For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Acharya : ‘ఆచార్య’ చిరంజీవి హెయిర్ స్టైల్స్ పై ఓ లుక్కేద్దామా...

|

మెగాస్టార్ చిరంజీవి అభిమానులను మరోసారి సర్ ప్రైజ్ చేశాడు. ఎవ్వరూ ఊహించని విధంగా శుక్రవారం నాడు 'ఆచార్య' పేరిట ఆన్ లైన్ లో టీజర్ విడుదల చేసి అందరినీ అలరించాడు.

దీనికి ముందు సోషల్ మీడియాలో స్టైలిష్ గుండుతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచిన కొణిదెల చిరంజీవి ఇప్పుడు స్టైలిష్ హెయిర్ స్టైల్ తో పాటు పదునైన డైలాగులతో అభిమానుల అంచనాలకు మించి దూసుకెళ్తున్నాడు.

ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్లకొద్దీ వీవ్స్, లైక్స్, షేర్స్ వచ్చేశాయి.. వస్తున్నాయి కూడా. 'పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా.. అందరూ ఎందుకో 'ఆచార్య' అంటుంటారు.

బహుశా అందరికీ గుణపాఠాలు చెబుతానేనేమో' అనే డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ డైలాగ్ చెప్పే సమయంలో చిరంజీవి న్యూ లుక్ ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా.. అచ్చం ప్రొఫెసర్ లా చాలా స్టైలీష్ గా కనిపించాడు. ఈ సందర్భంగా మెగాస్టార్ లేటెస్ట్ హెయిర్ స్టైల్ ఎలా ఉంది.. దీని కోసం ఆయన ఏమి చేశారనే విషయాలతో పాటు.. మెగా అభిమానులు ఎంతగానో ఇష్టపడే చిరంజీవి పాపులర్ లుక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం...

మెగాస్టార్ చిరంజీవి న్యూ లుక్ ట్రిక్ తెలిస్తే షాక్ అవుతారు...మెగాస్టార్ చిరంజీవి న్యూ లుక్ ట్రిక్ తెలిస్తే షాక్ అవుతారు...

గుండు లుక్(Urban Monk Look)

గుండు లుక్(Urban Monk Look)

ఈ సినిమా కోసం చిరంజీవి గుండు చేయించుకున్నాడని.. లేదా తిరుపతి వెళ్లి తలనీలాలు సమర్పించాడని పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ.. మెగాస్టార్ చిరంజీవే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా గుండు వెనుక రహస్యమేంటో తెలియజేశారు.

నిజమైన రూపం..

నిజమైన రూపం..

కొన్ని నెలల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో గుండు లుక్ వీడియో షేర్ చేసిన చిరంజీవి ఇలా అన్నారు. ‘ఏ రూపాన్ని అయినా నిజమని నమ్మేలా చేసే ఇండస్ట్రీలోని టెక్నీషియన్లందరికీ ధన్యవాదాలు. మ్యాజిక్ ఆఫ్ సినిమాకు హ్యాట్సాఫ్' అన్నారు. అలా తన అర్బన్ మాంక్ లుక్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టేశారు. కానీ ఈ కొత్త అవతారం ఏ సినిమా కోసం అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే దాన్ని చూస్తే సినిమాకు సంబంధించిన పాత్రలో భాగంగానే అలా కనిపించారని అందరికీ అర్థమయ్యింది.

కొత్త లుక్..

కొత్త లుక్..

దీని కంటే ముందు కూడా చిరంజీవి ఇంతవరకు ఎప్పటికీ కనబడని లుక్ లో కనబడ్డాడు. తొలిసారి మీసాలు, గడ్డం లేకుండా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మ్యాజిక్ చేశారు.. సినిమాలో ఉండే మ్యాజిక్ ఎందరికీ కిక్ ఇస్తుంది. లేనిది ఉన్నట్టుగా.. ఉన్నది లేనట్టుగా చూపించడం సినిమాలకు చాలా సహజమైన విషయం. అందుకు తాజా ఉదాహరణ చిరంజీవి న్యూ లుక్.

జులపాల జుట్టుతో..

జులపాల జుట్టుతో..

ఈ సినిమా కంటే ముందు సైరా నరసింహరెడ్డి సినిమాలో జులపాల జుట్టుతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ సినిమా పోస్టర్ రిలీజ్ చేసిన సమయంలో కూడా అది బాగా వైరల్ అయ్యింది. అంతేకాదు ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.

పాలిటిక్స్ లో ఉన్నప్పుడు..

పాలిటిక్స్ లో ఉన్నప్పుడు..

అయితే చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా సింపుల్ గా కనిపించేవాడు. ఎలాంటి స్టిల్స్ లేకుండా చాలా నిరాడంబరంగా ఉండేవాడు. కేవలం బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ తో సాధారణ హెయిర్ స్టైల్ తో కనిపించాడు. రీ ఎంట్రీతో స్టైలిష్ గా... అయితే రాజకీయాలకు ఎప్పుడైతే గుడ్ బై చెప్పి, సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడో.. అప్పటినుండి మళ్లీ తన కొత్త లుక్స్ తో అందరినీ అలరిస్తున్నారు. అంతేకాదు తన భాష, వేషంతో పాటు ఎన్నో మార్పులు చేశారు. అవన్నీ అభిమానులందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి కూడా.

English summary

Acharya : Chiranjeevi Different Hairstyles

Here are the Achary : Chiranjeevi Different Hairstyles. Take a look