Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
RRR Fashion:తారక్, చెర్రీ డ్రస్సుల్లో ఏవి బాగున్నాయో మీరే చెప్పండి...
RRR ప్రమోషన్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ డ్రస్సుల్లో ఏవి అద్భుతంగా ఉన్నాయో చూడండి.
RRR సునామీ రావడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. తారక్, మెగా పవర్ స్టార్ అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఎందుకంటే ఈ సినిమా విడుదల ఇప్పటికే నాలుగైదు సార్లు విడుదల పడుతూ వచ్చింది. ఫైనల్ గా మార్చి 25వ తేదీన శుక్రవారం బెనిఫిట్ షోతో ప్రారంభమవుతుంది.

ఇదిలా ఉండగా.. 2022లో 'ఆర్ఆర్ఆర్' సినిమా డేట్ ఫిక్స్ అయ్యాక జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎస్ఎస్ రాజమౌళి చేసిన ప్రమోషన్స్ అందరి ద్రుష్టిని ఆకర్షించాయి. అసలు గ్యాప్ అనేదే లేకుండా ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు జర్నీలు చేశారు.

ముందుగా హైదరాబాద్ లో ఇంటర్వ్యూలతో ప్రారంభించి.. కర్నాటకలో ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి రేకెత్తించారు. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో తారక్, రాజమౌళి మధ్య డ్రస్సుల మధ్య ఓ ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఆ సీన్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పలు ఇంటర్వ్యూలు, ఈవెంట్లలో వేసుకున్న కూల్, స్టైలీష్ డ్రస్సులతో రియల్ లైఫ్ లోనూ హీరోలుగా కనిపించారు. ఆ డ్రస్సులపై మనం ఇప్పుడు ఓ లుక్కేద్దాం...

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రతి సందర్భంలోనూ తమ రూపాలను సున్నితంగా, సౌకర్యవంతంగా, సరళంగా ఉండేలా చూసుకున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో విభిన్న స్టైల్స్ ను ప్రయత్నించారు.

ఈ ఇద్దరూ హీరోల లుక్స్ ను గమనిస్తే.. జూనియర్ ఎన్టీఆర్ చాలా స్టైలీష్ గా ఉండేందుకు ఇష్టపడుతున్నాడని చెప్పొచ్చు. మీడియాతో ఇంటర్వ్యూల కోసం స్వెట్ షర్టులు, హూడీలు మరియు ఫుల్ ఓవర్లలో ఉన్న డ్రస్సులను వేసుకున్నాడు. అయితే రామ్ చరణ్ మాత్రం చాలా సింపుల్ గా ఉండేందుకు ప్రియారిటీ ఇచ్చినట్లు చెప్పొచ్చు.

ఫుట్ వేర్ విషయంలో..
తారక్, చెర్రీలు కేవలం డ్రస్సుల పరంగానే కాదు.. ఫుట్ వేర్ విషయంలోనూ చాలా కేరింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీటిలో కొన్ని హై-ఎండ్ బ్రాండ్స్ మాత్రమే ఉన్నాయి. వీరిద్దరూ ప్రతి ఒక్క ఈవెంట్లో కొత్తగా కనిపించేందుకు చాలా ఉత్సాహం కనబరిచారు. ప్రతి చోటా చురుగ్గా ఉండి అందరినీ అలరించారు.

ముంబై ఈవెంట్లో..
ముంబై ఈవెంట్లో సినిమా ప్రమోషన్లో భాగంగా ధరించిన జాకెట్లు, బ్లేజర్లు మాత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి.

ఆధ్యాత్మిక ప్రదేశాల్లో..
తారక్, చెర్రీ కేవలం స్టైలీష్ డ్రస్సుల్లోనే కాదు.. ఆధ్యాత్మిక ప్రాంతాలైన గోల్డెన్ టెంపుల్, వారణాసి కాశీ విశ్వనాథ్, గంగా నదికి వెళ్లినప్పుడు సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పంజాబ్ లో కుర్తాలు ధరించగా.. గంగా నది హారతి సమయంలో పూజ సందర్భంగా సల్వార్ తో కూడిన పాస్టెల్ పసుపు చొక్కా ధరించగా.. రామ్ చరణ్ డార్క్ ఎల్లో కలర్ షర్ట్ ధరించి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

అమీర్ ఖాన్ తో కలిసి..
అమీర్ ఖాన్ తో నాటు నాటు స్టెప్ వేసే సమయంలో చాలా స్టైలీష్ గా కనిపించారు తారక్ అండ్ చెర్రీ. ఈ ఫొటోలో తారక్ బ్లాక్ ప్యాంటుకు లైట్ గ్రీన్ కలర్ షర్ట్, స్టైలీష్ వాచ్, బ్రౌన్ కలర్ ఫుట్ వేర్ యాడ్ చేయగా.. రామ్ చరణ్ మాత్రం లైట్ బ్లాక్, వైట్ స్వెట్ షర్ట్, చేతికి సింపుల్ వాచ్ తో చాలా సింపుల్ గా కనిపించారు.

కర్నాటక ఈవెంట్లో..
కర్నాటక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగా పవర్ స్టార్, జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముందుగా తారక్ డ్రస్సు విషయానికొస్తే.. టాప్ టు బాటమ్ బ్లాక్ డ్రస్సు వేసుకుని.. దానిపై డార్క్ రోజ్ కలర్ షర్ట్, స్టైలీష్ గాగూల్స్, వాచ్ తో అదరగొట్టాడు. రామ్ చరణ్ కూడా తారక్ తో ఫ్యాషన్ విషయంలో పోటీ పడ్డాడనే చెప్పొచ్చు. తను కూడా స్టైలీష్ కళ్లజోడుతో పాటు మొత్తం మూడు రంగుల్లో ఉండే డ్రస్సును ధరించాడు.

కోల్ కత్తాలో..
కలకత్తా నగరంలో ఆర్ఆర్ఆర్ టీమ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ కూడా ఎన్టీఆర్ టాప్ టు బాటమ్ బ్లాక్ డ్రస్సు వేసుకోగా.. మధ్యలో వైట్ టీ షర్ట్, స్టైలీష్ కళ్లజోడుతో కొత్తగా కనపించగా.. తారక్ మాత్రం రెడ్ షర్ట్, స్టైలీష్, సింపుల్ గాగూల్స్ తో ముగించాడు.

గుజరాత్ లో..
గుజరాత్ నగరంలో మాత్రం ఎన్టీఆర్ డార్క్ బ్లూ షర్ట్, బ్రౌన్ కలర్, కళ్లజోడు వేసుకుని వైట్ ఫుట్ వేర్ లైట్ గ్రీన్ కలర్ ష్టర్ వేసుకున్న రామ్ చరణ్ తో చేతులు కలిపి దిగిన ఫొటో ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.
RRR సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్లను, పాటలను ఇటీవలే విడుదల చేశారు. వీటికి సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభిస్తోంది.
RRR సినిమా సినిమా డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమాతో తెలుగు సినీ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప దర్శకుడు. ఈయన క్రియేటివిటీ చూసి బాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయింది. ఇక సంగీత దర్శకులుగా ఎమ్.ఎమ్.కిరవాణీ అద్భుతమైన స్వరాలను సమకూర్చారు.
ఈ సినిమాలోనూ కాస్ట్యూమ్ డిజైనర్ గా రమా రాజమౌళి పని చేస్తున్నారు. రాజమౌళి తీసే ప్రతి సినిమాలో దాదాపు ఈమెనే కాస్ట్యూమ్ డిజైన్లను పర్యవేక్షిస్తారు.



Click it and Unblock the Notifications











