Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
Shahid kapoor: బెస్ట్ ఎడ్జీ లుక్ లో ఫ్యాషన్ ఐకాన్ షాహిద్ కపూర్
Shahid kapoor: షాహిద్ కపూర్ ను బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ అనే చెప్పాలి. తన ట్రెండీ లుక్స్ తో ఎప్పుడూ ఫ్యాషన్ ప్రియులను కట్టి పడేస్తుంటాడు. తన సూపర్ కూల్ ఫ్యాషన్... తన అభిమానులతో పాటు ఫ్యాషన్ ను, ట్రెండ్ ను ఫాలో అయ్యే వారికి వీనుల విందు అనే చెప్పాలి. బెస్ట్ ఔట్ ఫిట్ తో క్రేజీగా ఉంటాడు షాహిద్ కపూర్. డ్యాన్స్ పే ఛాన్స్ వంటి అతని సినిమాల నుండి కబీర్ సింగ్ వరకు షాహిద్.. తన నటన పరంగానే కాకుండా ఫ్యాషన్ పరంగా కూడా చాలా మారాడు. ఇంకా ఇంకా మారుతూనే ఉన్నాడు. షాహిద్ కపూర్ ను ఫ్యాషన్ ఐకాన్ అని ఎందుకు అంటారంటే.. అతను కానీ మామూలుగా కనిపించే దుస్తులతో ప్రయోగాలు చేస్తుంటాడు. వాటిని ధరించే చాలా ట్రెండీగా కనిపిస్తాడు. ఫ్యాషన ట్రెండ్ ను ఫాలో అవుతూనే.. తనను తాను ప్రత్యేకంగా కనిపించేలా జాగ్రత్త పడతాడు. అదే అతడిని ఇతరుల నుండి వేరుగా చూపించడంతో పాటు చాలా ట్రెండీగా కూడా కనిపించేలా చేస్తుంది.
మొదటిసారి తెరపై కనిపించిన నాటి నుండి ఇప్పటి వరకు షాహిద్ కపూర్ ఫ్యాషన్ ఇవల్యూషన్ చూస్తే తన స్టైల్ ఏ విధంగా మారుతూ వస్తుంది అనేది గమనించవచ్చు. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ ఉండేలా మెయిన్ టెన్ చేస్తూ వస్తున్నాడు షాహిద్ కపూర్. అతని బెస్ట్ క్రేజీ ఔట్ ఫిట్స్ గురించి ఇప్పుడు చూద్దామా...

స్పైస్ అప్ ది ఫార్మల్స్:
ఫార్మల్స్ లోనూ మంచి ట్రెండింగ్ లుక్ తో కనిపించాడు షాహిద్. ప్యాటర్న్, ప్రింట్ అలాగే కలర్ బ్లాక్ థీమ్ తో ఉన్న ఫార్మల్స్ సూపర్ లుక్ తో కనిపిస్తాయి. ఫార్మల్స్ అనగానే ఎప్పుడూ కొన్ని రంగులు మాత్రమే అందరి మదిలో మెదులుతాయి. కానీ ఆయా కలర్స్ ను కాదని ఫార్మల్స్ తో ఎలాంటి ట్రెండీ లుక్ తీసుకురావాలో షాహిద్ చూపించాడు. ఫ్యాషన్ ఐకాన్ ట్రై చేసిన ఈ స్టైల్ నేటి సొంతం చేసుకోవచ్చు. లేదా ఆన్ లైన్ స్టోర్స్ నుండి వేరొక నమూనాను ఎంచుకుని ట్రెండీగా కనిపించవచ్చు. ఫార్మల్ వేర్ లో చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. అందులో మనకు ఏది నప్పుతుందో చూసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. ఒంటికి సరిగ్గా సరిపోయే ఔట్ ఫిట్ లో ప్రతి ఒక్కరూ సూపర్ కూల్ గా కనిపిస్తారు. మీరూ ట్రై చేయండి.

ది బెస్ట్ ఇన్‌స్పో ఎయిర్ పోర్ట్ లుక్ :
షాహిద్ కపూర్ తన సినీ కెరీర్ ప్రారంభం నాటి నుండి తను ఎప్పుడూ క్యాజువల్స్ ఎక్కువగా ధరించి మాత్రమే కనిపించే వాడు. ఈ క్యాజువల్ లుక్ విమాన ప్రయాణాలు చేసే సమయంలో చాలా ట్రెండీ గా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి షాహిద్ కొన్ని టిప్స్ కూడా ఇస్తున్నాడు. అవి ఏంటంటే.. మంచి లుక్ కావాలంటే నెక్ టీస్ పై నుండి బాంబర్ లేదా పఫర్ జాకెట్ వేసుకోవాలి. వీటికి కార్గో ప్యాంట్ లు సరిగ్గా సరిపోతాయి. అలాగే వైట్ షూస్ ను వీటికి జత చేస్తే అదిరే లుక్ మీ సొంతం అయినట్టే. ఈ ట్రెండీ లుక్ తో అటు ఫ్యాషన్ గా ఉండొచ్చు.. అలాగే కంఫర్ట్ గా కూడా ఉండొచ్చు.

చలి కాలానికి సరిగ్గా సరిపోయే స్టైల్:
రాబోయేది చలికాలం. వర్షాకాలం అయినప్పటికీ ఇప్పుడు కూడా చల్ల చల్లగానే ఉంటోంది. బయటకు వెళ్లాలంటే... స్వెటర్ వేసుకోవాల్సిన పరిస్థితి. చలి నుండి ర.
క్షణ పొందడంతో పాటు స్టైల్ గా ఉండేందుకు షాహిద్ కపూర్ కొన్ని ఫ్యాషన్ సూత్రాలు చెబుతున్నాడు. అవేంటో తెలుసుకుందామా...
ఫాల్ దుస్తులు ధరించడానికి ఇదే సరైన సమయం. చలిని తట్టుకోవడానికి చక్కని హూడీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ట్రెండీగానూ, అదే సమయంలో స్మార్ట్‌గానూ కనిపిస్తుంది. కానీ సాధారణ హూడీని ధరించే బదులు.. కొద్దిగా భారీగా ఉన్న వాటిని ధరించాలి. చూడటానికి క్రేజీ ఫ్యాషన్ గా కనిపిస్తుంది.
షాహిద్ కపూర్ ఫ్యాషన్ ఐకాన్ అని ఎందుకు అంటారు అంటే.. అతను ఫ్యాషన్ దుస్తులను ధరించడానికి ఇష్టపడడు. కానీ మామూలుగా కనిపించే దుస్తులనే చాలా ట్రెండీగా, వెరీ ఫ్యాషనబుల్ గా కనిపించేలా చూసుకుంటాడు. అదే అతడిని ఇతరుల నుండి వేరుగా చూపించడంతో పాటు చాలా ట్రెండీగా కూడా కనిపించేలా చేస్తుంది. షాహిద్ కపూర్ ఎప్పుడూ ట్రెండ్ లతో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అతను తన సినిమాలు, షోలు, ఇన్ స్టాగ్రామ్ అలాగే అవార్డ్ ఫంక్షన్ లలో కొన్ని బెస్ట్ లుక్ లను చూపించాడు.
షాహిద్ కపూర్ ను ఫ్యాషన్ కోసం ఫాలో అయిన వారు అతని గురించి ప్రత్యేకంగా చెబుతారు. తానూ ఫ్యాషన్ ట్రెండ్ ను ఫాలో అవ్వడు.. తాను వేసుకునేది ఏదైనా ట్రెండీగా ఉండేలా చూసుకుంటాడని చెబుతారు. బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి.



Click it and Unblock the Notifications











