Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ఈ టిప్స్‌తో చీప్ బట్టలతో కూడా రిచ్‌గా కనిపించొచ్చు.. అమ్మాయిల చూపంతా మీపైనే ఉండడం గ్యారెంటీ!
ఫ్యాషన్ అంటే ఖరీదైన వస్తువులు, బ్రాండెడ్ దుస్తులే అన్న భ్రమ చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి వారు ట్రెండ్‌ని అనుసరించాలంటే ఖర్చుతో కూడిన పని అని భావిస్తారు. కానీ ఫ్యాషన్ నిపుణుల మాటలలో చెప్పాలంటే "రిచ్ లుక్ అనేది ధర కాకుండా, ప్రెజెంటేషన్ మీద ఆధారపడి ఉంటుంది." అందుకే, పెద్దగా ఖర్చు లేకుండానే, ఎప్పటికప్పుడు క్లాస్‌గా కనిపించాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఈ స్టోరీలో ఎలాంటి చిట్కాలు పాటిస్తే తక్కువ ధరల్లో బట్టలు కొనుకున్నా రిచ్‌గా కనిపించగలమో తెలుసుకుందాం.
విలువ బ్రాండులో కాదు.. ఎంపికలో ఉంది
ఒక ఖరీదైన బ్రాండెడ్ షర్ట్ కన్నా, నీటిగా ఇస్త్రీ చేసిన, లేత రంగుల్లోని సింపుల్ షర్ట్ వేసుకుంటే మీరు మరింత ఆకర్షణీయంగా కనిపించవచ్చు. ఎందుకంటే, మంచి డ్రెస్సింగ్ అనేది మనకు ఉన్న 'సెన్స్ ఆఫ్ సెలెక్షన్'తోనే రూపొందుతుంది. రంగుల ఎంపిక, కట్టే శైలి, మరియు ప్రెజెంటేషన్ అన్నీ కలిపి మన లుక్‌ను నిర్ణయిస్తాయి.

బ్రాండ్ లేకపోయినా బెస్ట్‌గా కనిపించాలంటే...
లేత రంగుల ఎంపిక
- సాఫ్ట్ టోన్‌లలోని దుస్తులు ఎప్పుడూ క్లాస్‌గా కనిపిస్తాయి. అవి నెమ్మదిగా గ్లో ఇచ్చే లుక్‌ను ఇస్తాయి. ముదురు రంగులు అయితే కొన్నిసార్లు గాఢంగా, ఓవర్ షాడో చేసేలా కనిపించవచ్చు.
ఫ్యాబ్రిక్ క్వాలిటీపై దృష్టి పెట్టండి
- కాటన్, లినెన్ వంటి మెత్తటి, శుభ్రంగా కనిపించే దుస్తులు ఎక్కువ గ్రేస్ ఇస్తాయి. కృత్రిమ పదార్థాలు కొన్నిసార్లు చౌకగా కనిపించవచ్చు. అందుకే మంచి ఫ్యాబ్రిక్ ఉన్న దుస్తులను ఎంచుకోవడం ముఖ్యం.
సులభమైన క్లాసీ యాక్సెసరీస్
- సింపుల్ వాచ్, చిన్న మెటల్ చెయిన్ లాంటి యాక్సెసరీస్ మీ లుక్‌కి స్టైల్ జోడిస్తాయి. మిగిలినవి అలవాటైనవి కాకుండా, ఒకటి రెండు స్టేట్మెంట్ పీసులు ఉంటే చాలు.
శుభ్రత
- వేసుకునే చెప్పులు, బ్యాగులు, కళ్లద్దాలు వంటివి పరిశుభ్రంగా ఉండాలి. ఇవి చిన్నవి అనిపించవచ్చు, కానీ మొత్తం లుక్‌ను ప్రభావితం చేస్తాయి.
సహజత్వం మీద ఫోకస్
- భారీ మేకప్ లేకుండా సహజంగా ఉండే లుక్ ఎక్కువ మన్నింపు పొందుతుంది. స్కిన్ కేర్ మీద కాస్త శ్రద్ధ పెడితే, మీ ఛాయ మరింత అందంగా కనిపిస్తుంది.
చిరునవ్వు & బాడీ లాంగ్వేజ్
- ముఖం మీద చిరునవ్వు, నిగారింపుగా నడక, నమ్మకంతో మాట్లాడటం - ఇవే నిజమైన రిచ్ లుక్‌కి కీలకమైన అంశాలు. ఇవి వేషధారణ కంటే ఎక్కువ ప్రభావం చూపుతాయి.
మాటల తీరూ ఓ స్టైల్
- మృదువైన మాటలతో, మర్యాదగా స్పందించడం కూడా మీ వ్యక్తిత్వాన్ని ఎలిగెంట్‌గా చూపించగలదు. మాటల్లో ఉన్న గౌరవం, స్టైల్‌గా మారిపోతుంది.
ఫ్యాషన్‌కి విలువ
చాలామంది రిచ్ లుక్ అనగానే దుస్తుల ధర గురించి ఆలోచిస్తారు. కానీ నిజంగా విలువైనది ఏమిటంటే దానిని ధరిస్తున్న వ్యక్తిలోని ధైర్యం, ఆత్మవిశ్వాసం, మరియు ప్రెజెంటేషన్. ఒక్క రూ.500 డ్రెస్‌ని మీరు రూ.5,000ల లుక్‌లా మార్చగలిగితే, అదే నిజమైన ఫ్యాషన్ టేస్ట్.
చివరగా
కాస్ట్ కాదు... క్లాస్ ముఖ్యం. బ్రాండ్ల జోలికి పోకుండా సరైన ఎంపికలు చేస్తే, మీ ఆత్మవిశ్వాసంతో పాటు స్టైల్‌కి కూడా వేదికగా మారతాయి. అందుకే, రిచ్‌గా కనిపించాలంటే పెద్ద ఖర్చు అవసరం లేదు. అవసరమైనది కేవలం మంచి టేస్ట్, ప్రెజెంటేషన్, మరియు చిరునవ్వు మాత్రమే!



Click it and Unblock the Notifications