For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్లో ఖరీదైన క్రీమ్స్ కొనే బదులు ఇంట్లోనే సీసీ క్రీమ్ సిద్ధం చేసుకుంటే సహజ మెరుపు వచ్చేస్తుంది...

ఇంట్లోనే సీసీ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

మనలో చాలా మంది అమ్మాయిలు ఫేస్ కు సీసీ క్రీమ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీటిని ఫేస్ కు అప్లై చేయడం వల్ల ముఖంపై ఎలాంటి మచ్చలు లేకుండా కనిపిస్తాయి.

How to Make CC Cream at Home in Telugu

ఇది మన ముఖంపై ఎలాంటి మచ్చలు మరియు మొటిమలు కనిపించకుండా దాచగలదు. మంచి విషయం ఏంటంటే.. దీన్ని ఫౌండేషన్ కు బదులుగా ఉపయోగించొచ్చు. దీన్ని ఫేస్ కు అప్లై చేయడం వల్ల మీకు కావాల్సిన గ్లో మరియు టెక్చర్స్ వస్తుంది. అయితే ప్రతిసారీ ఖరీదైన సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేయడం అనేది సాధ్యపడదు. ఎందుకంటే అవి చాలా ఖర్చుతో కూడుకున్నవి. అలాంటి సమయంలో మహిళలు తమ ముఖంపై చౌకైన మరియు తక్కువ నాణ్యత ఉండే ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు.

How to Make CC Cream at Home in Telugu

అయితే ఇలా చేయడం వల్ల మీ చర్మానికి లాభానికి బదులు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు మార్కెట్ నుండి కొనే సీసీ క్రీమ్ ఎప్పటికీ కొనాల్సిన పనేలేదు. ఎందుకంటే దీన్ని మీరు ఎంచక్కా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీని నుండి అనేక ప్రయోజనాలను కూడా పొందొచ్చు. ఈ సందర్భంగా సీసీ క్రీమ్ ను ఎలా తయారు చేయాలి.. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

How to Make CC Cream at Home in Telugu
సీసీ క్రీమ్ అంటే ఏమిటి?
సీసీ క్రీమ్ కలర్ కంట్రోల్ మరియు స్కిన్ షాడోను సరి చేస్తుంది. సీసీ క్రీమ్ చర్మం యొక్క రంగు పాలిపోవడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. మీరు దాని సహాయంతో డార్క్ సర్కిల్స్, మొటిమల గుర్తులు మరియు డార్క్ స్పాట్లను దాచొచ్చు.
సీసీ క్రీమ్ అప్లై చేసిన సమయంలో, మీ ముఖంపై ఎలాంటి క్రీమ్స్ అప్లై చేసినట్లు అనిపించదు. ఎందుకంటే ఇది చాలా తేలికగా ఉంటుంది. ఇది సూర్యరశ్మి నుండి కూడా కాపాడుతుంది.

చర్మానికి ఉత్తమమైన క్రీమ్ ఏది?..
మీకు పొడి చర్మం ఉన్నట్లయితే, మీరు BB క్రీమ్ వాడాలి. బీబీ క్రీమ్ లో హైడ్రేటింగ్ లక్షణాలు కనిపిస్తాయి. అదే ఎవరికైతే మొటిమలు మరియు జిడ్డు గల చర్మం ఉంటుందో అలాంటి మహిళలు సీసీ క్రీమ్ ను అప్లై చేయాలి.

సీసీ క్రీమ్ తో లాభాలు..
* సీసీ క్రీమ్ లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి బాహ్య మూలకాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.
* గ్రీన్ టీ, సోయా మరియు షియా బటర్ సీసీ క్రీమ్ లో ఉంటాయి. ఇది మన స్కిన్ ను స్మూత్ గా మారుస్తుంది.
* సీసీ క్రీమ్ లో యాంటీ ఏజింగ్ లక్షణాలు కనిపిస్తాయి. ఈ కారణంగా ముఖం చాలా మంచిగా కనిపిస్తుంది.
* మీరు సీసీ క్రీమ్ ను అప్లై చేయడం ద్వారా సన్ డ్యామేజ్ ను నివారించొచ్చు. ఎందుకంటే ఇది ఎస్పిఎఫ్ లక్షణాలను కలిగి ఉంటుంది.

ఇంట్లో ఎలా తయారు చేయాలి?
మీరు కొన్ని వస్తువుల సహాయంతో ఇంట్లోనే సీసీ క్రీమ్ ను సులభంగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు..
ఒక టీ స్పూన్ మాయిశ్చరైజర్
ఒక టీ స్పూన్ అలోవేరా జెల్
పునాది
సన్ స్క్రీన్
కాంపాక్ట్ పౌడర్
లేత గులాబీ బ్లష్ పొడి

ఒక పాత్రలో ఒక టీ స్పూన్ మాయిశ్చరైజర్, ఒక టీ స్పూన్ అలోవేరా జెల్ కొద్దిగా సన్ స్క్రీన్, కాంపాక్ట్ పౌడర్ మరియు లైట్ పింక్ బ్లష్ పౌడర్ కలపాలి.
దీన్ని బాగా కలిపి ఒక మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి.
మీ ఇంట్లో తయారు చేసిన సీసీ క్రీమ్ ను సిద్ధం చేసుకోండి.
ఒక కంటైనర్లో క్రీమ్ ను నిల్వ చేయండి
మీరు ప్రతిరోజూ ఈ క్రీమ్ వాడొచ్చు.

గమనిక : ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను అప్లై చేసే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయండి.

English summary

How to Make CC Cream at Home in Telugu

Try making CC Cream at home. Here’s how you can go about it.
Story first published:Tuesday, June 7, 2022, 10:24 [IST]
Desktop Bottom Promotion