For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న్యూ ఇయర్ టైమ్ లో ఇలాంటి బ్యూటీ రిజల్యూషన్స్ తీసుకోండి...!

కొత్త సంవత్సరం సందర్భంగా హెయిర్ రిజల్యూషన్స్ ఏంటో చూసేద్దాం రండి..

|

మరి కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలోకి మనం అడుగుపెట్టబోతున్నాం. అ సందర్భంగా చాలా మంది కొత్త కొత్త రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా 2021లో ఏవైనా కొత్త ఏడాది తీర్మానాలు చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? మరీ ముఖ్యంగా మీ జీవితంలో ఏమైనా కొత్త మార్పులు చేయాలనుకుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. ఎందుకంటే ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వాటిని పాటించకుండా మరిచిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Beauty Resolutions New Year 2021

నేనైతే ప్రతి ఏటా చాలాసార్లు అలాగే చేసేవాన్ని. ముఖ్యంగా గత ఏడాది నేను ప్రతిరోజూ జిమ్ కు వెళ్లి కండలు బాగా పెంచాలని అనుకున్నా.. పూర్తి ఫిట్ నెస్ గా మారాలని.. ప్రతిరోజూ వ్యాయామం చేయాలని రిజల్యూషన్ తీసుకున్నా...అందులో పెద్దగా ఇబ్బందులేమీ ఉండవని అనుకున్నా. అయితే స్టార్టింగులో బాగానే పాటించాను. కానీ రాను రాను ఈ రిజల్యూషన్స్ చాలా కష్టంగా అనిపించింది.

Beauty Resolutions New Year 2021

మీరు కూడా నాలాగా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే.. మీరు కష్టమైన వాటిని రిజల్యూషన్స్ గా తీసుకోకుండా.. వాటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక అసలు విషయానికొస్తే.. ఈ కాలంలో అందంగా కనిపించాలని అందరూ ఆరాటపడుతూ ఉంటారు. అందుకే బ్యూటీ రిజల్యూషన్స్ విషయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి.

Beauty Resolutions New Year 2021

ముఖ్యంగా మన స్కిన్ గ్లో పెరగాలన్నా.. సంవత్సరమంతా మనం అందరికంటే అందంగా కనిపించాలన్నా.. మనం తీసుకునే డెసిషన్లే కీ రోల్ ప్లే చేస్తాయి. ఈ సందర్భంగా కొత్త సంవత్సరంలో మీరు ఈ బ్యూటీ రిజల్యూషన్స్ ను ప్రయత్నించండి... నలుగురిలో ప్రత్యేకంగా కనబడండి...

ముందుకే పోవాలి..

ముందుకే పోవాలి..

‘నేను స్టార్ట్ చేశాను.. కాబట్టి కంటిన్యూ చేస్తాను' అనే భావనతో ముందుకు పోవాలి. ఉదాహరణకు ప్రతిరోజూ 3 నుండి 4 నాలుగు లీటర్ల నీళ్లు తాగాలని తీర్మానం చేసుకుంటే, ఆ అలవాటును నిరంతరం కొనసాగించండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ నీరు తాగితే.. మీ స్కిన్ కు అంత మంచిది. దీని వల్ల మీకు ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే మీ వెయిట్ బట్టి మీరు ఎక్కువ నీరు తాగేందుకు ప్రయత్నించాలి. ఈ అలవాటును మీ అలవాటుగా మార్చుకోవాలి. కనీసం రోజుకు 8 నుండి 10 గ్లాసులైనా తాగాలి.

స్కిన్ కేర్

స్కిన్ కేర్

మీరు మీ స్కిన్ గురించి ఎక్కువ కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగుతో పాటు తరచూ స్క్రబ్ చేసుకోవడం వంటి వాటిని అలవాటు చేసుకోవాలి.

బయటకు వెళ్లేటప్పుడు..

బయటకు వెళ్లేటప్పుడు..

మీరు ప్రతిరోజూ బయటకు వెళ్లే సమయంలో సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రాసుకోవాలి. దీని వల్ల మీరు ట్యాన్ బారిన పడకుండా ఉండటం మాత్రమే కాదు.. UV కిరణాల బారి నుండి మీరు రక్షణ పొందొచ్చు.

బ్యూటీ ప్రాడక్ట్స్..

బ్యూటీ ప్రాడక్ట్స్..

