Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
టాలీవుడ్ హీరోల్లో మోస్ట్ పాపులర్ హెయిర్ స్టైల్స్ పై ఓ లుక్కేయండి...
టాలీవుడ్ లో ఏ నటుడి హెయిర్ స్టైల్ పాపులరో తెలుసుకునేందుకు ఓ లుక్కేయండి.
మనలో ప్రతి ఒక్క మగాడు అందంగా కనిపించేందుకు ప్రధాన కారణం హెయిర్ స్టైల్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయం లేదు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రతి ఒక్క హీరోని కొత్తగా ఆవిష్కరించడంలో హెయిర్ స్టైల్ కీలకపాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

మన టాలీవుడ్ హీరోలు కొత్త స్టైల్ తో వచ్చినప్పుడు అది అభిమానులకు మరియు ప్రేక్షకులకు ఫ్యాషన్ ట్రెండ్ గా మారుతూ ఉంటుంది. అందుకే మన టాలీవుడ్ హీరోలు ప్రతి సినిమాలో కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

అందుకే ప్రతిసారీ వారి హెయిర్ స్టైల్ తో వారికంటూ ఒక ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకుంటారు. అందుకే వారి అభిమాన నటులు హెయిర్ స్టైల్ ను రియల్ లైఫ్ లో చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో ఏయే హీరోల హెయిర్ స్టైల్స్ ట్రెండ్ అయ్యాయో మీరే చూడండి...

రెబల్ స్టార్ ప్రభాస్
బాహుబలి సినిమా అద్భుతమైన విజయం తర్వాత ప్రభాస్ హెయిర్ స్టైల్ చాలా మందిని ఆకర్షించింది. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ అంతకుముందే తన హంక్ పర్సనాలిటీకి ఎక్కువగా పేరుగాంచిన మున్నాలో పొడవాటి జుట్టుతో కొత్త రూపంలో కనిపించాడు. ఆ సమయంలో అది చాలా క్రేజ్ గా కనిపించింది. టాలీవుడ్ లో ప్రయత్నించిన ప్రత్యేకమైన హెయిర్ స్టైల్స్ లో ఇదొకటి. అప్పట్లో ఇది బాగా ట్రెండ్ అయ్యింది. దీంతో పాటు ఛత్రపతి, మిర్చి సినిమాల్లోని ప్రభాస్ హెయిర్ స్టైల్ కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్..
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రతి సినిమాలోనూ ఫ్యాషన్ విషయంలో ట్రెండ్ క్రియేట్ చేస్తుంటాడు. అల్లు అర్జున్ హెయిర్ స్టైల్స్ ప్రతి సినిమాలోనూ ప్రత్యేకంగా ఉంటుంది. అతనికి ఉండే స్ట్రికీ హెయిర్ వల్లే తనకు స్టైలీష్ స్టార్ అనే బిరుదు వచ్చేలా చేసింది. ముందుగా దేశముదురులో సిక్స్ ప్యాక్ బాడీకి తగ్గట్టు హెయిర్ స్టైల్ అప్పట్లో ఓ ట్రెండ్ అయ్యింది. ఆ తర్వాత ఈ హీరో అనేక హెయిర్ స్టైల్స్ లో తన అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, తాజాగా రాబోయే పుష్ప సినిమాలోని అతని లుక్స్ కొన్ని ఉదాహరణలుగా చెప్పొచ్చు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్..
తాతకు తగ్గ మనవడిగా.. తండ్రికి తగ్గ తనయుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో' సినిమాలో కొత్తగా కనిపించిన హెయిర్ స్టైల్ అభిమానులకు పిచ్చెక్కించింది. గుబురు గడ్డంతో బ్రష్ చేసి హెయిర్ స్టైల్ తో ఉన్న ఈ అండర్ కట్ సోషల్ మీడియాలో వైరల్ అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ హెయిర్ స్టైల్స్ అరుదుగా ప్రయోగాలు చేస్తున్నప్పటికీ తన అభిమానులకు తొలిసారి పెద్ద ఆకర్షణగా నిలిచింది. ఆ తర్వాత ఇప్పడు RRRలో మరింత కొత్తగా కనిపించాడు. ఈ హెయిర్ కట్ అతనికి సరికొత్త రూపాన్ని అందించి అందరి మనసులను గెలుచుకుంది.

