Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
దుర్గాపూజ స్పెషల్ : ఈ మేకప్ చిట్కాలతో పండగ వేళలో మరింత అందంగా కనిపించొచ్చు...!
దుర్గా పూజ సమయంలో ఎలాంటి మేకప్ చేసుకోవాలో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.
దుర్గా పూజ సమయంలో చలికాలం ప్రారంభమవుతుంది. ఈ చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పొడిబారడం.. పగుళ్ల వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు చాలా మంది. ఇలాంటి సమయంలో మేకప్ సరిగ్గా వేసుకోవాలంటే కాస్త కష్టమనే చెప్పాలి.

అయితే పండుగలు, శుభకార్యాలు, వివాహాది కార్యక్రమాలలో అమ్మాయిలు అందంగా కనిపించేందుకు అందమైన దుస్తులతో పాటు అద్భుతమైన మేకప్ వేసుకుని.. అందరిలో తామే ప్రత్యేకంగా కనిపించాలని ఆరాటపడటం సహజం. కానీ ఇలాంటి సమయంలోనే వారు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దీంతో వారి మేకప్ మొత్తం రూపాన్నే పాడు చేస్తుంది.

ఇదంతా వారికి మేకప్ గురించి సరైన అవగాహన లేకపోవడం వల్లే జరుగుతుంది. దీని వల్ల వారి ముఖం కూడా చాలా నీరసంగా కనిపిస్తుంది. అందుకే ఇలాంటి సమయంలో అందంగా కనిపించేందుకు ముఖానికి మేకప్ వేసుకునేటప్పుడే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

ముందుగా మీ చర్మం ఎలాంటిదో మీరు తెలుసుకోవాలి. మీ చర్మం జిడ్డుగా ఉందా లేదా పొడిగా ఉందా అనే విషయాలను గమనించాలి. ఈ సందర్భంగా రాబోయే దుర్గాపూజలో మీరు అందమైన లుక్స్ కోసం ఎలాంటి మేకప్ టిప్స్ పాటిస్తే బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...

పొడి చర్మానికి మేకప్ టిప్స్..
శీతాకాలంలో చాలా మంది మహిళల చర్మం పొడిగా మారుతూ ఉంటుంది. ఈ సందర్భంగా మీరు మీ చర్మంపై మేకప్ వేసే ముందు మీ స్కిన్ పై ఉండే తేమగా ఉన్నప్పుడే సోప్ వాడకుండా.. ఫేస్ వాష్ ను వాడండి. ఇదంతా ఫేస్ పై సెట్ అయిన తర్వాత మేకప్ వేయడం ప్రారంభించాలి. అప్పుడే మేకప్ మీ ముఖంపై ఎక్కువసేపు ఉంటుంది.

ఐ మేకప్ కోసం..
ఆ తర్వాత మీ బుగ్గలపై పింక్ లేదా పీచ్ షేడ్ బ్లషర్ ను ఉపయోగించండి. మీ కళ్లను డార్క్ కలర్ ఐ సాడోను ఎంచుకోవాలి. వాటిని పెట్టుకున్న తర్వాతే కాటుక, ఐలైనర్ వంటివి పెట్టుకోవడం వంటివి చేయాలి. అప్పుడే మీ పర్ఫెక్ట్ ఐ మేకప్ పూర్తయిందని గమనించాలి.

పెదాలపై లిప్ బామ్..
కళ్లు, బుగ్గలు, ఐలైనర్ ముగిసిన తర్వాత మీరు మీ పెదాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మీ పెదాలపై ముందుగా మాయిశ్చరైజింగ్ సంబంధిత లిప్ బామ్ రాయాలి. ఆ తర్వాతే మాంచి లిప్ స్టిక్ ను వాడాలి. అయితే వీటిలో కూడా ముందుగా డార్క్ కలర్ వేసి.. అవి ఆరిపోయిన తర్వాత, మీరు కావాల్సిన కలర్ ను సెలెక్ట్ చేసుకుని మీ పెదాలకు రాసుకోవాలి.

మేకప్ దుస్తులు..
నవరాత్రి వేళలో తొమ్మిదిరోజుల పాటు మహిళలు అందమైన దుస్తులను ధరించడాన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా దుర్గాపూజ వంటి సమయంలో ప్రతి ఒక్కరూ మేకప్ వేసుకోవడాన్ని ఇష్టపడతారు. ఈ సందర్భంలో మీరు సాధారణ చర్మంతో మీ ముఖంపై మేకప్ వేయకండి.

మేకప్ తీసేటప్పుడు..
ముఖ్యంగా ఇది చలికాలం కాబట్టి.. మేకప్ వేసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో.. మేకప్ తీసేటప్పుడు కూడా చాలా శ్రద్ధ వహించాలి. మీరు మీ ఫేసుపై మేకప్ తొలగించే సమయంలో కొబ్బరినూనె, బాదం నూనె వంటి వాటిని వాడాలి. వాటిని మీ ముఖంపై రాసిన కాసేపటి తర్వాత కాటన్ టవ్వాల్ తో మీ ఫేసును శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications