మగాళ్లు వీటిని విస్మరించకండి!

Posted By: Madhavi Lagishetty
Subscribe to Boldsky

సౌందర్యం మహిళలకే పరిమితమా...పురుషులు దానికి అతీతులా..అనంటే కానే కాదంటున్నారు నేటితరం యువకులు. అందంగా కనిపించడానికి అమ్మాయిలు ఎంత కష్టపడుతున్నారో..అబ్బాయిలూ అంతే కసరత్తు చేస్తున్నారు. అయితే కొంత మంది మగాళ్లు మాత్రం...అందానికి సంబంధించిన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు. కనీసం శుభ్రంగా ఉండటానికి కూడా ప్రయత్నించరు.

మీరెప్పుడైనా..మ్యాగజైన్స్ కవర్స్, ఫిల్మ్ స్టార్ట్స్ మ్యాకో మెన్లను చూశారా. అయితే వారు నిజంగా అలాగే ఉంటారాని మీరు భావిస్తున్నారా?లేక అదంతా అన్ రియల్ అని భావిస్తున్నారా?

10 గ్రూమింగ్ టిప్స్- ఇవి మిమ్మల్ని తప్పక మరింత ఆకర్షణీయం గా కనపడేటట్లు చేస్తాయి

మీరు...ది బెస్ట్ గా కనిపించడంతోపాటు, చక్కటి ఆహార్యంతో ఉండటానికి కావాల్సిన రూపాన్ని పొందడం అనేది ఒక ఫాంటసీగా ఉండదు.

అందంగా కనిపించడం అనేది ఒక బోనసే. పురుషుడు తన కండరాలతో అందరినీ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తాడు. ఒక మంచి లెదర్ జాకెట్ ధరించుట వల్ల మీ అందాన్ని మరింత రెట్టింపుగా కనిపించేలా చేయడం ఖాయం. అంతేకాదు సరైన అమరిక గల బట్టలు ధరించడం కూడా మంచిది. లెదర్ జాకెట్ వల్ల కండరాలు ఆకర్షించేలా కనిపిస్తాయి.

మీ బాడీ 6-ప్యాక్ అయితే స్త్రీలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎందుకంటే 6 ప్యాక్ బాడీ ఉన్న మగాళ్లను స్త్రీలు ఇష్టపడతారు. 6 ప్యాక్ ఉంటే సరిపోదు. శరీరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శరీరం నుంచి దుర్వాసన వస్తే...స్త్రీలు మీ వైపు కన్నెత్తి కూడా చూడరు. మీరు స్త్రీలను ఆకర్షించాలంటే...చక్కటి వస్త్రాధారణతోపాటు శరీరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డ్రస్సింగ్ లో అలసత్వము, శుభ్రత లేని జుట్టు , మురికి గోర్లు, తడిసిన చొక్కాలు వీటన్నింటికి వీడ్కోలు పలికి...అందంగా..ఆకట్టుకునేలా కనిపించేందుకు కాస్త సమయం కేటాయించాలి.

వింటర్లో పురుషుల అందానికి పాటించాల్సిన నియమాలు

కొన్ని సార్లు మీ చర్మం మరియు జుట్టు సంరక్షణ అనేది పాటించినట్లయితే...మీరు కూడా ప్రతి దానిని మంచిగా చూడటానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు వైన్ ను విస్మరించడానికి కారణం కావచ్చు. పురుషులు పక్కాగా పాటించాల్సిన కొన్ని నియమాలు చదవండి. వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ వీటిని విస్మరించరాదు.

చిట్కా1..

చిట్కా1..

కొంత మంది మగవాళ్లు ముక్కు రంధ్రంను శుభ్రంగా ఉంచుకోరు. చాలా మంది పురుషుల నాసికా రంధ్రాల నుంచి పెరుగుతున్న వెంట్రుకలు కనిపిస్తుంటాయి. వీటిని క్రమం తప్పకుండా కత్తిరించాలి. లేదంటే మీ ముక్కు చూడటానికి అసహయంగా కనిపిస్తుంది.

చిట్కా2..

చిట్కా2..

కొందరు చేతు గోర్లను పెంచుతారు. అందులో మురికి చేరి చూడానికి ఇంపుగా కనిపిస్తాయి. పెరుగుతున్న గోర్లను వారానికి ఒక్కసారి క్లిప్ చేయడం అలవాటు చేసుకోండి. చాలామంది మగవాళ్లు, మానిక్యూర్, పెడిక్యూర్ కోసం వెళ్లరు. అందువల్ల ఆ శరీరం భాగాలను విస్మరించడం వల్ల గోర్లు పెంచడం వల్ల మీ లుక్ డ్యామేజ్ కావడం ఖాయం.

చిట్కా3...

చిట్కా3...

శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా ఉన్న మగవారు...ప్రత్యేకించి చేతులపై ఎక్కువగా వెంట్రుకలు ఉన్నవాళ్లు చూడటానికి ఏదోలా కనిపిస్తారు. క్రమం తప్పకుండా వాటిని కత్తిరించినట్లయితే...చెమట, ధూళిని తగ్గించే అవకాశం ఉంటుంది. దీంతో శరీరం నుంచి దుర్వాససను కూడా తగ్గించవచ్చు.

చిట్కా4...

చిట్కా4...

మీరు హైబ్రోస్ మందంగా ఉన్నట్లయితే...లేదా యునీ-బ్రోతో ఉన్నట్లయితే...వెంటనే తొలగించడం బెట్టర్. రెండు కనుబొమ్మల మధ్య ఉన్న జుట్టున కత్తిరించడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే...మీ ముఖం అందంగా కనిపిస్తుంది.

చిట్కా5..

చిట్కా5..

ఒక మంచి డియోడ్రెంట్ ను ఉపయోగించండి. మహిళల కంటే మగవాళ్లకే ఎక్కువగా చెమపడుతుంది. ఎక్కువ చెమట వచ్చే మగవారు బాడీ స్ప్రేలు ఉపయోగించడం ఉత్తమం. దీంతో వారి శరీరం సువాసనలను వెదజల్లుతుంది.

చిట్కా6...

చిట్కా6...

షేవింగ్ చేసుకునేప్పుడు బ్లేడ్స్ వల్ల మీ ముఖంపై గాయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. అవి చూడటానికి వికారంగా కనిపిస్తాయి. క్రీములు అప్లై చేయడం ద్వారా ఎలాంటి అవాంఛనీయ మచ్చలు కనిపించవు.

చిట్కా7...

చిట్కా7...

కొందరి మగాళ్ల పెదాలు పగిలి...అందవికారంగా కనిపిస్తాయి. మీకు అలాంటి సమస్య ఉన్నట్లయితే చాప్ స్టిక్, లేదా లిప్ బామ్ ను అప్లై చేయండి. పెదాలు పగలడం కేవలం మహిళలకే కాదు...పురుషులకు కూడా పెద్ద ప్రాబ్లమ్ గా ఉంటుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Best Grooming Tips For Men

    If you are a man who wants to look good, then there are some effective grooming tips to help you attain that look, read all about them here...
    Story first published: Thursday, September 7, 2017, 18:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more