కొన్ని పాత బ్యూటీ ఉత్పత్తులు పూర్తి కాకముందే.. మార్కెట్లో వచ్చే కొత్త బ్రాండ్లను వాడటానికి ప్రయత్నించాలి. ఇలాంటి వాటిని అలవాటుగా చేసుకుంటే.. మీ ఖర్చులు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది.

మీ స్కిన్ ను బట్టి..

మీ స్కిన్ ను బట్టి..

మీ స్కిన్ ఎలాంటిదో మీరు తెలుసుకోవాలి. పొడి చర్మం.. ఆయిల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్.. ఇలా ప్రతి స్కిన్ కు ఓ తత్వం అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి మీరు మీ చర్మ సంరక్షణకు సంబంధించిన రిజల్యూషన్లు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే మీ స్కిన్ ఎలాంటిదో మీరు తెలుసుకోవాలి.

చర్మంలో తేమ..

చర్మంలో తేమ..

మీ స్కిన్ లో తేమ పెరిగి ఆరోగ్యంగా ఉండాలంటే.. మీరు ప్రతిరోజూ రాత్రి పూట నిద్రకు ముందు మీ స్కిన్ కు మాయిశ్చరైజర్ రాసుకోవడాన్ని అలవాటుగా చేసుకోవాలి. మీ పెదాలు, ఇతరభాగాల్లో చర్మం ఎండిపోయి పొరలుగా కనిపిస్తే, దాన్ని తీసేయాలి.

డేట్ అయిపోతే..

డేట్ అయిపోతే..

మీరు వాడే బ్యూటీ ప్రాడక్టులను ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. ముఖ్యంగా ఏవైనా ఎక్స్ పైరీ అయ్యుంటాయో.. వాటిని వెంటనే పడేయాలి. అలాగే మీ బ్యూటీ ప్రాడక్టులను తరచుగా మార్చడం మంచిది కాదు. ఇలా మారిస్తే, మీ స్కిన్ పాడయ్యే ప్రమాదం ఉంటుంది.

బ్యూటీ స్లీప్..

బ్యూటీ స్లీప్..

మీ స్కిన్ గ్లో పెరగాలంటే.. మీరు బ్యూటీ స్లీప్ తప్పనిసరిగా అని గుర్తుంచుకోవాలి. అందుకే కడుపు నిండా ఆహారం తీసుకుని.. కంటి నిండా నిద్ర పోవాలి.

మీ హెయిర్..

మీ హెయిర్..

మీ జుట్టును బట్టి.. వాటికి ఉండే తత్వాన్ని బట్టి... మీ హెయిర్ కు ఏ ఆయిల్ సరిపోతుందో వాటిని రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ ఆయిల్ హెయిర్ అయితే.. గోరువెచ్చని నూనె పట్టించిన అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

క్లీనింగ్ విషయంలో..

క్లీనింగ్ విషయంలో..

మీ మేకప్ బ్రష్ లను రెగ్యులర్ గా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయకపోతే, దానిలో బ్యాక్టీరియా చేరి.. అది మీ స్కిన్ కు మరింత హాని కలిగించే ప్రమాదం ఉంటుంది. అలాగే కెమికల్ ఫ్రీ, సహజమైన ఉత్పత్తులను ఉపయోగించండి. దీని వల్ల మీ స్కిన్ హెల్త్ ఆరోగ్యంగా మారుతుంది.

వీటిని తీసుకోవాలి..

వీటిని తీసుకోవాలి..

మీరు ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు.. మీ బ్యూటీ రోటిన్లలో కూడా ‘విటమిన్ ఇ, విటమిన్ బి'లను భాగంగా చేసుకోవాలి. అలాగే విటమిన్ క్యాప్సుల్స్ ను కూడా వాడితే బెటర్.

అద్దంలో చూసుకుంటూ..

అద్దంలో చూసుకుంటూ..

కొత్త సంవత్సరంలో ఓ సినిమాలో రవితేజ అన్నమాటలను అద్దం ముందు నిలబడి రెగ్యులర్ గుర్తు చేసుకోండి. ‘ఏమి ఫేసు రా నీది.. ఎంత అందంగా ఉన్నావు' అనే మాటలను ప్రతిరోజూ చెప్పుకోండి. మీ డ్రస్, మీ లుక్ మాత్రమే కాదు.. మేకప్ లేకపోయినా అద్దంలో కనిపించే వ్యక్తిని పొగడటం వల్ల మిమ్మల్ని మీరు ఇష్టపడతారు.

English summary

New Year Beauty Resolutions for 2021 in Telugu

Check out the Beauty Resolutions new year 2021. Read on.
Desktop Bottom Promotion