Latest Updates
-
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.!
వింటర్లో ఈ హీరోల ఫ్యాషన్ డ్రస్సులను ట్రై చేయండి.. కూల్ గా కనిపించండి...!
విజయదేవరకొండ, అల్లు శిరీష్ వింటర్లో స్టైలీష్ గా కనిపించేందుకు ఫ్యాషన్ పరంగా ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నారు.
చలికాలం అప్పుడే అందరినీ గజ గజ వణకిస్తోంది. చాలా మంది ఈ సమయంలో చలి కాచుకోవడానికి ఉదయాన్నే మంటలు వేస్తున్నారు. అయితే ఈ చలిని తట్టుకునేందుకు ఎక్కువ మంది స్వెట్టర్లు, ఉన్ని దుస్తులు వాడుతూ ఉంటారు.

ఇంకా కొందరు చేతులకు గ్లౌసులు, బూట్లు, వింటర్ జాకెట్లను ధరిస్తుంటారు. ఇలాంటి సమయంలో తమ ఫ్యాషన్ డ్రస్సులతో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు మన టాలీవుడ్ హీరోలు. వీరి ఫ్యాషన్ ఔట్ ఫిట్స్ వల్ల ఫ్యాషన్ ఔత్సాహికులలో ఎంతో ఉత్సాహం పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో చలికాలంలోనే ప్రతి ఒక్కరూ వెచ్చగా ఉండేందుకు ఎలాంటి డ్రస్సులు ధరించాలి.. ఏ దుస్తులు ధరిస్తే స్టైలీష్ గా కనిపిస్తారు..

ఇంతకీ మన తెలుగు హీరోలు విజయదేవరకొండ.. నాగ చైతన్య, అల్లు శిరీష్ ఎలాంటి వింటర్ స్టైలీష్ డ్రస్సులను వేసుకున్నారో చూసెయ్యండి...

విజయ్ దేవరకొండ..
సాధారణంగా పింక్ కలర్ అంటే అమ్మాయిలకు ఇష్టమైన రంగు అని అంటూ ఉంటారు చాలా మంది. అయితే అందులో ఏ మాత్రం నిజం లేదు. పింక్ కలర్ డ్రస్సులను అబ్బాయిలు వేసుకోవచ్చు. అందుకే టాలీవుడ్ హీరో హ్యాండ్సమ్ విజయదేవరకొండ పింక్ బినీ క్యాప్ పెట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు దానికి మ్యాచింగ్ డ్రస్సు వేసుకుని సోషల్ మీడియాలో సైతం షేర్ చేసుకున్నాడు. పింక్ కలర్ దుస్తులను మగాళ్లు వేసుకోవచ్చని చెబుతున్నాడు.

నాగ చైతన్య..
‘లవ్ స్టోరీ'సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నాగ చైతన్య కూడా ఫ్యాషన్ పై కొంచెం ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో చైతన్య ఫిట్ చేసిన జిప్పర్ స్వెట్ షర్ట్ మరియు డార్క్ వాష్డ్ డెనిమ్ తో చాలా స్టైలీష్ గా, హుందాగా కనిపించాడు. మీరు కూడా నాగచైతన్యలా హుందాగా కనిపించాలంటే చైతూ వేసుకున్న ఈ డ్రస్ ను ఈ వింటర్లోనే ట్రై చేయండి.

అల్లు శిరీష్..
అల్లు అరవింద్ రెండో కుమారుడు అల్లు శిరీష్ ఇటీవలి కాలంలో ఫ్యాషన్ డ్రస్సులతో స్టైలీష్ గా కనిపిస్తున్నాడు. ఈసారి నేవీ కలర్ మరియు స్వెడ్ యాంకిల్ షూతో సరికొత్తగా కనిపించాడు. మెగాస్టార్ చిన్న అల్లుడు శిరీష్ సార్టోరియల్ ఎంపికలకు ప్రసిద్ధి చెందాడు. ఎల్లప్పుడూ క్లాస్ గా.. కాస్త సరదాగా ఉండే అల్లు శిరీష్ ఈసారి అద్భుతమైన షూస్.. అందుకు తగ్గ డ్రస్ తో అట్రాక్టివ్ గా కనిపించాడు.

దుల్కర్ సల్మాన్..
మరో దక్షిణాది సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ నాన్-ఫ్రిల్స్ క్యాప్ మరియు వింటర్ బాంబర్ జాకెట్ లుక్ తో అదరగొట్టాడు. ఈ డ్రస్సుతో గడ్డ కట్టే చలిలోనూ, ఉత్తరాది ప్రాంతాల్లోనూ చాలా కూల్ గా ఉన్నట్లు కనిపించాడు.



Click it and Unblock the Notifications