Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
RRR హీరోయిన్ ఆలియా భట్ అందాల రహస్యాలేంటో తెలుసా...
RRR సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం దక్కించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ మేకప్ లేకుండా చాలా సినిమాల్లో నటించింది
బాలీవుడ్ అందాల భామల్లో ఆలియా భట్ కు ప్రత్యేక స్థానం ఉంది. సహజమైన చర్మంతో మెరుగ్గా కనిపించే నటీమణులలో ఆలియా భట్ ఒకరు. RRR సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం దక్కించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ మేకప్ లేకుండా చాలా సినిమాల్లో నటించింది. అందుకే ఆమె సహజమైన చర్మానికి అంత ప్రాధాన్యత దక్కింది.

ఎందుకంటే ఆలియా భట్ కు మేకప్ అంటే అంతగా ఇష్టముండదట. మీరు ఆలియా భట్ ని గమనిస్తే చాలా సార్లు ఆమె మేకప్ లేకుండా ప్రయాణం చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఆలియా భట్ అభిమానులు ఆమె మెరుస్తున్న చర్మాన్ని అత్యంత ఇష్టపడతారు. అంతేకాదు ఆమె ఫ్యాషన్ స్టైల్ ను మరియు బ్యూటీ టిప్స్ ఫాలో అయ్యేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఆలియా భట్ తన అందాన్ని కాపాడుకునేందుకు యోగా మరియు జిమ్ వంటివి కూడా చేస్తుందట. మరి కొద్ది రోజుల్లో RRR సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఆలియా భట్ అంద చందాల రహస్యాలేంటో చూడండి.. మీరు కూడా ఆమె బ్యూటీ సీక్రెట్స్ ను ఫాలో అవ్వండి. మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోండి...

మేకప్ లేకుండా రాత్రి పడుకోండి
ఆలియా భట్ తన సహజ సౌందర్యాన్ని పెంచుకునేందుకు రాత్రి వేళలో మేకప్ లేకుండా నిద్ర పోతుందట. కునుకు తీయడానికి ముందు తన మేకప్ ను పూర్తిగా తొలగిస్తుందట. ఈ హీరోయిన్ ఒకవేళ మేకప్ వేసుకున్నా.. చాలా తక్కువగా మేకప్ వేసుకోవడానికి ఆసక్తి చూపుతుందట. తన మేకప్ కెమికల్స్ ప్రాడక్ట్స్ లేకుండా న్యాచురల్ ప్రాడక్ట్స్ కు ప్రాధాన్యత ఇస్తుందట.

నీరు
అలియా భట్ సోషల్ మీడియాలో సైతం బాగా యాక్టివ్ గా ఉంటుంది. తన మెరిసే చర్మం యొక్క ఫోటోలను తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటుంది. అలియా భట్ యొక్క మెరుస్తున్న చర్మం యొక్క రహస్యం ఏమిటంటే ఆమె చాలా నీరు త్రాగుతుంది. అలియా భట్ రోజంతా 8 గ్లాసుల నీరు తాగుతుంది. త్రాగునీరు ముఖాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. దీని వల్ల ఆమె చర్మం మెరుస్తూ ఉంటుంది.

జిమ్
ఆలియా భట్ తన అందంతో పాటు ఫిట్ నెస్ కు మంచి ప్రాధాన్యత ఇస్తుందట. తన సెక్సీ బాడీ షేప్ ని కాపాడుకునేందుకు క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్తుందట. అప్పుడప్పుడు తన జిమ్ కు సంబంధించిన వీడియోలను కూడా ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఈ అమ్మడు అందరికీ సాధ్యం కాని వర్కవుట్స్ ని కూడా చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాదు తన అభిమానులకు ఫిట్‌గా ఉండాలని సలహా కూడా ఇస్తుంది.

ఫేస్ ప్యాక్స్..
అలియా భట్ తన అందాన్ని కాపాడుకునేందుకు సహజ వన మూలికా ఉత్పత్తులను ఉపయోగిస్తుంది. అలియా భట్ హెర్బల్ ఫేస్ ప్యాక్‌లను ఉపయోగిస్తుంది.ఈ అందాల భామ తన ఫేస్ ప్యాక్ ను స్వయంగా తయారు చేసుకుంటుందట. ఆలియా తన ఫేస్ ప్యాక్ ఎలా సిద్ధం చేస్తుందో తెలుసుకుందాం. అలియా భట్ బొప్పాయి, తేనె మరియు ఆరెంజ్ పౌడర్‌ను ఫేస్ ప్యాక్‌ల కోసం ఉపయోగిస్తుంది. అలియా భట్ తేనె మరియు ఆరెంజ్ పౌడర్ కలిపిన తరువాత ఆమె ముఖం మీద పూస్తారు. ప్యాక్ వేసిన తరువాత, అలియా భట్ ఆమె ముఖం మీద మాయిశ్చరైజర్ ఉపయోగిస్తుంది.

ఆరోగ్యకరమైన ఆహారం
ఆలియా భట్ ఆహారం విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ బాలీవుడ్ భామ తన చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఆకుపచ్చ కూరగాయలు మరియు పండ్లను తింటుంది. అలియా భట్ జంక్ ఫుడ్ తినడం మానేసిందట.. యాంటీ ఆక్సిడెంట్లు ఆకుపచ్చ కూరగాయలలో కనిపిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

చర్మ సంరక్షణకు..
అలియా భట్ తన చర్మ సంరక్షణ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన చర్మాన్ని చిన్నపిల్లలా చూసుకుంటానని చెప్పింది. అలియా భట్ తన చర్మ సంరక్షణ కోసం ఎక్కువగా మేకప్ జోలికి వెళ్లరట. ఆమె చర్మంపై తక్కువ కెమికల్స్ ఉండే ప్రాడక్ట్స్ నే వాడుతుందట.

సిల్కీ జుట్టు
ఆలియా భట్ కు సిల్కీ హెయిర్ అంటే బాగా ఇష్టమట. తన అభిమానులు అలాంటి సిల్కీ హెయిర్ స్టైల్ నే ఎక్కువగా ఇష్టపడతారట. అందుకే ఆమె తన జుట్టు సిల్కీగా ఉండటానికి కొబ్బరి నూనెను ఎక్కువగా ఉపయోగిస్తుందట.

చర్మకాంతి..
అలియా భట్ తన చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకునేందుకు సహజమైన మూలికా ఉత్పత్తులను ఉపయోగిస్తుందట. ఎందుకంటే కెమికల్స్ ను ఎక్కువగా వాడటం వల్ల తన చర్మ కాంతి తగ్గిపోతుందని ఆమె భావిస్తారట. అందుకే ఆమె సహజ మూలికా ఉత్పత్తులను వాడతారట. అదే తన అందాల రహస్యమని అలియా పేర్కొంది.



Click it and Unblock the Notifications