For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ చిట్కాలు పాటిస్తే సొగసైన చర్మం మరియు పొడవాటి కురులు మీ సొంతం...

|

అందం వద్దని ఎవరూ కోరుకుంటారు. అందం కోసం అందరూ ఆరాటపడతారు. అందుకే ఈ జనరేషన్ అమ్మాయిలు తాము అందరి కంటే అందంగా కనిపించేందుకు ఎక్కువగా బ్యూటీ పార్లర్లను ఆశ్రయిస్తున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు సబ్బులు మరియు షాంపులు వంటివి తెగ వాడేస్తున్నారు. దీని కోసం బోలెడంత డబ్బును ఖర్చు చేస్తున్నారు. కానీ ఫలితం అంతంత మాత్రమే అని తెగ బాధపడుతున్నారు.

అయితే అప్పటి తరం వారు ఇవన్నీ వాడే వారు కాదు. వారికి బ్యూటీ పార్లర్లకు వెళ్లే అంత తీరిక కూడా ఉండేది కాదు. వారు అందం కోసం ప్రత్యేకంగా ఏ పనులు చేసే వారు కాదు. ఆ తరం వారికి సబ్బులు, షాంపులు వంటి వాటి గురించి అస్సలు తెలియదు. వారికి తెలిసిందల్లా ఒక్కటే.. నలుగు, కుంకుడుకాయలు పెట్టడం. అవే వారి కురులు మరియు చర్మం ఎప్పటికీ అందంగా ఉండేటట్లు చేసేవట. అదే అప్పటి తరానికి ఇప్పటి తరానికి మధ్య ఉన్న తేడా. అవే కాదు వీటితో పాటు పసుపు, గంధం వంటివి కూడా వాడేవారు... చర్మం మరియు జుట్టు సంరక్షణకు ఇంకా ఏమేమీ వాడేవారో తెలుసుకోండి...

మీ నుదుటిమీద ఏర్పడిన ముడుతలను తొలగించుకోవడం ఎలా?

పసుపు...

పసుపు...

పసుపు అనేది యాంటీ బయోటిక్ గా ఎంత అద్భుతంగా పని చేస్తుందో మనందరికీ తెలుసు. ఇది ముఖాన్ని కాంతివంతంగా చేయడంలోనూ.. దీని యాంటి సెప్టిక్ గుణాలు మీ ముఖంపై మొటిమలు రాకుండా చేస్తాయి. అప్పటి తరం వారు తలస్నానం చేసిన ప్రతిసారీ ముఖానికి పసుపు రాసుకునే వారు. అందుకే వారి ముఖంపై మొటిమలు అనేవే కనిపించవు. పైగా వారి చర్మం తెగ మెరిసిపోతూ ఉంటుంది.

కుంకుడు కాయలు..

కుంకుడు కాయలు..

ప్రస్తుతం చాలా మంది తలకు షాంపులు వాడుతున్నారు. కానీ అప్పటితరం వాళ్లు తల మీద కురుల సంరక్షణ కోసం షాంపు బదులు కుంకుడుకాయలను వాడేవారు. ఇంకా కొందరేమో షికాయలను వాడేవారు. దీని వల్ల మీ జుట్టుపై ఎలాంటి రసాయన ప్రభావం ఉండదు. దీనిని తలస్నానం చేసే ముందు కురులకు కొబ్బరినూనె బాగా పట్టించేవారు. వీటిని మీ జుట్టుకు వాడటం వల్ల మీ జుట్టు బలంగా తయారవుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

వెన్న..

వెన్న..

ప్రస్తుతం చాలా మంది చర్మ సంరక్షణకు మాయిశ్చరైజర్ వాడుతున్నారు. అయితే ఒకప్పుడు చర్మ సంరక్షణ కోసం తాజా వెన్నను ఉపయోగించేవారు. దీని వల్ల వారి స్కిన్ చిన్న పిల్లల చర్మం అంత లేతగా మారిపోయేది. అందులోనూ వాటిని ఒక్కసారి రాసుకొంటే.. చర్మం పొడి బారకుండా ఉంటుంది.

పెదాలకు కూడా వెన్న..

పెదాలకు కూడా వెన్న..

ఈ వెన్న మీ పొడిబారిన లేదా పగిలిన పెదాలను తిరిగి మాములుగా మార్చడానికి కూడా ఉపయోగపడుతుంది. దీని వల్ల పెదవులు అందంగా కనిపిస్తాయి.

సున్నితమైన చర్మానికి..

సున్నితమైన చర్మానికి..

ప్రస్తుత తరం వారు చర్మ సంరక్షణ కోసం సబ్బుని వాడుతున్నారు. అయితే అప్పటి తరం వారు సున్నితమైన చర్మం కోసం నలుగుపిండిని ఉపయోగించేవారు. దీనికి పెసరపిండి, శనగపిండి, పసుపు కలిపి ఉపయోగించేవారు. ఇది చర్మ రంధ్రాల్లోని మురికిని వదిలిస్తుంది. ఇది చర్మం ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.

చందనం..

చందనం..

గంధం కూడా చర్మానికి మేలు చేసే వాటిలో ఒకటి. దీన్ని కూడా అప్పటి తరం వారు బాగా ఉపయోగించేవారు. అప్పట్లో గంధపు చెక్కను సానపై అరగదీసి దాన్ని ముఖానికి రాసుకునేవారు. చందనం చర్మంపై ఉంటే చాలు అది ట్యాన్ ను కూడా తొలగిస్తుంది. మీ స్కిన్ పై ముడతలు రాకుండా చేసి ఎప్పటికీ యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అంతేకాదు మొటిమలు రాకుండా చేస్తుంది.

హెన్నా..

హెన్నా..

మన శరీరంలో ఎక్కువ సార్లు ఒత్తిడి పడేది పాదాలపైనే. అందుకే వాటి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు పండుగలు, ఏదైనా ప్రత్యేక కార్యక్రమాల సందర్భంగా గోరింటాకు (హెన్నా) వాడేవారు. చేతులకే కాదు పాదాలకు కూడా దాన్ని పెట్టుకునేవారు.

వేపాకు..

వేపాకు..

ఒకప్పుడు మనం స్నానం చేసే నీళ్లలో వేపాకులు వేసి బాగా వేడి చేసేవారు. ఇందులో చాలా ఔషధ గుణాలు ఉండటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా ఉండేవి. దీని వల్ల కూడా మొటిమలు రాకుండా ఉండేవి. అంతేకాదు చర్మ సంబంధమైన సమస్యలు మన దరికి చేరేవి కాదు. వేప చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది. దీంతో జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తగ్గిపోయేవి.

English summary

grand mother tips for beautiful hair and skin

Here we talking about grand mother tips for beautiful hair and skin. Read on