Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
RRR హీరో రామ్ న్యూ లుక్ కిరాక్.. నిహారిక సంగీత్ వేడుకలో చెర్రీ బ్లాక్ డ్రెస్ హైలెట్...
నిహారిక సంగీత్ వేడుకలో బ్లాక్ డ్రెస్ లో హెలైట్ గా నిలిచిన రామ్ చరణ్ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి.
కరోనా వంటి కష్టకాలంలో కూడా కళ్యాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు లాక్ డౌన్ ఉన్నప్పటికీ వరుసగా వివాహాలు చేసుకుంటూ బ్యాచ్ లర్ లైఫ్ కు బాయ్ చెప్పారు.

ఇక మన టాలీవుడ్ లో అయితే ఈ ఏడాది పెళ్లిళ్లకు సంబంధించి చాలా ప్రాధాన్యత ఏర్పడిందనే చెప్పాలి. దీనికి ప్రధాన కారణం ప్రొడ్యూసర్ దిల్ రాజ్ వివాహం, హీరో నిఖిల్, జబర్దస్త్ మహేష్ తో పాటు రానా నిశ్చితార్థం, సింగర్ సునీతా నిశ్చితార్థం, నిహారిక నిశ్చితార్థం తాజాగా సంగీత్ కార్యక్రమాలతో అత్యంత ఖరీదైన పెళ్లిళ్లుగా రికార్డులకెక్కాయి.

వీరిలో ఒకరు హైదరాబాదులో పెళ్లి చేసుకోగా.. మరొకరు ఉదయ్ పూర్ ప్యాలెస్ లో కళ్యాణం చేసుకోవడం గమనార్హం. అయితే ఈ ప్రముఖల పెళ్లిళ్లు మాత్రమే కాదు.. వారు అతిథులకు, పలువురు మిత్రులకు ఇచ్చే మర్యాదలు, సత్కారాలు కూడా అత్యంత ప్రాధాన్యాన్నిసంతరించుకున్నాయి.

ముఖ్యంగా ఒక్కో జంట దాదాపు రెండు నుండి మూడుసార్లు వివిధ ప్రదేశాల్లో రిసెప్షన్స్ ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వీటన్నింటి సంగతి పక్కనబెడితే RRR హీరో రామ్ చరణ్ నిహారిక సంగీత్ వేడుకలో హైలెట్ నిలిచాడు. నిహారిక, చైతన్య వివాహానికి కొన్ని గంటల ముందు రామ్ చరణ్ తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని అద్భుతమైన ఫొటోలను పంచుకున్నాడు.

వాటిలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి దిగిన సెల్ఫీ అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.ఇప్పటికే కొణిదెల నిహారిక సంగీత్, అల్లు వారి ఫ్యామిలీ, కొణిదెల కుటుంబానికి సంబంధించిన సంగీత్ ఫొటోలు ట్రెండింగులో ఉన్నాయి. ముఖ్యంగా #Nischay అనే హ్యాష్ ట్యాగ్ ఈ ఉదయం నుండి ట్రెండింగులోనే ఉంది.

అంతకుముందు అల్లుఅర్జున్ తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇక అసలు విషయానికొస్తే.. తన జీవితంలో ఏ చిన్న మూమెంట్ అయినా అభిమానులతో పంచుకునే చెర్రీ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. తాజాగా నిహారిక వివాహ వేడుకలో అద్భుతమైన డ్రెస్ తో రామ్ చరణ్ అందరి కంటే హైలెట్ గా నిలిచాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఉదయ్ పూర్ ప్యాలెస్ లో బ్లాక్ కోట్ లో సరికొత్త డిజైన్ న్యూ లుక్ లో నవ్వుతూ కనిపించిన ఫొటోను తాజాగా షేర్ చేశాడు.

ఈ ఫొటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ బ్లాక్ డ్రెస్ కు కింద భాగంలో చివరి అంచున మ్యాచింగ్ క్లాత్ కొంచెం రెడ్ అండ్ వైట్ పెట్టడంతో లుక్ అదుర్స్ అనిపిస్తోంది. ఇక తన గ్రే కలర్ ప్యాంట్ కు, మ్యాచింగ్ షూస్, అద్భుతమైన మీసం కట్, స్టైలిష్ షేవింగుతో అసలైన హీరోలా కనిపిస్తున్నాడు రామ్.

ఈ ఫొటోను చూసిన మెగా అభిమానులు రామ్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కావాలంటే ఆ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి.



Click it and Unblock the Notifications