Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
మగవాళ్లు ఫేస్ చేసే.. ఎవరికీ చెప్పలేని సమస్యలు..!
బ్యూటి అనేది.. జీవితంలో ప్రతి స్టేజ్ లోనూ అవసరమయ్యేది. కానీ బ్యూటి టిప్స్ ని ప్రతి ఒక్కరూ తేలికగా ఫాలో అవలేరు. ముఖ్యంగా మగవాళ్లు వాళ్ల చర్మ సంరక్షణ గురించి, శరీర శుభ్రత గురించి పట్టించుకోరు అనలేం. కానీ.. వాళ్లు కూడా.. లేటెస్ట్ ట్రెండ్స్, లైఫ్ స్టైల్ ట్రిక్స్ ని ఫాలో అవుతారు.
అయితే మగవాళ్లు ఎదుర్కొనే కొన్ని బ్యూటి ప్రాబ్లమ్స్ ని.. ఇతరులతో పంచుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. అందుకే ఎవరికీ చెప్పరు. ఆ సమస్యల నుంచి బయటపడలేక.. ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో తెలియకపోయినా.. వాటి గురించి బయటకు చెప్పడం ఇష్టం లేక.. ఇబ్బందిపడుతుంటారు.
అసలు మగవాళ్లు ఫేస్ చేసే.. బ్యూటి ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం..

దుర్వాసన
మీ గర్ల్ ఫ్రెండ్ తో రొమాంటిక్ ఈవెనింగ్ ఎంజాయ్ చేయాలనుకుంటారు. కిస్ చేద్దామంటే.. మీ నోటి దుర్వాసన మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తుంది. కానీ దుర్వాసన సమస్య అనేది.. నయం చేయలేనిది కాదు. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవడం ద్వారా దుర్వాసన సమస్యకు చెక్ పెట్టవచ్చు.

చెస్ట్ హెయిర్
మగవాళ్ల చెస్ట్ పై హెయిర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే.. ఈ సమస్య కొంతమంది మగవాళ్లు మాత్రమే ఫేస్ చేస్తారు. అయితే.. ఈ హెయిర్ కాస్త ఇబ్బందికి గురిచేస్తుండటం వల్ల.. దీన్ని ఎలా తొలగించుకోవాలో అర్థం కాదు. కానీ.. ఎవరికీ చెప్పుకోలేరు. కానీ.. చెస్ట్ పై హెయిర్ ఉంటే.. పెద్ద సమస్యేమి కాదు.. అనిల్ కపూర్ లాంటి చెస్ట్ ఉన్నట్టే.

చెమట
ఎప్పుడైనా చాలా బిజీగా గడిపినప్పుడు, నలుగురిలో ఉండాల్సి వచ్చినప్పుడు.. మగవాళ్లను ఎక్కువగా ఇబ్బంది పెట్టే విషయం చెమట. చుట్టూ ఉన్నవాళ్లు తమ నుంచి వచ్చే స్మెల్ చూసి ఏమనుకుంటారో అన్న ఆందోళన వాళ్లలో ఉంటుంది.

చుండ్రు
మగవాళ్లకు చాలా ఇబ్బందిపెట్టే మరో సమస్య చుండ్రు. భుజాలపై అసహ్యంగా పడుతూ ఉంటుంది. దీన్ని చూసి నలుగురిలో ఇబ్బంది పడతారు కానీ.. సలహాలు అడగటానికి సంకోచిస్తారు. చుండ్రు తొలగించుకోవాలంటే.. మంచి కండిషనర్, షాంపూ లేదా హోం రెమిడీస్ ఫాలో అవడం మంచిది.

గడ్డం
గడ్డం అంటే.. అబ్బాయిలకు చాలా ఇష్టం. ఎందుకంటే.. రకరకాల స్టైల్స్ లో తమ లుక్ ని మార్చుకోవడానికి ఇది ఒకటి. అయితే.. పెద్దగా పెంచుకుంటే.. దాన్ని ఎలా మెయింటెయిన్ చేయాలా అన్న డౌట్ వాళ్లలో ఉంటుంది.

పాదాల దుర్వాసన
ఇది చిన్న విషయం కాదు. చాలామంది అబ్బాయిలు ఫేస్ చేసే సమస్య. షూస్ తీసేయగానే గుప్పున వచ్చే దుర్వాసన ఇతరులకు చాలా ఇబ్బంది పెడుతుంది. దీనికి రెమిడీస్ అడగడానికి చాలామంది అబ్బాయిలు ఇబ్బంది పడతారు.

మొటిమలు
మొటిమలు కేవలం ఆడవాళ్లకు మాత్రమే కాదు.. మగవాళ్లను కూడా ఇబ్బందిపెడతాయి. అయితే.. వీటికి సింపుల్ హోం రెమిడీస్ ఫాలో అయితే.. నయం అవుతాయి.. దానికి పెద్దగా ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు.

స్ట్రెచ్ మార్క్స్
మగవాళ్ల శరీరంపై స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయంటే.. ఒప్పుకోరు. కానీ.. వాళ్ల బాడీపై కూడా స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి. బరువు తగ్గడం లేదా జిమ్ చేయడం ఏదైనా కావచ్చు.. ఫిట్ బాడీ పొందవచ్చు. కానీ.. బాడీపై స్ట్రెచ్ మార్క్స్ కూడా ఉంటాయి.



Click it and Unblock the Notifications