Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
నీలి రంగు చీరలో మెరిసిన నిహారిక... ఈ చీరకు ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా...
నిహారిక కట్టిన ఈ చీర యొక్క ప్రత్యేకతలేంటో తెలుసా...
ఇప్పటితరం అమ్మాయిలు ఎక్కువగా పట్టుచీరలు(Silk Sarees) కట్టుకోవడానికి అంతగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ సెలబ్రెటీలు ఎప్పుడైతే సిల్క్ శారీస్ కట్టడం మొదలెట్టారో.. వారి అభిమానులు కూడా ఇలాంటి డ్రస్సింగ్ స్టైల్ పై మోజు పెంచుకుంటున్నారు. అంతేకాదు పట్టు చీరలను చాలా ఇష్టంగా ధరిస్తూ రకరకాల వార్డ్ రోబ్ లో చేరుస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కొణిదెల నాగబాబు కూతురు.. పెళ్లి కుమార్తెగా మారడమే కాదు.. తను ధరించిన చీర గురించి సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది. తాను కట్టుకున్న పట్టుచీర గురించి కొన్ని రహస్యాలను కూడా చెప్పింది. ఇలాంటి చీరలు పెళ్లికూతురికి మరింత శోభను ఇస్తాయని నిరూపించింది. అంతేకాదండోయ్ అమ్మ చీరలతో అందరికీ మధురమైన జ్ణాపకాలు ముడిపడి ఉంటాయి.

అమ్మ చీర కొంగు పట్టుకుని తిరిగిన రోజులు, అమ్మ భద్రంగా ట్రంకు పెట్టేల్లో లేదా బీరువాల్లో దాచుకున్న పెళ్లి చీర తీసి చూపిస్తుంటే ప్రతి కూతురు చాలా భావోద్వేగంగా ఫీలవుతుంది. ఆ భావోద్వేగాన్ని మరోసారి గుర్తు చేసుకునేందుకు అమ్మ పెళ్లి సమయంలో ఎలాంటి చీరలను కట్టుకుందో.. తాను కూడా తన పెళ్లి వేడుకలో అమ్మ చీరను కట్టుకుంది నిహారిక. ప్రీ వెడ్డింగుకు ముందు నీలి రంగు చీరలో మెరిసిపోయిన ఫొటోలతో పాటు తన పెళ్లి వేడుకల ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. 'ఈ చీర అమ్మది' అంటూ ఓ క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ సందర్భంగా ఈ చీరకు ఉన్న ప్రత్యేకతలేంటి.. నిహారిక లాగా ఎవరైనా ట్రై చేశారా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

నిహారిక మేకప్..
తాజాగా కొణిదెల నాగబాబు కూతురు నిహారిక తన వివాహం కోసం అందమైన పెళ్లికూతురిలా ముస్తాబైంది. అయితే నిహారిక అలంకరణలో భాగంగా ధరించిన నీలి రంగు చీరకు ఓ ప్రత్యేకత ఉంది.

తన తల్లితో..
ఈ చీర విషయం గురించి కొణిదెల నిహారికనే సోషల్ మీడియా ద్వారా స్వయంగా తెలియజేశారు. 32 ఏళ్ల క్రితం ఎంగేజ్ మెంట్ రోజున తన తల్లి చీరలో ముస్తాబైన ఫొటోను, తన ప్రస్తుత ఫొటోను పక్కన పెట్టి పోల్చుకుంటున్నట్టు షేర్ చేశారు.

సెలబ్రిటీలు చాలా మంది..
కేవలం కొణిదెల నిహారిక మాత్రమే కాదు.. ఇంతకుముందు చాలా మంది ప్రముఖులు తమ వివాహ వేడుకల సమయంలో తల్లి చీరలనే సెలెక్ట్ చేసుకున్నారు. ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ కూడా పెళ్లి సమయంలో నీతూ అంబానీ పెళ్లి చీరనే తన వివాహానికి లెహంగాగా మార్చుకుంది.

మరింత అందంగా..
వివాహ వేడుకకు ముందు కట్టుకునే చీర కూడా ఇప్పుడు కొత్త అందాన్ని సంతరించుకుని మరింత అందంగా ముస్తాబవుతోంది. నీలి రంగు చీర, బంగారు అంచులు కలిగిన చీర కట్టుకుని నిహారిక మరింతగా మురిసిపోతోంది. దీనికి కారణం ఈ చీరకున్న ప్రత్యేకత అలాంటిది మరి. అమ్మ చీరను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. మరికొద్ది గంటల్లో నిహారిక మెడలో మూడు ముళ్లు పడబోతున్నాయి.
All Images Credited to : Instagram



Click it and Unblock the Notifications