For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అబ్బాయిలు కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన న్యాచురల్ బ్యూటి ట్రిక్స్..!

సలూన్ లలో చేయించుకునే ఫేషియల్స్, క్రీమ్స్, ఫేస్ ప్యాక్స్ అంత ఎఫెక్టివ్ ఫలితాలను ఇవ్వకపోవచ్చు. కాబట్టి మీరు మీ భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ నుంచి కొన్ని టిప్స్ ఫాలో అయితే.. చాలా స్మార్ట్ లుక్ పొందవచ్చు.

By Swathi
|

మగవాళ్ల చర్మం కాస్త గరుకుగా ఉంటుంది. ఎన్ని రకాలుగా ట్రై చేసినా వాళ్ల చర్మం కాస్త హార్డ్ గా, డల్ గా కనిపిస్తూ ఉంటుంది. ఫెయిర్ గా ఉండే వాళ్ల చర్మం నిగారిస్తూ కనిపించినప్పటికీ.. కాస్త ఎండలోకి వెళ్లేసరికి వాళ్లది కూడా జిడ్డు కారిపోతూ ఉంటుంది. దీనికి వాళ్లకున్న అలవాట్లు, షేవింగ్ క్రీమ్స్, రేజర్ ఎఫెక్ట్ కారణం కావచ్చు.

7 Natural Beauty Tricks Men Should Steal From Their Girls!

అయితే మగవాళ్లు కూడా చర్మం స్మూత్ గా, ఎట్రాక్టివ్ గా మార్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. సలూన్ లలో చేయించుకునే ఫేషియల్స్, క్రీమ్స్, ఫేస్ ప్యాక్స్ అంత ఎఫెక్టివ్ ఫలితాలను ఇవ్వకపోవచ్చు. కాబట్టి మీరు మీ భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ నుంచి కొన్ని టిప్స్ ఫాలో అయితే.. చాలా స్మార్ట్ లుక్ పొందవచ్చు.

అబ్బాయిలు సాధారణంగా చర్మ సంరక్షణపై పెద్దగా శ్రద్ధ తీసుకోరు. అలాగే.. బ్యూటి టిప్స్ అంటే అమ్మాయిలు మాత్రమే ఫాలో అయ్యేది అని భావిస్తారు. కానీ.. అమ్మాయిల దగ్గర కొన్ని ట్రిక్స్ తీసుకుని మీరు కూడా ఫాలో అయితే.. ఫలితాలు చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి. మరి అబ్బాయిలు స్మార్ట్ గా కనిపించడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూద్దాం..

సోప్స్ వద్దు

సోప్స్ వద్దు

చాలామందికి సోప్స్ వాడటం అలవాటు ఉంటుంది. కానీ ఫేస్ వాష్ లు వాడటం చాలా మంచిది. ముఖ్యంగా మీది సున్నితమైన చర్మతత్వం అయితే.. ఫేస్ వాష్ వాడటమే మంచిది. మైక్రో బీడ్స్ కలిగిన ఫేస్ వాష్ లు.. టాక్సిన్స్ ని తొలగిస్తాయి. అలాగే చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేస్తాయి. కాబట్టి అలాంటివాటినే వాడాలి.

సన్ స్క్రీన్

సన్ స్క్రీన్

మగవాళ్లు ఎక్కువగా యూవీ కిరణాలకు ఎక్స్ పోజ్ అవుతూ ఉంటారు. దీనివల్ల చర్మం త్వరగా ముడతలు పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజూ సన్ స్క్రీన్ ఉపయోగించడం వల్ల చర్మం క్లియర్ గా, సూర్య రశ్మికి ఎలాంటి హాని కలుగకుండా ఉంటుంది.

మాయిశ్చరైజర్

మాయిశ్చరైజర్

మగవాళ్ల చర్మం ఆడవాళ్ల చర్మానికి కంటే 15 శాతం ఎక్కువ ఆయిలీగా ఉంటుంది. కానీ అలాగే చర్మం త్వరగా దురదగా, పొడిబారుతుంది కూడా. వీటన్నింటికీ దూరంగా ఉండాలంటే.. లైట్ మాయిశ్చరైజర్ ని అప్లై చేయాలి. మీ చర్మతత్వాన్ని బట్టి సరైన మాయిశ్చరైజర్ ఎంచుకుని.. రోజుకి రెండుసార్లు అప్లై చేయాలి.

ఫేస్ ప్యాక్స్ ఎందుకు

ఫేస్ ప్యాక్స్ ఎందుకు

అమ్మాయిల చర్మం స్మూత్ గా ఉంటుంది. దీనికి వాళ్లు ఉపయోగించే ఫేస్ ప్యాక్ లే కారణం. ఫేస్ ప్యాక్స్ చర్మంలో పేరుకున్న మలినాలను తొలగిస్తాయి. డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తాయి. కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. దీనివల్ల చర్మం హెల్తీగా ఉంటుంది.

ఫేస్ ప్యాక్

ఫేస్ ప్యాక్

2 చార్ కోల్ క్యాప్సుల్స్ తీసుకోవాలి, వాటిని రోజ్ వాటర్ లో కలిపి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం స్మూత్ గా, హెల్తీగా తయారవుతుంది.

పళ్లు తెల్లగా మారడానికి

పళ్లు తెల్లగా మారడానికి

అమ్మాయిలైనా, అబ్బాయిలైనా.. పళ్లు ఆరోగ్యంగా, తెల్లగా ఉండాలి. టీస్పూన్ బేకింగ్ సోడాలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని పంటికి అప్లై చేసి.. 5 నిమిషాల తర్వాత బ్రష్ చేసుకుని శుభ్రం చేసుకోవాలి. నెలకు ఒకటి రెండుసార్లు ఈ ట్రిక్ ఫాలో అయితే.. తెల్లటి పళ్లు మీ సొంతమవుతాయి.

హెయిర్ ప్రొడక్ట్స్

హెయిర్ ప్రొడక్ట్స్

ఎక్కువ జెల్స్ ఉన్న హెయిర్ జెల్స్ లో ఆల్కహాల్ ఉంటుంది. ఇది జుట్టు న్యాచురల్ ఆయిల్స్ ని కోల్పోయేలా చేస్తుంది. జుట్టు డ్రైగా, డ్యామేజ్ అవడానికి కారణమవుతుంది. కాబట్టి.. అలాంటి జెల్స్ కంటే కొబ్బరినూనె ఉపయోగించడం మంచిది.

గడ్డం

గడ్డం

మీ గడ్డం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. షాంపూ, కండిషనర్ ని గడ్డంకు వారానికి రెండుసార్లు ఉపయోగించడం మంచిది. ఇది మీ గడ్డాన్ని స్మూత్ గా ఉంచుతుంది. దురద లేకుండా కాపాడుతుంది.

English summary

7 Natural Beauty Tricks Men Should Steal From Their Girls!

7 Natural Beauty Tricks Men Should Steal From Their Girls! Simple everyday skin care tips for men that will make your life easy!
Story first published: Saturday, December 24, 2016, 10:41 [IST]
Desktop Bottom Promotion