ప్రిన్స్ మహేష్ బాబు..
ప్రిన్స్ మహేష్ బాబు తన అద్భుతమైన హెయిర్ స్టైల్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. నేనొక్కడినే(No.1) సినిమాలో కొత్త హెయిర్ స్టైల్ తో కనిపించాడు. టోస్ట్ బాడీతో, చిన్నగా ఉన్న జెల్ అప్ హెయిర్ స్టైల్ తో రాక్ స్టార్ రూపాన్ని క్రియేట్ చేశాడు. అతిథి, ఖలేజా సినిమాల్లో మరో ప్రత్యేక శైలిని ఫాలో అయ్యాడు. ఆ మధ్య పొడవాటి జుట్టు ఎర్రని రంగులో ఉండే హెయిర్ స్టైల్ అందరిపై మంచి ప్రభావమే చూపింది. ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన సర్కారు వారి పాటలోనూ ఇలాంటి రూపమే కనిపించింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..
మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన హెయిర్ స్టైల్స్ ను ఎప్పటికప్పుడూ మారుస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క సినిమాలో డిఫరెంట్ లుక్స్ లో కనిపించి అభిమానులను అలరిస్తున్నాడు. రామ్ చరణ్ హెయిర్ స్టైల్స్ ప్రత్యేకంగా చెప్పాలంటే ‘గోవిందు అందరివాడేలే' సినిమాలో లుక్ గుర్తుకొస్తుంది. పొడవాటి జుట్టుతో వెనుక చిన్న పోనీటైల్ తో, చెర్రీ ఫంకీ మరియు స్టైలీష్ గా కనిపించాడు. ఇది చాలా మందిని ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా RRRలో మళ్లీ కొత్తగా కనిపించాడు. వీటితో పాటు ‘చిరుత', ‘ఆరెంజ్' సినిమాలోని లుక్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి.

ఎనర్జిటిక్ స్టార్ రామ్..
దేవదాస్ తో సినిమా వెండితెరపై వెలిగిన యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ ‘ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమాలో కొత్త హెయిర్ స్టైల్ తో కనిపించి అందరి ద్రుష్టిని ఒక్కసారిగా ఆకట్టుకున్నాడు. ఇది బాగా ట్రెండీగా నిలిచింది. దీంతో పాటు ‘కందిరీగ', ‘పండగ చేస్కో' సినిమాల్లోని హెయిర్ స్టైల్స్ మరచిపోలేనివి.

కింగ్ నాగార్జున..
కింగ్ నాగార్జున దక్షిణ భారతదేశంలోనే మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ గా తరచుగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే అతని వయసు రోజురోజుకు తగ్గుతున్నట్టు.. అందం మరింత పెరుగుతున్నట్టు కనిపిస్తాడు. అందుకు ప్రధాన కారణం తన హెయిర్ స్టైల్. ‘ఆవిడ మా ఆవిడే మరియు ‘సూపర్' లో నాగార్జున హెయిర్ స్టైల్స్ చాలా ప్రత్యేకమైనవి. వీటితో పాటు ‘గ్రీకు వీరుడు'తో కనిపించిన హెయిర్ స్టైల్ అప్పట్లో టాలీవుడ్ లో సంచలన పరిచయంగా నిలిచింది. ఆ తర్వాత మన్మథుడు-2లోనూ మరింత కొత్తగా కనిపించారు.

విజయ్ దేవర కొండ..
‘పెళ్లి చూపులు' సినిమాలో సింపుల్ హెయిర్ కట్ తో కనిపించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత వచ్చిన ‘అర్జున్ రెడ్డి'తో తనలోని విలక్షణ నటుడ్ని బయటపెట్టారు. ఆ సినిమాలో ముఖం నిండా గడ్డం, రింగు రింగుల జుట్టుతో బుల్లెట్ బండిపై జర్నీ చేస్తున్న లుక్ అదిరిపోయింది. టాలీవుడ్ లో అది ఒక ట్రెండ్ లా మారిపోయింది. చాలా మంది యూత్ ఈ హెయిర్ స్టైల్ ఫాలో అయ్యారు. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందంలో, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల్లో స్టైలీష్ హెయిర్ స్టైల్స్ తో ఆకట్టుకున్నారు.

దగ్గుబాటి రానా..
బాహుబలి సినిమాతో ప్రభాస్ తో సమానంగా నటించిన రానా దగ్గుబాటి హెయిర్ స్టైల్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. అయితే అంతకుముందే రానా ‘నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో రాజకీయ నాయకుడి హెయిర్ స్టైల్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ‘లీడర్' సినిమాలో చాలా సింపుల్ గా కనిపించాడు. రానా ఈ లుక్స్ చాలా మందిని తెగ ఆకట్టుకున్నాయి.



Click it and Unblock the Notifications











