Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
కూల్ కెప్టెన్ ధోనీ హెయిర్ స్టైల్స్ లో కుర్రాళ్లు ఎక్కువగా ఇష్టపడేవి...
మహేంద్ర సింగ్ ధోనీ జులపాల జుట్టు.. ఫ్యాషనబుల్ హెయిర్ స్టైల్స్ ఇక నుండి మైదానంలో మనం చూడలేం.
టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఆటతోనే కాదు.. తన మాటలతో.. చేతలతో.. ముఖ్యంగా తన హెయిర్ స్టైల్స్ యూత్ ను బాగా అట్రాక్ట్ చేశాడు.

తను భారత క్రికెట్ జట్టులోకి అడుగు పెట్టినప్పుడు జులపాల జుట్టుతో అలరించిన ధోనీ.. తన కెరీర్ లో వివిధ రకాల హెయిర్ స్టైల్స్ ను మార్చాడు. అంతేకాదు క్రికెట్లో 'హెలికాఫ్టర్ షాట్'తోనే కాకుండా తన హెయిర్ స్టైల్ తోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

అయితే తను క్రికెట్ ఆడుతున్న సమయంలో ప్రతి ఏడాదికో లేదా రెండేళ్లకోసారి రకరకాల హెయిర్ స్టైల్స్ ఛేంజ్ చేసేవాడు. వీటిలో కొన్ని బాగా ప్రాచుర్యం పొందాయి. అందులో ఒకటి జులపాల జుట్టు. ఈ పొడవాటి జుట్టు పాక్ ప్రధాని ముషారఫ్ ను సైతం మెప్పించింది. అందుకే పాకిస్థాన్ లో ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన సమయంలో అతను ధోనీ హెయిర్ స్టైల్ బాగుందని.. దానిని అలాగే కంటిన్యూ చేయమని కూడా కోరాడు. ఈ నేపథ్యంలో మిస్టర్ కూల్ కెప్టెన్ ధోనీ హెయిర్ స్టైల్స్ పై ఇప్పుడు ఓ లుక్కేద్దాం పదండి...

మెహాక్ హెయిర్ స్టైల్..
ధోనీకి మరపురాని హెయిర్ స్టైల్స్ లో ఇదొకటి అని చెప్పొచ్చు. మెహకా స్టైల్ లో అంటే ధోని తల యొక్క రెండు వైపులా జుట్టు లేకుండా గుండు చేయించుకున్నాడు.అయితే మధ్యలో మాత్రం మందపాటి జుట్టును మాత్రమే వదిలేశాడు. దీన్ని ఐపిఎల్ సమయంలో ట్రై చేశాడు. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత చాలా మంది ఈ హెయిర్ స్టైల్ ను ఫాలో అయ్యారు.

జులపాల జుట్టు..
టీమిండియా ఐసిసి టి20 వరల్డ్ కప్ సాధించిన సమయంలో తను జులపాల జుట్టుతో ఉన్నాడు. అప్పట్లో ఇది కుర్రకారును తెగ ఆకట్టుకుంది. ఈ హెయిర్ స్టైల్ పాక్ ప్రధాని సైతం మెచ్చుకున్నాడు.

మిలిటరీ కట్
ఈ కేశాలంకరణలో కాస్త కఠినంగా కనిపించినప్పటికీ కెప్టెన్ ధోనీ అందాన్ని మరింత పెంచింది. దీని ప్రకారం తల మధ్యలో ఒక స్పైక్ పెట్టి రెండు వైపులా మిలిటరీ కట్ చేయించుకున్నాడు. ఆ సమయంలో ధోనీకి ఇండియన్ ఆర్మీ తరపున గొప్ప గౌరవం కూడా లభించింది.

షార్ట్ బాయ్ కట్
కూల్ కెప్టెన్ ధోనీ సాధారణ హెయిర్ స్టైల్స్ లో షార్ట్ బాయ్ కట్. ఈ లుక్ లో ప్రత్యేకత ఏంటంటే తనకు బూడిద రంగు గడ్డం ఉండేది. ఇది కూడా అప్పట్లో మంచి ఫ్యాషన్ గా ఉండేది. ఈ స్టైల్ ను సినీ హీరోలు కూడా ఫాలో అయ్యారు.

చిన్న జుట్టు..
ధోని హెయిర్ స్టైల్స్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన వాటిలో చిన్న జుట్టు ఉండేది ఒకటి. ఇందులో బూడిద రంగు జుట్టు మాత్రమే బయటకు కనిపిస్తుంది.

మెస్సీ హెయిర్
ధోనీ తన క్రికెట్ కెరీర్లో మెస్సీ హెయిర్ స్టైల్ ను కూడా ప్రయత్నించాడు. ఈ స్టైల్ లో అతను చాలా చిన్నవాడిగా.. మరియు ఎంతో అందంగా కనిపించాడు.

సైడ్ స్వీప్ హెయిర్
ఇప్పటివరకు బాగా స్టైల్‌గా కనిపించిన ధోనీని ఇలాంటి స్టైల్‌లో చూడటం చాలా కష్టం. ఎందుకంటే ఇలాంటి హెయిర్ స్టైల్స్ చాలా మంది క్రీడాకారులకు ఉండదు.

స్ట్రెయిట్ స్పైక్
ధోనీ ట్రై చేసిన హెయిర్ట్ స్టైల్స్ లో స్ట్రెయిట్ స్పైక్ ఒకటి. ఈ చిత్రంలో చూపిన జెల్-కోటెడ్ స్ట్రెయిట్ స్పైక్. ఇది ధోనికి మంచి రూపాన్ని సైతం ఇచ్చింది.



Click it and Unblock the Notifications