For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెన్స్ స్పెషల్ : ఈ ఆయిల్ వాడితే మీ గడ్డం త్వరగా పెరుగుతుందట...!

|

మగవారిలో చాలా మంది గడ్డం త్వరగా పెరగాలని లేదా ఎక్కువగా రావాలని కోరుకుంటూ ఉంటారు. గడ్డం ఎక్కువగా ఉంటేనే తమను అందరూ.. ముఖ్యంగా అందమైన అమ్మాయిలు ఇష్టపడతారని భావిస్తారు. అయితే కొన్నికారణాల వల్ల కొందరిలో గడ్డం సరిగ్గా పెరగకపోవడంతో వారు నిరాత్సాహపడుతూ ఉంటారు.

అయితే ప్రస్తుతం సాధారణ పురుషుల నుండి సినిమా హీరోలు.. స్పోర్ట్స్ స్టార్లందరూ గడ్డాన్ని సైల్ గా పెంచుతూ ట్రెండీగా కనిపిస్తూ ఉన్నారు. అయితే గడ్డం పెంచడం అనేది అంత తేలిక విషయం కాదు. అందుకోసం రకరకాల జాగ్రత్తలు సైతం తీసుకోవాలి.

అలాగే మీ గడ్డం వేగంగా పెరిగేందుకు మరియు ఆరోగ్యకరమైన గడ్డం కొనసాగించేందుకు కొన్ని రకాల ఆయిల్స్ వాడితే ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఆయిల్స్ మీ చర్మ సంరక్షణ మరియు జుట్టు సంరక్షణలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తాయి. దీంతో పాటు మీరు గడ్డంలో అందంగా కనిపించేందుకు ఈ ఆయిల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి...

అమ్మాలు మెచ్చే గడ్డం..

అమ్మాలు మెచ్చే గడ్డం..

ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు గడ్డం ఉన్న మగవారిని తెగ ఇష్టపడుతున్నారు. వారిని గొప్పగా ఊహించుకుంటున్నారు. అయితే ఏ మగాడికైనా శరీరం మరియు పెదాలపై గడ్డం ఉండటాన్ని అమ్మాయిలు ఇష్టపడటం లేదు. పురుషుల గడ్డం అందంగా మరియు సరైన పరిణామ క్రమంలో ఉండటం అనేది చాలా ముఖ్యం. ఇలాంటి గడ్డం ఉన్న మగవారు మహిళలను మంత్రముగ్దులను చేసేస్తున్నారు.

జోజోబా ఆయిల్..

జోజోబా ఆయిల్..

ఇది గడ్డం పెరగడంలో అద్భుతంగా ఉపయోగపడే ఆయిల్. ఇది మీ గడ్డం యొక్క పెరుగుదలతో పాటు గడ్డం కింద దురదను పోగొట్టడంలో సహాయపడుతుంది. ఈ నూనెలో యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు ఉన్నాయి. ఇవి మీ గడ్డం కింద చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. మీ గడ్డాన్ని మరియు చర్మాన్ని తేమగా ఉంచడానికి ఇది ఒక గొప్ప మార్గమనే చెప్పాలి.

దీనిని ఎలా ఉపయోగించాలంటే..

దీనిని ఎలా ఉపయోగించాలంటే..

ఈ గడ్డం చుండ్రు వంటి సమస్యలను కూడా నివారిస్తుంది. ఇది గడ్డాన్ని బలోపేతం చేయడమే కాకుండా... గడ్డం ఆరోగ్యకరంగా ఉండేందుకు సహాయపడుతుంది. దీనిని ఎలా వాడాలంటే ఈ ఆయిల్ ను కొన్ని డ్రాప్స్ (చుక్కలు) తీసుకుని మీ గడ్డం కింద చర్మానికి మెల్లగా మసాజ్ చేయండి. దాన్ని ఒక రాత్రి అంతా అలాగే ఉంచి, ఉదయాన్నే గడ్డం షాంపూ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.

సెడర్ వుడ్ ఆయిల్..

సెడర్ వుడ్ ఆయిల్..

ఈ నూనె మీ గడ్డం ఆరోగ్యాన్ని బాగా మెరుగు పరుస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. ఇది బలమైన క్రిమినాశక మరియు రక్తస్రావ నివారిణి లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది చర్మ ఉత్పత్తిని పరిమితం చేస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది.

అవోకాడో ఆయిల్..

అవోకాడో ఆయిల్..

ఈ ఆయిల్ మీ చర్మం మరియు జుట్టు రెండింటికీ గొప్ప ట్రీట్ మెంట్ అని చెప్పొచ్చు. ఇది మీ చర్మాన్ని పోషకంగా మరియు తేమగా ఉంచుతుంది. అవోకాడో నూనెలలో జుట్టు పెరుగుదలకు అమైనో ఆమ్లాలు మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ గడ్డం క్రింద మరియు చుట్టూ దురదతో పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే, ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి జుట్టు కుదుళ్లను ప్రేరేపిస్తుంది.

సన్ ఫ్లవర్ ఆయిల్..

సన్ ఫ్లవర్ ఆయిల్..

ఈ ఆయిల్ లో విటమిన్ ఎ, బి, సి మరియు ఇ పుష్కలంగా ఉన్నాయి. పొద్దుతిరుగుడు నూనె మీ గడ్డం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఈ నూనెలోని లినోలెయిక్ ఆమ్లం జుట్టు కుదుళ్లను పునరుజ్జీవింపచేయడానికి మరియు గడ్డం యొక్క పెరుగుదలను పెంచడానికి సహాయపడుతుంది. అదనంగా, ఇది మీ గడ్డం తేమగా ఉండటానికి సహాయపడుతుంది.

పుదీనా నూనె..

పుదీనా నూనె..

మగాళ్ల గడ్డం అందంగా కనిపించేందుకు పుదీనా నూనె ఓ అద్భుతమైన వనరు అనే చెప్పాలి. ఈ నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడానికి మరియు ఆరోగ్యకరమైన గడ్డం నిర్వహించడానికి సహాయపడతాయి. పుదీనా నూనె మీ జుట్టును శుభ్రంగా మరియు తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. అందువల్ల, గడ్డం పెరుగుదలకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది.

లావెండర్ ఆయిల్

లావెండర్ ఆయిల్

ఈ ఆయిల్ మీ గడ్డం యొక్క పోషణను పెంచడమే కాక, జుట్టు పెరుగుదలను మెరుగుపరచడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఇది యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ నూనె మీ గడ్డం కింద చర్మాన్ని శుభ్రపరచడానికి మరియు పోషించడానికి సహాయపడుతుంది. అంతే కాదు, ఇది గడ్డం చుండ్రును నివారిస్తుంది.

English summary

Essential Oils To Promote Beard Growth

Here are the list of essential oils to promote beard growth. Read on
Story first published: Thursday, January 30, 2020, 15:59 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more