For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో కాంతివంతమైన ముఖం మీ సొంతం కావాలంటే.. బంతిపూలను ఇలా వాడండి...

ముద్ద బంతి లాంటి అందం కోసం ఫేస్ మాస్క్ ను ఇలా ట్రై చేయండి.

|

వర్షాకాలంలో వాతావరణం చల్లగా, సరదాగా, రొమాంటిక్ గా ఉంటుంది. అయితే వర్షాకాలంలో అందంతో పాటు కాస్త చిరాకుగా ఉంటుంది.

How to Make Marigold Face Mask For Glowing Skin?

ఈ సమయంలో ఎక్కడికైనా వెళ్లాలంటే గొడుగు, రెయిన్ కోట్ తో పాటు మాస్క్ తప్పనిసరి. ఈ సమయంలో మనం వేసుకున్న మంచి డ్రస్ తో పాటు.. మేకప్ మొత్తం పాడవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అందాన్ని మరింత పెంచుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.

How to Make Marigold Face Mask For Glowing Skin?

దీన్ని వాడటం వల్ల ఫ్రెష్ గా, అందంగా, కనిపిస్తారు. ఇంతకీ అదేంటంటే ముద్దబంతి. దీన్ని వాడటం వల్ల అందమే కాదు.. ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఎందుకంటే దీంట్లో సహజ సిద్ధంగా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ సుగుణాలు మీ చర్మానికి చక్కని క్లెన్సింగ్ లాగా పని చేస్తాయి. ఈ సందర్భంగా బంతిపువ్వుతో మీ అందాన్ని ఎలా పెంచుకోవచ్చు.. ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ ఆహారాన్ని ఒక నెల పాటు తింటే, జుట్టు బాగా వేగంగా పెరుగుతుంది...ఈ ఆహారాన్ని ఒక నెల పాటు తింటే, జుట్టు బాగా వేగంగా పెరుగుతుంది...

బంతి పూలు..

బంతి పూలు..

మన దేశంలో ఏదైనా పండుగ, పెళ్లితో పాటు ఏ శుభకార్యమైనా తప్పనిసరిగా ఉండేది పువ్వులు. పసుపురంగులో ఉండే బంతిపూలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. దీంట్లో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది వాడటం వల్ల మీ ముఖంపై తేమ, నూనె వంటివి కనిపించకుండా ఫ్రెష్ గా కనిపించే అవకాశం ఉంటుంది.

వెడ్డింగ్ ఫ్లవర్..

వెడ్డింగ్ ఫ్లవర్..

ముద్ద బంతి పూలను పెళ్లిళ్లలో ఎక్కువగా వాడతారు. అందుకే దీన్ని వెడ్డింగ్ ఫ్లవర్ అని కూడా పిలుస్తుంటారు. మెహందీ ఫంక్షన్ లో వధువుకు ముద్దబంతి అలంకారం.. మరింత వన్నె తెస్తుంది. ఇది అందం కోసమే కాదు.. ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఇందులోని సహజంగా యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ సుగుణాలు మీ చర్మానికి మంచి క్లెన్సింగ్ లాగా పని చేస్తాయి.

దీన్ని ఎలా వాడాలంటే..

దీన్ని ఎలా వాడాలంటే..

బంతి పూలను నీటిలో మరగించి, ఆ నీటిని చల్లార్చి, వడకట్టి వాటితో మీ ఫేసును శుభ్రంగా కడుక్కోవాలి. ఇది మీ ఫేసుకు సహజ సిద్ధంగా టోనర్ లాగా బాగా పని చేస్తుంది. దీన్ని వాడిన తర్వాత ఫేస్ క్రీం కూడా రాసుకోవాల్సిన అవసరం లేదు.

మరకలు తొలగించుకోవచ్చు..

మరకలు తొలగించుకోవచ్చు..

బంతి పూలతో ఫేస్ మాస్క్ చేసుకోవడం వల్ల మొహం మీది మచ్చలు, మరకలు సులభంగా తొలగించుకోవచ్చు. దీంతో మీ చర్మం వాతావరణానికి తగినట్లుగా మీ చర్మం కూడా అందంగా కనిపించే వీలుంటుంది. ఇలా మేకప్ చేసుకుంటే మీ చర్మంపై నూనె లేకుండా చూసుకోవచ్చు. దీన్ని పగలు, రాత్రి ఏ సమయానికైనా ఉత్తమమైన పద్ధతి అని చెప్పుకోవచ్చు.

తెల్ల జుట్టు చాలా త్వరగా రాకుండా ఉండటానికి .. మీరు దీన్ని అనుసరించవచ్చు..!తెల్ల జుట్టు చాలా త్వరగా రాకుండా ఉండటానికి .. మీరు దీన్ని అనుసరించవచ్చు..!

ఎలా తయారు చేసుకోవాలంటే..

ఎలా తయారు చేసుకోవాలంటే..

ముందుగా కొన్ని బంతిపూలను తీసుకోవాలి. వాటిని మిక్సీలో వేసి లేదా రోట్లో వేసి మెత్తటి పేస్టులా తయారు చేయాలి. దీనికి ఓ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలి. దీని వల్ల పేస్ట్ తొందరగా పాడవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ గ్లాస్ జార్ లో తీసుకుని జాగ్రత్తగా నిల్వ ఉంచుకుంటే నాలుగైదు రోజుల వరకు వాడుకోవచ్చు.

నెలరోజుల పాటు..

నెలరోజుల పాటు..

ఈ మిశ్రమాన్ని మీ ఫేస్ పై అప్లై చేసి ఆరిపోయాక దాన్ని చల్లని నీటితో కడిగేయాలి. ఇలా మీరు ఒక్క నెలరోజుల పాటు రెగ్యులర్ గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కాంతివంతమైన చర్మం..

కాంతివంతమైన చర్మం..

ఒక కప్పు మంచినీటిలో కొన్ని బంతిపూల రెక్కలు వేసి.. ఓ ఐదు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత ఈ నీటిని చల్లార్చి, వడకట్టి తాగితే.. కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది..

English summary

How to Make Marigold Face Mask For Glowing Skin?

Here we are talking about the how to make marigold face mask for glowing skin. Read on
Story first published:Friday, July 16, 2021, 15:13 [IST]
Desktop Bottom Promotion