For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tips for Beautiful Lips:వింటర్లో మీ పెదాలు సాఫ్ట్ గా మారాలంటే...!

|

మనలో చాలా మంది పురుషులు.. మహిళల పెదాలను సగటున 6.73 సెకన్ల పాటు తదేకంగా చూస్తారట. మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు చేసిన ఓ అధ్యయనం ప్రకారం చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల పెదాలను 6 సెకన్ల కంటే ఎక్కువగా చూస్తున్నారని తేలిందట.

(అదే అందమైన అమ్మాయిలు రెడ్ లిప్ స్టిక్ వేసుకుంటే.. ఆ టైమ్ మరింత పెరుగుతోందట). కావాలంటే మీరు కూడా ఓసారి గమనించండి. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. వింటర్ సీజన్లో మనలో చాలా మంది పెదాలు పొడిబారిపోతూ ఉంటాయి.

ఈ కారణంగా కొందరికి లిప్ స్టిక్ వేసుకోవాలనిపించదు. అయితే ఫేస్ బ్యూటిఫుల్ గా కనిపించాలంటే.. మాత్రం పెదాలు అందంగా మెరిసిపోవాలి. ఈ నేపథ్యంలో వింటర్ సీజన్లో మీ పెదవులు పొడిబారకుండా.. రోజంతా మెరుస్తూ ఉండేందుకు పాటించాల్సిన చిట్కాలేంటో ఇప్పుడు చూసేయ్యండి...

తాజాగా కనిపించాలంటే..

తాజాగా కనిపించాలంటే..

మీ పెదవులు ఎల్లప్పుడూ తాజాగా కనిపించాలంటే.. మాయిశ్చరైజర్ చేయడం చాలా అవసరం. అందుకోసం చాలా మంది అమ్మాయిలు కచ్చితంగా లిప్ బామ్ ను ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీన్ని ఎల్లప్పుడూ తమ వెంటే తీసుకెళ్తారు. పెదాలు డ్రై అయిన ప్రతిసారీ వీటిని అప్లై చేసుకొంటూ ఉంటారు. అయితే బ్యూటీ కిట్ లో భాగమైన దీన్ని మార్కెట్లో కొనడం కంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

ఇంట్లోనే సులభంగా..

ఇంట్లోనే సులభంగా..

మీకు నచ్చిన ఫ్లేవర్లో పెదాల అందాన్ని మరింత పెంచే లిప్ బామ్ ని ఇంట్లో సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని తయారీకి కావాల్సిన వస్తువులన్నీ కిరాణ షాపుల్లో.. సూపర్ మార్కెట్లో సులభంగా లభిస్తాయి. ఇందుకోసం ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.

1) ముందుగా డబుల్ బాయిలర్లో టేబుల్ స్పూన్ షియా, కొకొవా బటర్ తీసుకోవాలి.

2) మంటను చిన్నగా పెట్టి 20 నిమిషాల పాటు వేడి చేయాలి.

3) టీ స్పూన్ కొబ్బరినూనె, కొద్దిగా బీస్ వ్యాక్స్ కూడా కలపాలి.

4) ఇవన్నీ బాగా కలిసి ఓ మిశ్రమంలా తయారయ్యేలా టూత్ పిక్ తో కలపాలి.

5) గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి ఒక నిమిషం తర్వాత.. రెండు చుక్కల తేనే, కొద్దిగా పెప్పర్ మింట్ ఆయిల్, కొద్దిగా కొకొవా పౌడర్ వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ఓ ఖాళీ పాత్రలో లేదా లిప్ స్టిక్ ట్యూబ్ వేసిన తర్వాత సుమారు 3 నుండి 4 గంటల వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత మీరు కోరుకున్న చాకో మింట్ లిప్ బామ్ రెడీ అయిపోతుంది.

రాత్రి పడుకునే ముందు..

రాత్రి పడుకునే ముందు..

మీ పెదాలు తరచుగా పొడిబారుతూ ఉంటే.. రాత్రి ఇంట్లో నిద్రించే ముందు తగినంత వెన్నలో అయిదారు చుక్కల తేనే కలిపి మీ పెదాలపై రాసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మీ లిప్స్ చాలా సాఫ్ట్ గా మారిపోతాయి.

పెదాలు అందంగా..

పెదాలు అందంగా..

గ్రీన్ టీతో తయారు చేసే లిప్ బామ్ తోనూ మీ పెదాలు మరింత అందంగా మారతాయి. దీన్ని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. అందుకోసం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

1) డబుల్ బాయిలర్లో కొబ్బరినూనె, బీస్ వ్యాక్స్, గ్రీన్ టీ ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్ వేసి 5 నిమిషాల పాటు వేడి చేయాలి.

2) ఆ తర్వాత తేనే, అవకాడో నూనె కూడా వేసి బాగా కలపాలి.

అది ఒక మిశ్రమంలా తయారైన తర్వాత బామ్ కంటైనర్లో వేయాలి. సుమారు ఐదు గంటల తర్వాత ఈ లిప్ బామ్ మీ పెదాలకు అప్లై చేస్తే మీ పెదాలు చాలా అందంగా కనిపిస్తాయి.

రోజుకోసారి..

రోజుకోసారి..

పైన చెప్పిన స్టెప్స్ చేయడానికి ఖర్చుతో కూడుకున్న పని.. చాలా ఓపిక కావాలని మీకనిపిస్తే.. ఇలా ట్రై చేసి చూడండి. మీ పొడిబారిన పెదాలపై తేనే పూయండి. దానిపైన ఒక లేయర్ వ్యాసిలీన్ రాయండి. ఒక 15 నిమిషాల తర్వాత తడి బట్టతో దాన్ని తుడి చేయండి. ఇలా ప్రతిరోజూ ఒకసారి చేయాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తే కచ్చితంగా ఫలితం వస్తుంది.

గులాబీ రేకులతో..

గులాబీ రేకులతో..

సుమారు ఐదు లేదా ఆరు గులాబీ రేకులను తీసుకోండి. పావు కప్పు పాలలో రెండు లేదా మూడు గంటల పాటు నానబెట్టండి. ఆ తర్వాత ఆ రేకుల్ని మెత్తటి పేస్టులా మీ చేత్తో నలిపేయండి. అనంతరం తయారైన మిశ్రమాన్ని మీ పెదాలకు అప్లై చేయండి. ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రోజుకోసారి వారం రోజుల పాటు చేస్తే మీ పెదాలు పొడిబారకుండా అందంగా మారతాయి.

English summary

Tips to Take Care of Your Dry Lips in Winter in Telugu

Here are tips to take care of your dry lips in winter in Telugu. Take a look
Story first published: Tuesday, September 28, 2021, 17:05 [IST]