Latest Updates
-
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్
Hbday Prabhas: ‘రాధే శ్యామ్ ’ హీరో ప్రభాస్ లేటెస్ట్ హెయిర్ స్టైల్స్ పై ఓ లుక్కేయండి...
రాధే శ్యామ్ హీరో ప్రభాస్ లేటెస్ట్ హెయిర్ స్టైల్స్ పై ఓ లుక్కేయండి.
యంగ్ రెబల్ స్టార్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అంతేకాదు.. ఆసియాలోనే మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు.

ప్రతి సినిమాలో విభిన్నమైన పాత్రలు చేస్తూ.. నటనలో తానేంటో నిరూపించుకున్నాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. తన అభిమానులు నిత్యం తన స్టైల్ ను ఫాలో అవుతున్నారు. ప్రభాస్ తాజాగా 'రాధే శ్యామ్'లో పూజా హెగ్డేతో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని పోస్టర్లు కూడా విడుదల చేశారు.

ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తన హెయిర్ స్టైల్ కూడా మార్చేశాడు. ఈసారి అన్ని సినిమాల్లో కంటే చాలా డిఫరెంట్ హెయిర్ స్టైల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అక్టోబర్ 23వ తేదీన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ హీరో ఇప్పటివరకు ఎలాంటి హెయిర్ స్టైల్స్ లో కనిపించారు.. ఏ లుక్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడో చూసేద్దాం రండి...

లేటెస్ట్ హెయిర్ స్టైల్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా పూజా హెగ్డేతో కలిసి నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లలో చాలా స్టైలీష్ గా కనిపించాడు. ఇక ఈ సినిమాలో స్పాట్ హెయిర్.. కలర్డ్ హెయిర్ స్టైల్ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ లుక్ లో ప్రభాస్ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. లవ్ స్టోరీ ఆధారంగానే ఈ సినిమా వెండితెర మీద విడుదలవ్వనుంది.

డార్లింగ్ ప్రభాస్ క్రూ కట్..
డార్లింగ్ సినిమాలో ప్రభాస్ ట్రెడిషన్ క్రూ కట్ లో చాలా కొత్తగా కనిపించారు. ఈ లుక్ చాలా పాతదే. అయినప్పటికీ ఈ హెయిర్ స్టైల్ లోనే కనిపించాడు. ఎందుకంటే దీని గురించి చాలా మందికి తెలియదు. ఈ హెయిర్ కట్ లో హీరో ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు.

కర్లీ హెయిర్..
ప్రభాస్ అప్పటివరకు తీసిన సినిమాల్లో రకరకాల హెయిర్ స్టైల్స్ లో కనిపించాడు. కానీ బాహుబలి సినిమాలో మాత్రం పొడవాటి జుట్టు.. రింగు రింగుల జుట్టుతో చాలా కొత్తగా కనిపించాడు. రాజమౌళి కూడా ప్రభాస్ బాడీకి తగ్గట్టు హెయిర్ స్టైల్ పై చాలా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. ఈ ఒక్క లుక్ ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది. ఈ హెయిర్ స్టైల్ లో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించాడు.

స్టైలిష్ లుక్..
హీరో ప్రభాస్ ఇప్పటివరకు చాలా హెయిర్ స్టైల్స్ ను మార్చాడు. అయితే వీటిలో చాలా మంది ఇష్టపడే హెయిర్ స్టైల్స్ లుక్ లో లాన్ ఆన్ ఫోర్ హెడ్ లుక్ ముందు వరుసలో ఉంటుందని చెప్పొచ్చు. ఈ హెయిర్ స్టైల్ లో ప్రభాస్ నుదుటి మీద ఓ రింగు చుట్టాడు. ఈ హెయిర్ స్టైల్ ఒకప్పుడు శోభన్ బాబు చుట్టేవారు. కానీ తనకు.. హీరో ప్రభాస్ కు చాలా తేడా ఉంది. అప్పట్లో శోభన్ బాబు రింగ్ హెయిర్ స్టైల్ కొత్తగా అనిపిస్తే.. ఇప్పట్లో ప్రభాస్ హెయిర్ స్టైల్ కూడా మరింత కొత్తగా.. లేటెస్ట్ గా కనిపిస్తుంది. ఈ లుక్ లో ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తాడు.

బిల్లా సినిమాలో మెస్సీ స్టైల్..
అనుష్క, నమితతో కలిసి నటించిన బిల్లా సినిమాలో ప్రభాస్ మెస్సీ హెయిర్ తో అలరించాడు. ఈ సినిమాలో డబుల్ రోల్ చేసిన ప్రభాస్ రెండు హెయిర్ స్టైల్స్ లో కనిపించాడు. ఒకటేమో ఫుల్ క్లాస్.. మరొకటి ఫుల్ మాస్. ఓ పాత్రలో డాన్ గా ఉన్నప్పటికీ.. చాలా క్లాస్ గా మెస్సీ హెయిర్ కట్ తో కనిపించాడు. ఈ హెయిర్ స్టైల్ స్టైలీష్ గా కనిపించిన లుక్స్ ఎందరో అమ్మాయిలు ఫిదా అయిపోయారు. మరో పాత్రలో దొంగగానూ కర్లీ హెయిర్ కట్ తో అలరించాడు.
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 1979 అక్టోబర్ 23వ తేదీన జన్మించారు.



Click it and Unblock the Notifications
