక్కడికి వెళ్లినా లిప్ స్టిక్ తప్పనిసరిగా వాడుతున్నారు.

Best Pink Lipstick Shades According To Your Skin Tone in Telugu

దీని వల్ల తమ ఫేస్ కు అందమైన లుక్ వస్తుందని చాలా మంది ఫీలింగ్. అందుకే ప్రతి అమ్మాయి మేకప్ బాక్స్ లో కచ్చితంగా లిప్ స్టిక్ ఉంటుంది. అయితే కొందరు అమ్మాయిలు ఎక్కువగా పింక్ లిప్ స్టిక్ నే ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకంటే చాలా మంది ఆడవారికి పింక్ కలర్ అంటే ఇష్టం. అంతేకాదు.. ఇవి ఆడవారి అందాన్ని మరింత పెంచుతాయి.

Best Pink Lipstick Shades According To Your Skin Tone in Telugu

అయితే కొందరు మహిళలు పింక్ లిప్ స్టిక్ బ్లషర్ మరియు ఐషాడోగా ఉపయోగిస్తున్నారు. ఈ పింక్ కలర్లో అనేక షేడ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే చాలాసార్లు అమ్మాయిలు అందంగా కనిపించాలనే ఆరాటంలో కొన్నిసార్లు మ్యాచింగ్ ఉండని పింక్ షేడ్స్ ను ఉపయోగిస్తుంటారు. మీరు కూడా అలాంటి పొరపాటు చేయకుండా ఉండాలంటే.. మీరు మీ స్కిన్ టోన్ కు పింక్ షేడ్ ను వాడాలి. ఇది మీకు కచ్చితమైన రూపాన్ని ఇస్తుంది. ఈ సందర్భంగా మీ స్కిన్ కలర్ కు తగ్గట్టు లిప్ స్టిక్ ఎంచుకోవాలని బ్యూటిషన్లు చెబుతున్నారు. తెల్లగా ఉండే వారు ఏ రంగు లిప్ స్టిక్.. బ్రౌన్ కలర్లో ఉండే చర్మానికి ఎలాంటి లిప్ స్టిక్ వేసుకోవాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఫెయిర్ స్కిన్ టోన్..

ఫెయిర్ స్కిన్ టోన్..

స్కిన్ కలర్ ఫెయిర్ గా ఉండే అమ్మాయిలు అన్ని రకాల లిప్ స్టిక్ షేడ్లను బాగా ఇష్టపడతారు. కానీ కొన్నిసార్లు పొరపాటున పింక్ కలర్ లిప్ స్టిక్ ను మిస్సవుతుంటారు. దీని వల్ల వారి అందం తగ్గిపోయినట్టు కనిపిస్తుంది. కాబట్టి అలాంటి పొరపాటు జరగకుండా మీకు అందమైన లుక్ కావాలంటే, మీరు పూర్తిగా పింక్ కలర్ లిప్ స్టిన్ ను ఉపయోగించాలి. దీని వల్ల మీ స్కిన్ టోన్ అందంగా కనిపిస్తుంది.

డార్క్ స్కిన్..

డార్క్ స్కిన్..

మీ స్కిన్ డార్క్ కలర్లో ఉంటే, పింక్ లో ఉండే ప్రతి ఒక్క లిప్ స్టిక్ షేడ్స్ మీకు బాగా సూటవుతుంది. మీకు డార్క్ కలర్ స్కిన్ ఉంటే మీరు కాండీ ఫ్లోస్ పింక్ లేదా పింక్ మావ్ పింక్ షేడ్స్ ను వాడొచ్చు.

లైట్ పింక్ వాడొద్దు..

లైట్ పింక్ వాడొద్దు..

మీ స్కిన్ టోన్ డార్క్ గా ఉంటే.. మీ లుక్ బ్యూటిఫుల్ గా కనిపించాలంటే, మీరు డార్క్ పింక్ లిప్ స్టిక్ వాడొచ్చు. అయితే మీరు లైట్ గా ఉండే పింక్ షేడ్స్ ను మాత్రం అస్సలు ఉపయోగించకండి.

బ్యూటీషన్లు ఏం చెబుతున్నారంటే..

బ్యూటీషన్లు ఏం చెబుతున్నారంటే..

మీ స్కిన్ టోన్ కు తగ్గట్టు లిప్ స్టిక్ ఎంచుకోవాలంటే బూట్యీషన్లు ఇలా చెబుతున్నారు. మీ స్కిన్ వైట్ గా ఉంటే, ఆరెంజ్, బ్రౌన్ కలర్లు ఉండే లిప్ స్టిక్స్ ను ఎంచుకోవాలి. ఛామనచాయగా ఉండేవారు లైట్ బ్రౌన్ లిప్ స్టిక్ వేసుకోవాలి. అలాగే లైట్ జెర్రీ రంగు లిప్ స్టిక్ కూడా వేసుకోవచ్చు.

పగటి వేళ..

పగటి వేళ..

పగటి పూట లైట్ గా.. సాయంత్రం వేళలో దట్టంగా లిప్ స్టిక్ ను వేసుకోవాలి. చలి, వేడికి మీ పెదాలు పొడిబారకుండా లిప్ స్టిక్ తో కాపాడుకోవాలంటే.. ముందుగా మీ పెదాలకు కొబ్బరినూనె రాయాలి. అనంతరం 10 నిమిషాల తర్వాత వెచ్చని నీటిలో కాటన్ ను తడిపి, పెదాలను క్లీన్ చేసుకుని లిప్ స్టిక్ రాసుకుంటే.. మీ పెదాలు చాలా సున్నితంగా, ఆకర్షణీయంగా ఉంటాయి.

ఆరు నెలల తర్వాత వాడొద్దు..

ఆరు నెలల తర్వాత వాడొద్దు..

లిప్ స్టిక్ ను ఆరు నెలల తర్వాత అస్సలు ఉపయోగించకండి. అలాగే లిప్ స్టిక్ వేశాక పెదాలతో సరి చేయడం వంటివి చేయకూడదు. ముందుగా లిప్ పెన్సిల్ త అవుట్ లైన్ వేసుకుని ఆ తర్వాతే లిప్ స్టిక్ వేసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు వాస్లిన్ కూడా రాసుకోవచ్చు. లిప్ స్టిక్ వేసేందుకు ముందు వాస్లిన్ రాసుకున్నా పెదాలు చాలా స్మూత్ గా ఉంటాయి.

English summary

Best Pink Lipstick Shades According To Your Skin Tone in Telugu

Makeup Tips: How To Pull Pink Lipstick Shades According To Your Skin Tone. Read On.
Story first published:Saturday, March 6, 2021, 17:51 [IST]
Desktop Bottom Promotion