Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
KGF 2 Srinidhi Shetty:శ్రీ‘నిధి’లాంటి అందం మీ సొంతం అవ్వాలంటే... ఇవి ఫాలో అవ్వండి...
కేజీఎఫ్ చాప్టర్-2 హీరోయిన్ శ్రీనిధి శెట్టి స్కిన్ కేర్ రోటిన్ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో చాలా మందికి కేజిఎఫ్ సినిమా గురించే తెలిసే ఉంటుంది. మరికొద్ది రోజుల్లో కేజిఎఫ్ చాప్టర్-2 కూడా రాబోతోంది. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉండగా.. ఈ సినిమాతోనే హీరోయిన్ శ్రీనిధి శెట్టి వెండితెరపై అడుగు పెట్టింది. తన తొలి సినిమాలోనే తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు కేజిఎఫ్ చాప్టర్-2లోనూ తన అందచందాలతో మరోసారి కుర్రకారును అలరించేందుకు సిద్ధమైంది.

తెరపై కోశల దేశపు రాజకుమారిలా కనిపించే ఈ అందాల భామ మిస్ దివా-2016 పోటీలో పాల్గొని మిస్ దివా సుప్రా నేషనల్-2016 కిరీటాన్ని సైతం సొంతం చేసుకుంది. దీంతో తన దేశవ్యాప్తంగా తన పేరు మారుమ్రోగి పోయింది.

అనంతరం మిస్ సుప్రనేషనల్ 2016 సంవత్సరానికి ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించింది. ఈ నేపథ్యంలోనే తను ఇంత అందంగా ఉండేందుకు గల సీక్రెట్స్ ఏంటో ఓ ఇంటర్వ్యూలో చెప్పేసింది. ఈ సందర్భంగా శ్రీనిధి తన చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచుకునేందుకు ఎలాంటి చిట్కాలు పాటిస్తుంది.. తను ఏయే క్రీమ్స్ వాడుతుంది.. ఎలాంటి సహజ పదార్థాలను వాడుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

శ్రీ నిధి సీక్రెట్స్..
మీ చర్మం అందంగా, యవ్వనంగా, మెరిసిపోతూ కనిపించాలంటే శ్రీ నిధి సీక్రెట్స్ ఏంటో తెలుసుకోవాల్సింది. ఇలా చేయడం వల్ల మన చర్మనాకి కావాల్సిన పోషణను అందించి మెరిసిపోయేలా చేస్తుంది.

ఎల్లప్పుడూ తేమగా..
శ్రీనిధి తన చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందట. ఇందుకోసం సహజంగా లభించే గులాబీ రేకులు, కలబందతో కలిపిన మిశ్రమాలను రెగ్యులర్ గా వాడుతుందట.

నిత్య యవ్వనం..
శ్రీనిధి శెట్టి తన చర్మాన్ని నిత్యం యవ్వనంగా కనిపించేందుకు, ఉత్తేజంగా మార్చుకునేందుకు మాయిశ్చరైజింగ్ టోనర్ ఎక్కువగా వాడుతుందట. అందుకే తన అందం ఎప్పుడూ మెరిసిపోతూ ఉంటుందని చెబుతోంది ఈ అందాల భామ. మీరు కూడా తనలా మెరిసిపోవాలంటే ఇది ఓసారి ట్రై చేయండి.

ఇవి తప్పనిసరి..
కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి వేసవికాలంలోనూ తన చర్మానికి నష్టం కలగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటుందట. అందుకే తను రెగ్యులర్ గా విటమిన్ సి సీరమ్ ను ఎక్కువగా తీసుకుంటుంది. ఇలా చేయడం వల్ల తన చర్మం పాడవకుండా.. మిలమిలా మెరిసిపోతుందని చెబుతోంది.

లోషన్లు ఎక్కువగా..
కేజీఎఫ్ అందాల భామ చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచుకునేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుందట. ఇందుకోసం తను రిచ్ మాయిశ్చరైజింగ్ లోషన్లను ఎక్కువగా ఉపయోగిస్తుందట.

సన్ స్క్రీన్..
ఎండాకాలంలో ప్రతి ఒక్కరి చర్మం త్వరగా పొడిబారిపోతూ ఉంటుంది. అందుకే ఈ అందాల భామ తన చర్మం పాడవ్వకుండా, సమ్మర్లో బయటికి వెళ్లడానికి ముందు కచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ ను వాడుతుందట. ఇది తన వద్ద కచ్చితంగా ఉంటుందని చెబుతోంది. దీని వల్ల మన స్కిన్ ను సూర్యరశ్మి నుండి రక్షణ లభిస్తుందని చెబుతోంది ఈ అందాల భామ.

రాత్రి వేళ..
ఇక చివరగా.. రాత్రి వేళలో నిద్రపోవడానికి ముందు శ్రీనిధి కచ్చితంగా తన మేకప్ తీసేస్తుందట. అయితే ఎక్స్ ప్లాయిటింగ్ టోనర్ ను వాడటం వల్ల తన చర్మం త్వరగా ప్యూరిఫై అవుతుందని చెబుతోంది. చూశారు కదా.. శ్రీనిధి అందాల రహస్యాలేంటో.. మీరు కూడా మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవాలంటే శ్రీనిధి బ్యూటీ సీక్రెట్స్, టిప్స్ ను ఫాలో అవ్వండి. ముఖ్యంగా సమ్మర్లో మీ స్కిన్ ను కాపాడుకోండి.. నలుగురిలో మీరు ప్రత్యేకంగా, మరింత అందంగా కనిపించండి..



Click it and Unblock the Notifications