For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Super Star : రజనీకాంత్ లా రాకింగ్ స్టైల్ లో కనిపించాలంటే... ఈ చిట్కాలు ఫాలో అవ్వండి...

|

రజనీకాంత్ అంటే ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు.. అంతేకాదు రజనీ పేరుకు తగ్గట్టు ఎల్లప్పుడూ రాకింగ్ స్టైల్ లో కనిపిస్తుంటారు. ఈయన చిత్ర పరిశ్రమకు సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా రజనీకాంత్ కు 'దాదా సాహేబ్ ఫాల్కే'అవార్డుతో ఘనంగా సత్కరించింది.

వెండితెరపై రజనీకాంతుడు ప్రతిసారీ చాలా కొత్తగా కనిపిస్తారు. పురాణాల్లో విష్ణుమూర్తి దశవాతరాల్లో కనిపిస్తే.. అంతకుమించిన అవతారాల్లో రజనీ కనిపిస్తాడు. చిన్న కళ్లతో రోమియో లుక్స్.. 1970ల్లోనే బెల్ బాటమ్ జీన్స్, హిప్పీ క్రాఫ్ తో అప్పట్లో ట్రెండ్ క్రియేట్ చేసిన ఈ హీరో.. ఇప్పటికీ తన హెయిర్ స్టైల్.. ఫ్రెంచ్ కట్ గడ్డం, తలకు స్పార్ప్ తో కనిపించి.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఇక రజనీ పోలీస్ డ్రస్ వేసుకుంటే.. తన ఫేస్ పూర్తి గాంభీర్యంగా మారిపోతుంది. అసలైన పోలీస్ అంటే ఇలానే ఉండాలి అనేంతలా మారిపోతాడు. అంతేకాదండోయ్ అద్వితీయమైన కళ్లద్దాలు, సిల్వర్ హెయిర్, బ్లాక్ బ్రష్డ్ హెయిర్, పింక్ కలర్ పెదాలు..

అసలే మాత్రం వెంట్రుకలు లేకుండా గుండు బాస్ లా కూడా అదరగొట్టాడు మన శివాజీ. మీరు కూడా రజనీలా స్టైలీష్ గా కనబడాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.

Virat kohli:కెప్టెన్ కోహ్లీలా కొత్తగా కనబడాలంటే.. ఇలా ట్రై చేయండి...

పర్ఫెక్ట్ స్టైల్..

పర్ఫెక్ట్ స్టైల్..

ఒకప్పుడు కుర్ర హీరోలంతా సిక్స్ ప్యాక్ లతో వెండితెరను ఓ ఊపు ఊపుతుంటే.. రజనీకాంత్ మాత్రం తన ఎవర్ గ్రీన్ స్టైల్ తోనే ఆ పోటీని తట్టుకున్నారు. ఎందుకంటే యువ హీరోలకు సాధ్యం కాని మ్యాజిక్ రజనీ స్టైల్. తన బాడీ లాంగ్వేజ్, డైలాగులతో అందరినీ ఆకట్టుకున్నాడు. నిజ జీవితంలో చాలా సింపుల్ గా ఉండే రజనీ.. వెండితెరపై మాత్రం అనేక రకాల స్టైల్స్ ను ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు.

సెవెంటీనేజర్..

సెవెంటీనేజర్..

రజనీకాంత్ ఏడు పదుల వయసు దాటినా.. వెండి తెరపై కుర్రకారుకు గట్టిగా పోటీ ఇస్తాడు. పేట సినిమాలో తండ్రి పాత్రలో నటించిన ఈ ఫొటో చూస్తే.. రజనీకాంత్ కు ఇంకా మూడు పదుల వయసే అన్నంత అందంగా కనిపిస్తారు. తను వేసే డ్రస్సులు ఇతరుల్లో ఇంప్రెషన్ కలిగేలా ఉంటాయి. కాబట్టి మీరు కూడా వాతావరణానికి తగ్గట్టు డ్రస్సులు సెలెక్ట్ చేసుకోవాలి.

సింపుల్ గా కనిపించాలి..

సింపుల్ గా కనిపించాలి..

మనలో చాలా మంది వారి బాడీ ఫిట్ గా లేనప్పటికీ.. ఫ్యాషన్ పేరిట మోడ్రస్ డ్రస్సులు వేస్తుంటారు. అలా వేసుకోవడం వల్ల చూసే వారికి చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అంతేకాదు మిమ్మల్ని చూసి చాలా మంది నవ్వుకుంటారు. ఈ వయసులో అలాంటి డ్రస్సులు ఏంటి అని అనుకుంటారు. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు సింపుల్ డ్రస్సులు వేయండి.

రోటీన్ గా వద్దు..

రోటీన్ గా వద్దు..

చాలా మంది మగవారు రెగ్యులర్ గా రోటీన్ డ్రస్సులు వేసుకుంటూ ఉంటారు. మరికొందరు బట్టలు ఉతకకుండా వేసుకుంటూ ఉంటారు. ఇలాంటి అలవాట్లను ఎంత త్వరగా వీలైతే.. అంత త్వరగా మానేయండి. సాధ్యమైనంత వరకు కొత్త బట్టలను లేదా ఉతికిన బట్టలను వేసుకోండి. మీకు ఎంత ఫేవరేట్ డ్రస్ అయినా.. పాతబడిన తర్వాత వాటిని పక్కనబెట్టేయండి. అలాగే మీ బాడీని బట్టి కాంబినేషన్ డ్రస్సును సెలెక్ట్ చేసుకోవాలి.

మంచి హెయిర్ కోసం..

మంచి హెయిర్ కోసం..

మగవారిలో చాలా మంది తమకు అందమైన జుట్టు కావాలని ఆశపడుతూ ఉంటారు. అందుకోసం అనేక రకాల ఉత్పత్తులు వాడుతూ ఉంటారు. అయితే మీరు ఆరోగ్యకరమైన మరియు అందమైన జుట్టు కావాలంటే మాత్రం కొన్నిసార్లు మీ లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవాలి. దీని వల్ల ఫలితం చాలా వేగంగా వస్తుంది. ముఖ్యంగా చలికాలంలో వేడి నీటిస్నానం ఎక్కువగా చేయకండి. జుట్టుకు నూనె పెట్టడం మరువకండి. బాగా ట్రిమ్ చేసుకోండి. స్టైలింగ్ టూల్స్ వద్దు. మంచి ఆహారం తీసుకోండి.

English summary

Super Star Rajnikanth Infallible Style Tips in Telugu

Here are the super star rajanikanth infallible style tips in Telugu. Have a look
Story first published: Tuesday, October 26, 2021, 17:05 [IST]