Latest Updates
-
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త!
Tollywood Fashion:వివాహా వేడుకల్లో మీరూ హీరోలా కనిపించాలంటే...?
వెడ్డింగ్ సీజన్లో ఎలాంటి డ్రస్సుల్లో ధరిస్తే అందంగా కనిపిస్తారో టాలీవుడ్ హీరోలను చూస్తే తెలుస్తుంది.
పెళ్లి అనే ముఖ్యమైన ఘట్టం వల్ల ఇద్దరు వ్యక్తులే కాదు.. రెండు కుటుంబాలు కూడా ఒక్కటవుతాయి. అందుకే వివాహ వేడుక అంటేనే కొన్ని రోజుల ముందు నుంచే ఇరు కుటుంబాల్లో హడావుడి మొదలవుతుంది. సాధారణంగా కళ్యాణం.. కమనీయం వంటి కార్యక్రమాల్లో అమ్మాయిలు కట్టుకునే చీరలు కొనడం.. దానికి మ్యాచింగ్ డిజైనర్ బ్లౌజులు కుట్టించుకోవడం, నచ్చిన ఆభరణాలను వేసుకోవడం సాధారణమే. ఇలా పెళ్లికి కొన్ని నెలల ముందు నుంచే అంతా హడావుడిగా ఉంటుంది. ఇదంతా ఒకవైపు.. మరోవైపు ఈ పెళ్లిళ్ల సమయంలో పురుషుల్లో డ్రస్సుల్లో కాస్త టెన్షన్, మరికాస్త అయోమయంగా అనిపిస్తూ ఉంటుంది.

ఎందుకంటే పెళ్లి వేడుకలో తాము దరించే డ్రస్సులు అందరికి నచ్చుతాయా లేదా? తాము అందంగా కనిపిస్తామా లేదా? తమ డ్రస్సుకు తగ్గట్టు జ్యువెలరీ సెట్ అవుతుందా అనిపిస్తుంది. ఈ సందేహాలన్నీ తొలగిపోవాలంటే.. మీరు వివాహ వేడుకలో అందరి కంటే ప్రత్యేకంగా కనిపించాలంటే.. ప్రముఖ టాలీవుడ్ హీరోలు విజయదేవరకొండ, దుల్కర్ సల్మాన్, అల్లుశిరీష్ ఫాలో అయిన ఫ్యాషన్ డ్రస్సులపై ఓ లుక్కేయండి.. మీరు కూడా కొంచెం కొత్తగా కనిపించండి. అల్లు శిరీష్, విజయ్ దేవరకొండ మరియు దుల్కర్ సల్మాన్ స్ఫూర్తితో ఈ పెళ్లిళ్ల సీజన్ అందరి దృష్టిని ఆకర్షించండి.

విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ ద్వారా పింక్ షేర్వానీ మరియు తెలుపు రంగు కుర్తా తెలుపు చురీదార్ లుక్‌తో గేమ్ ఛేంజర్ మాదిరిగా కనిపించొచ్చు. ఓపెన్ షేర్వాణితో వెళ్లడం ఖచ్చితంగా ఫ్యాషన్ గేమ్‌ను మారుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది మీ మీ పర్సనాలిటీకి కొత్త రూపాన్ని తెస్తుంది. అంతేకాదు కచ్చితంగా నలుగురిలో మిమ్మల్ని ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది. ఎవరైతే ఆరడుగులు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉంటే.. అలాంటి మగాళ్లకు ఇలాంటి డ్రస్సులు సరిగ్గా సూటవుతాయి.

అల్లు శిరీష్
అల్లు అరవింద్ రెండో అబ్బాయి హీరోగా తన లక్ టెస్టు చేసుకున్నాడు. కానీ ఇప్పటివరకు మంచి బ్రేక్ రాలేదు. అయితే అల్లు శిరీష్ ఫ్యాషన్ రంగంలో మాత్రం అందరితో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో వివాహ వేడుకకు సంబంధించిన కొత్త డ్రస్సుతో సరికొత్తగా కనిపించాడు. ఇక్కడ అల్లు శిరీష్ వేసుకున్న తెల్లటి చుడీదార్ మరియు తెల్లటి దుపట్టా లుక్‌తో తెల్లటి షేర్వాణి ఏ పెళ్లికైనా అల్టిమేట్ లుక్ ను ఇస్తుంది. గోల్డెన్ కఫ్‌లు మరియు కాలర్‌లతో పూర్తిగా ఉంది. దీనికి బ్రౌన్ షూస్‌తో జత చేయబడటంతో.. అల్లు శిరీష్ డ్రస్సింగ్ స్టైల్ అందరినీ ఆకర్షిస్తోంది.

దుల్కర్ సల్మాన్
తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ తెలుగులోనూ కొన్ని సినిమాలు చేశాడు. అయితే ఈ కుర్ర హీరో కూడా ఫ్యాషన్ ప్రపంచంలో అందరి కంటే ఒక అడుగు ముందడుగు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఈ నేపథ్యంలో మెరూన్ షేర్వానీ మరియు వైట్ చుడీదార్ గోల్డెన్ బటన్‌లతో కనిపించే డ్రస్సుతో కొత్త పెళ్లికొడుకులా కనిపించాడు. ఈ డ్రస్సుకు చక్కని కర్చీఫ్ మరియు బంగారు బటన్‌లతో అలంకరించబడిన వస్త్రధారణ అందరిలో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది.



Click it and Unblock the Notifications