For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ అందం పెంచుకోవడానికి పౌడర్ బ్లష్, క్రీమ్ బ్లష్ లో ఏది సూటవుతుందో చూసెయ్యండి...

పౌడర్ బ్లష్, క్రీమ్ బ్లష్ మధ్య గల తేడా ఏంటి? ఈ రెండింటిలో మీకేదీ సూటవుతుందనే వివరాలను ఇప్పుడే తెలుసుకోండి...

|

మహిళలు సాధారణంగా మేకప్ చేసుకునేటప్పుడు ఐ మేకప్, ఎర్రని పెదాల అలంకరణపై ఎక్కువ ఫోకస్ పెడతారు. అయితే మీరు బ్లష్ వాడకపోతే, మీ మేకప్ అనేది ఎప్పటికీ పూర్తి కాదు. అందుకే మేకప్ చేసే సమయంలో బ్లష్ అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే మీరు సరైన షేడ్ మరియు పర్ఫెక్ట్ బ్లష్ అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం.

Know the Difference Between Powder Blush and Cream Blush in Telugu

మరోవైపు మార్కెట్లో ప్రస్తుతం అనేక రకాల బ్లష్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో క్రీమ్ మరియు పౌడర్ బ్లష్ లు అత్యంత ప్రజాదరణ పొందినవిగా పరిగణించబడుతున్నాయి. అయినా కూడా చాలా మందికి వీటి మధ్య ఉండే తేడా గురించి ఎక్కువగా తెలియదు. దీంతో వారి మేకప్ లుక్ అనేది త్వరగా చెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో పౌడర్ బ్లష్ మరియు క్రీమ్ బ్లష్ మధ్య ఉన్న తేడాలేంటి? మీ చర్మానికి దేన్ని వాడితే ప్రయోజనకరంగా ఉంటుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పౌడర్ బ్లష్ తో ప్రయోజనాలు..

పౌడర్ బ్లష్ తో ప్రయోజనాలు..

మీరు పౌడర్ బ్లష్ చేసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందొచ్చు. దీని వల్ల మీ ముఖ సౌందర్యం మెరిసిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు మీ ఫేస్ పూర్తిగా మార్చుకునేందుకు, మీరు మేకప్ లో మెరిసిపోయేందుకు, మీ గ్లామర్ ను పెంచుకునేందుకు పౌడర్ బ్లష్ ఎంతగానో సహకరిస్తుంది. అంతేకాదండోయ్ పౌడర్ బ్లష్ ను కాంటౌర్ గా కూడా వాడొచ్చు. ఇలా చేయడం వల్ల రోజంతా మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు.

పౌడర్ బ్లష్ తో ప్రతికూలతలు..

పౌడర్ బ్లష్ తో ప్రతికూలతలు..

పౌడర్ బ్లష్ వాడేటప్పుడు, దాన్ని మీ ఫేస్ కు అప్లై చేయడం అనేది చాలా ముఖ్యం. మీరు సరిగ్గా బ్లష్ చేసుకోకపోతే చాలా వికారంగా కూడా కనిపించొచ్చు. మరోవైపు మీరు పరిపక్వ చర్మం కలిగి ఉంటే, పౌడర్ బ్లష్ ను అప్లై చేయడం వల్ల మీ ఫేస్ పై లైన్స్, ముడతలు ఎక్కువగా కనిపించొచ్చు. దీంతో మీ అసలైన మేకప్ రూపాన్ని కూడా నాశనం చేయొచ్చు.

క్రీమ్ బ్లష్ తో లాభాలు..

క్రీమ్ బ్లష్ తో లాభాలు..

మీరు బ్లష్ లో సహజమైన మరియు మెరిసే చర్మాన్ని పొందాలంటే, క్రీమ్ బ్లష్ ను అప్లై చేయడం అనేది మంచి ఆలోచన. దీని డిజైన్ చాలా తేలికైనది. కాబట్టి క్రీమ్ బ్లష్ ను ఫేస్ కు అప్లై చేయడం చాలా తేలికైన పని. దీంతో మీరు సహజమైన రూపాన్ని పొందొచ్చు. క్రీమ్ బ్లష్ ఫేస్ కు అప్లై చేయడం ఎప్పటికీ భారంగా అనిపించదు.

క్రీమ్ బ్లష్ ప్రతికూలతలు..

క్రీమ్ బ్లష్ ప్రతికూలతలు..

మీరు క్రీమ్ బ్లష్ అప్లై చేస్తే, మీకు డార్క్ కలర్ అనేది రాకపోవచ్చు. దీని వల్ల మీ ఫేస్ లో కొంచెం గ్లో వస్తుంది. అంతేకాదు మీరు ఏదైనా వేడి వాతావరణం ఉండే ప్రదేశంలో నివసిస్తుంటే, ఎక్కువగా చెమట పట్టే చోట, వీటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వేడి మరియు చెమట కారణంగా ఈ క్రీమ్ బ్లష్ వేగంగా కరిగిపోతుంది. దీంతో మీ రూపం అంతా పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఎవరు వాడాలంటే..

ఎవరు వాడాలంటే..

మీరు పౌడర్ బ్లష్ లేదా క్రీమ్ బ్లష్ రెండింటిలో ఏది వాడాలనే దానే ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

* మీకు జిడ్డు గల చర్మం ఉంటే, పౌడర్ బ్లష్ అనేది ఉత్తమ ఎంపికగా పని చేస్తుంది. ఎందుకంటే ఇది మీ స్కిన్ పై ఉండే ఎక్స్ ట్రా ఆయిల్ ను గ్రహిస్తుంది. మీ చర్మానికి తాజా రూపాన్ని ఇస్తుంది.

* మీకు పొడి చర్మం ఉన్నట్లయితే, పౌడర్ బ్లష్ ని వాడటం వల్ల మీ చర్మం మరింత పొడిగా కనిపిస్తుంది.

* మీకు జిడ్డు చర్మం లేకుండా ఉంటే, మీరు పౌడర్ బ్లష్ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ ఫేస్ పై గీతలు, ముడతలు కనిపించేలా చేస్తుంది. ముఖ్యంగా షిమ్మర్ పౌడర్ మీ రూపాన్ని ఎక్కువగా నాశనం చేస్తుంది.

English summary

Know the Difference Between Powder Blush and Cream Blush in Telugu

Here we are talking about the difference between powder blush and cream blush. Know which one is suitable for you
Story first published:Tuesday, June 28, 2022, 15:01 [IST]
Desktop Bottom Promotion