Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ఛార్మింగ్ లా మెరిసిపోయేందుకు ఈ చిట్కాలు పాటించానంటున్న ‘మంత్ర‘
ఈ మధ్యన ఇలాంటి విషయాలపై సోషల్ మీడియాలో గాసిప్స్ విపరీతంగా పెరిగిపోయాయి.
ఒకప్పుడు తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో ఛార్మి కౌర్ ఒకరు. రోజురోజుకు వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని అందం చార్మీ సొంతం. హీరోయిన్ గా అగ్రనటులందరి సరసన నటించిన చార్మి ప్రస్తుతం నిర్మాతగా మారి విజయవంతమైన సినిమాలను తీస్తోంది. అయితే ఛార్మీ అప్పుడప్పుడు ఎవ్వరికీ కనిపించకుండా మాయమవుతూ ఉంటుంది.

అత్యంత ఆప్తులకు, స్నేహితులకు, కుటుంబసభ్యులకు కూడా చెప్పకుండా చార్మి మాయమైపోతారట. తాను ఏకాంతంగా గడిపేందుకే ఇలా చేస్తుందట. అయితే చాలా మంది సినీ అభిమానులు మాత్రం ఇలాంటి వాటి గురించి ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు. ఈ మధ్యన ఇలాంటి విషయాలపై సోషల్ మీడియాలో గాసిప్స్ విపరీతంగా పెరిగిపోయాయి.

వీటన్నింటి సంగతి పెడితే అందరూ హీరోయిన్లలాగా మరియు అమ్మాయిల మాదిరిగానే ఈమె కూడా తన అందంపై ఎక్కువ శ్రద్ధ చూపుతుందట. ప్రతీ సినిమాలోనూ తన లుక్ కొత్తగా కనిపించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. ముఖ్యంగా ఆమె వయసు పెరుగుతూ ఉన్నప్పటికీ ఇప్పటికీ అందమైన తెలుగింటి ఆడపిల్లలా కనిపిస్తూ ఉంటారు. ఈ అందం తగ్గకుండా ఉండేందుకు ఎలాంటి పనులు చేస్తుందో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చార్మినే చెప్పేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఉదయాన్నే వర్కవుట్స్..
ఏదైనా సినిమా చేసే సమయంలో ‘‘ప్రతి రోజూ ఉదయం 5 గంటలకు నిద్ర లేస్తాను. అలా నా ప్రతిరోజూ ప్రారంభమవుతుంది. నిద్ర లేచిన తర్వాత కొంత సమయం వరకు కొన్ని వర్కవుట్స్ చేస్తాను.

డ్రై ఫ్రూట్స్..
వర్కవుట్స్ అయిపోయిన వెంటనే ఫ్రెషప్ అవుతాను. తర్వాత పండ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను. ప్రతి రెండు గంటలకూ ఒకసారి 80 గ్రాములకు మించకుండా కోడిగుడ్డు, చికెన్, చేప తింటాను.

భోజన సమయంలో..
ఇక మధ్యాహ్నం సమయంలో ఆంధ్రా, తెలంగాణ వారిలాగా రైస్ ను తీసుకోను. ఎక్కువగా భోజన సమయంలో (లంచ్ టైమ్) రోటీ, రెండు స్పూన్ల పప్పు, కూరగాయలను మాత్రమే తింటాను.

పది గంటలలోపు నిద్ర..
రాత్రి మాత్రం ఓ యాపిల్ పండుతో అడ్జస్ట్ అవుతాను. ఆ తర్వాత పది గంటలలోపే అంటే తొమ్మిదిన్నర గంటల సమయంలో నిద్రలోకి జారుకుంటాను‘‘ అని చార్మి తన బ్యూటీకి సంబంధించిన సీక్రెట్స్ ను చెప్పేశారు.

చార్మి బాల్యం..
అయితే చార్మి చూడటానికి తెలుగమ్మాయిలాగా కనిపించినప్పటికీ, తన జన్మస్థలం ముంబై నగరం అంట. 1987, మే 17వ తేదీన సిక్కు కుటుంబంలో జన్మించింది చార్మి కౌర్ తన చిన్నప్పుడు కార్మెలైట్ కాన్వెంట్ హైస్కూల్ చదువుకొంది.

15 ఏళ్లకే నటిగా..
పాఠశాల విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే, అది కూడా కేవలం 15 ఏళ్లకే సినిమా ఛాన్స్ కొట్టేసింది. తెలుగు తెరపై తొలిరోజుల్లో పాలబుగ్గలతో, కాస్త బొద్దుగా దర్శనమిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ‘నీ తోడు కావాలి‘తో తెరంగేట్రం చేసిన ఆ ముంబై భామ తర్వాత తమిళం, మలయాళం, తెలుగులో ఎన్నో సినిమాలలో నటించే అద్భుతమైన అవకాశాలను ఛేజిక్కుంచుకుంది.

అందాల ఆరబోతలో మలుపు..
అయితే చార్మి అందాల ఆరబోతలో ఎప్పుడూ వెనుకడుగు మాత్రం వేసేది కాదు. అయితే ఆమె ఎన్ని సార్లు తన అందాలను తెరపై ఆవిష్కరించినప్పటికీ, 2003లో శ్రీ ఆంజనేయం సినిమాలో ఆమె అందాల ఆరబోత ద్వారా తన కెరీర్ పెద్ద మలుపు తిరిగింది. ఆ తర్వాత తెలుగులో అగ్రస్థాయి నటులందరితోనూ నటించింది.

అవార్డులను కూడా..
ఈ భామ కమర్షియల్ హీరోయిన్ గానే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను కూడా చేసింది. ‘మంగళ‘ సినిమాలో ఈ ముంబై ముద్దుగుమ్మ నటనకు గాను ఉత్తమ నటిగానూ నంది పురస్కారాలను అందుకుంది.



Click it and Unblock the Notifications