Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
విజయ్ దేవరకొండ , యష్, శిరీష్ టు రానా డ్రస్సుల్లో ఎవరిది హైలెట్ అయ్యిందో తెలుసా...
విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్, రానా దగ్గుబాటి, యష్ వేసుకున్న పోలో నెక్ డ్రస్సుల్లో ఎవరు స్టైలీష్ గా కనిపిస్తున్నారో చూసెయ్యండి.
చలి పులి తన పంజా చూపుతోంది.. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ చలి మంట కాచుకుంటూ ఉంటారు. అయితే ఈ చలికాలంలో జాలీగా జర్నీ చేయాలని చాలా మంది ఆశ పడుతూ ఉంటారు. ఈ సమయంలో రోల్ నెక్ డ్రస్సులను, స్టైలీష్ లెదర్ జాకెట్లను ధరిస్తే.. ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. వీటిని ధరించడం వల్ల మీకు మంచి లుక్ కనిపించడమే కాదు..బయటి ఉష్ణోగ్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ డ్రస్సులను మీరు శరదృతువు నుండి వసంతకాలం వరకు ధరించొచ్చు.

ఈ నేపథ్యంలోనే దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోలు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, యష్, దుల్కర్ సల్మాన్, అల్లు శిరీష్ లు హై-నెక్డ్ టీషర్టులు ధరించి స్టైలీష్ గా కనిపించారు. ఈ డ్రస్సులు కేవలం పగటి వేళ మాత్రమే కాదు.. ఏ సమయంలో అయినా మీకు మంచి లుక్ వచ్చేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవి చల్లని వాతావరణంలో మంచి లేయర్లుగా ఉపయోగపడతాయి. వీటిని ధరించి రెడ్ కార్పెట్ పై నడుస్తుంటే అందరి చూపు మీ వైపు కచ్చితంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఈ ఐదుగురు హీరోల్లో ఎవరి డ్రస్సు స్టైలిష్ కనిపిస్తుంది.. ఎవరు అద్భుతమైన లుక్ లో కనిపిస్తున్నారో మీరూ చూసెయ్యండి....

విజయ్ దేవరకొండ..
ఇక్కడ విజయ్ దేవరకొండ పూర్తి బ్లాక్ డ్రస్సులో పోలో నెక్ బ్రాండ్ ను ధరించి కనిపించాడు. ఈ హీరో బ్లాక్ టీషర్ట్ మరియు బ్లేజర్ ధరించి చాలా స్టైలీష్ గా కనిపించాడు. మీరు ఎత్తుగా ఉన్నట్లయితే.. ఇలాంటి డ్రస్సులను చలికాలంలో ట్రై చేయొచ్చు.

రానా దగ్గుబాటి..
బాహుబలిలో భళ్లాలదేవునిగా అందరికీ గుర్తుండిపోయే రానా దగ్గుబాటి.. రీల్ లైఫ్ లోనే రియల్ లైఫ్ లో కూడా ఫ్యాషన్ రంగంలో అందరి కంటే ఒక అడుగు ముందే ఉంటున్నాడు. ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ కలర్ బ్లేజర్, బ్లాక్ కలర్ రౌండ్ నెక్ టీషర్ట్ లో అద్భుతంగా కనిపిస్తున్నాడు. తన డ్రస్సుకు తగ్గట్టే ఖరీదైన వాచ్ ను ధరించాడు.

కెజిఎఫ్ యష్..
KGF సినిమాతో హీరో యష్ అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు. ఈ కన్నడ హీరో కూడా ఫ్యాషన్ విషయంలో అందరితో పోటీ పడేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఇక్కడ బ్లూ కలర్ డ్రస్సులో కనిపించాడు. గుబురు గడ్డంతో.. గోల్డ్ కలర్ వాచ్ తో కొంచెం కొత్తగా కనిపించాడు.

దుల్కర్ సల్మాన్..
ఈ తమిళ హీరో సినిమాలతో పాటు రియల్ లైఫ్ లోనూ ఫ్యాషనబుల్ గా కనిపించేందుకు చాలా ఆసక్తి చూపుతున్నాడు. ఇక్కడ బ్లాక్ రౌండ్ నెక్ టీషర్ట్ అందుకు తగ్గట్టు వెల్వేట్ బ్లేజర్ ధరించి అదిరిపోయే లుక్ లో కనిపించాడు. మొత్తానికి 'టు డై ఫర్' రూపాన్ని ఇచ్చాడు

అల్లు శిరీష్..
అల్లు శిరీష్ ఇటీవలి కాలంలో ఫ్యాషన్ డ్రస్సులతో స్టైలీష్ గా కనిపిస్తున్నాడు. ఇక్కడ బ్లాక్ టీషర్ట్, లైట్ గ్రీన్ ప్యాంటుతో.. జిమ్ బాడీతో అమ్మాయిలను అట్రాక్ట్ చేసేస్తున్నాడు. వీటితో పాటు స్టైలీష్ కళ్లద్దాలు జోడించి.. అందరి చూపు తన వైపు తిప్పుకుంటున్నాడు.



Click it and Unblock the Notifications