For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Hbday Kohli33:కెప్టెన్ కోహ్లీలా కొత్తగా కనబడాలంటే.. ఇలా ట్రై చేయండి...

|

టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలో క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పరుగుల యంత్రమనే మాటను మరోసారి నిరూపించాడు.

టి20 వరల్డ్ కప్ క్రికెట్ లో ఆదివారం నాడు పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓ పక్క పేకమేడలా వికెట్లు పడుతున్నా.. ఒంటి చేత్తో భారత జట్టు గౌరవప్రదమైన స్కోరును సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. కోహ్లీ ఫిట్ నెస్ పై ఎంత ఫోకస్ పెడతాడో కూడా తెలిసిందే.

అయితే విరాట్ తన ఆటతో పాటు హెయిర్ స్టైల్స్ అండ్ బియర్డ్ స్టైల్స్ లుక్స్ తో యూత్ లో చాలా ఫేమస్ అయ్యాడు. విరాట్ తన హెయిర్ స్టైల్ అండ్ స్టైలీష్ బియర్డ్ లుక్ లో యువతకు ఫ్యాషన్ ఐకాన్ గా ఉన్నాడంటే.. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సందర్భంగా విరాట్ స్టైలీష్ హెయిర్ స్టైల్స్ అండ్ బియర్డ్ డిజైన్లపై ఓ లుక్కేద్దాం.. మీరు కూడా వీటిని ఫాలో అయితే.. చాలా అందంగా.. కొత్తగా కనిపించొచ్చు... ఇంకెందుకు ఆలస్యం కోహ్లీ స్టైలీష్ లుక్స్ పై ఓ లుక్కేయండి...

నలుగురిలో ప్రత్యేకంగా..

నలుగురిలో ప్రత్యేకంగా..

ఈరోజుల్లో అందరి కంటే అందంగా.. ఆకర్షణీయంగా.. మరీ ముఖ్యంగా నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే.. చక్కని డ్రస్సింగ్ మాత్రమే కాదు.. అందుకు తగ్గ హెయిర్ స్టైల్ మరియు చక్కని గడ్డం ఉండాల్సిందే. మీరు ఎలాంటి హెయిర్ స్టైల్ చేసుకున్నా.. మీ కురులు కూడా అందంగా కనిపించాలంటే.. విరాట్ లేటెస్ట్ హెయిర్ స్టైల్స్ అండ్ బియర్డ్ స్టైల్స్ లుక్స్ ను చూసెయ్యండి.

ఫేస్ కు తగ్గట్టు..

ఫేస్ కు తగ్గట్టు..

మన హెయిర్ స్టైల్ హైలెట్ కావాలంటే.. మన ఫేస్ ఆకారాన్ని బట్టి హెయిర్ స్టైల్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకు అనుగుణంగా ఉండే విధంగానే మీ హెయిర్ ని హైలెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ జుట్టు హైలైట్ చేసుకునే ప్రాంతాన్ని బట్టి ఎంపిక చేసుకునే క్రమంలోనూ దీనికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే హెయిర్ కలర్ ఎక్కడ లైట్ గా ఉండాలి.. ఎక్కడ డార్క్ గా ఉండాలనేవి కూడా దీని ఆధారంగానే నిర్ణయించుకోవాలి. అప్పుడు మీ లుక్ కొత్తగా కనిపిస్తుంది.

కెప్టెన్ కోహ్లీ ఇదే పద్ధతిని ఫాలో అయ్యాడు. అందుకే తను ఎలాంటి హెయిర్ స్టైల్ మార్చినా చాలా కొత్తగా.. అందంగా కనిపిస్తూ ఉంటాడు. అందుకే తను యూత్ ఐకాన్ గా మారిపోయాడు.

ఒకే రంగుతో..

ఒకే రంగుతో..

మీ హెయిర్ ను హైలైట్ చేసుకుంటున్నాం కదా.. అని మీ జుట్టు మొత్తానికి ఒకే రంగుతో హైలైట్ చేస్తే అది రోటీన్ హెయిర్ డై లానే కనిపిస్తుంది. అలా కనబడకుండా ఉండాలంటే.. మనం ఉపయోగించే హెయిర్ కలర్ క్వాంటిటీ.. సాంద్రత వంటివన్నీ ముందుగానే సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి.

వాతావరణానికి తగ్గట్టు..

వాతావరణానికి తగ్గట్టు..

మనలో చాలా మంది వాతావరణానికి తగ్గట్టు హెయిర్ స్టైల్స్ ను మారుస్తూ ఉంటారు. అయితే కాలానికి అనుగుణంగా మన జుట్టు హైలైట్ చేసుకోవడానికి ఉపయోగించే షేడ్స్ కూడా వాటికి తగ్గట్టు ఉండాలని సూచిస్తున్నారు బ్యూటీ నిపుణులు. అయితే ఏ సీజన్లో ఏ రంగులు బాగుంటాయనే విషయాలను మీ దగ్గర్లోని బ్యూటీ నిపుణులను కలిసి తెలుసుకోవడం మంచిది.

జుట్టుకు తగిన తేమ..

జుట్టుకు తగిన తేమ..

మీరు ఒకసారి ఎంతో కష్టపడి మీ జుట్టుకు నచ్చిన కలర్ లేదా హైలైటర్ తో హైలైట్ చేసుకున్న తర్వాత వాటి పట్ల తగిన జాగ్రత్త వహించడం చాలా అవసరం. ముఖ్యంగా మీ జుట్టుకు తగినంత తేమ అందించడం, సల్ఫేట్ తక్కువగా ఉత్పత్తులను వినియోగించడం, కలర్ సేఫ్ షాంపూ వాడటం, తలస్నానం రెగ్యులర్ గా చేయకపోవడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు తప్పక పాటించాలి. ఒకవేళ మరీ అవసరమనిపిస్తే డ్రై షాంపూని వాడొచ్చు.

ఒకేసారి వద్దు..

ఒకేసారి వద్దు..

మనకు నచ్చిన రంగుతో జుట్టును హైలైట్ చేసుకుంటున్నాం కదా అని ఒకేసారి మల్టీ కలర్లను ఉపయోగించడం వంటి పనులు చేయకండి. ఒకసారి మీ హెయిర్ ను హైలైట్ చేసుకునేటప్పుడు మూడు కంటే ఎక్కువ షేడ్స్ వాడకండి. ఎందుకంటే అలాంటి లుక్ మొత్తం ఎబ్బెట్టుగా మారి మీకు కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

కార్పొరేట్ గడ్డం శైలి..

కార్పొరేట్ గడ్డం శైలి..

విరాట్ కోహ్లీ తన హెయిర్ స్టైల్ మరియు గడ్డం లుక్స్ లో చాలా ప్రయోగాలు చేస్తుంటాడు. ఇప్పుడు తన గడ్డం లుక్స్ విషయానికొస్తే.. తను కార్పొరేట్ గడ్డం లుక్ లో కొంచెం కొత్తగా కనిపించాడు. ఇక్కడ గడ్డం యొక్క సైడ్ హెయిర్ పైభాగానికి తీసుకురాబడుతుంది. ఇలాంటి గడ్డం డిజైన్ మీరు ఫాలో కావాలంటే.. మీ గడ్డం మీద జుట్టు మందంగా ఉండాలి.

పొడవైన స్టబుల్ గడ్డం..

పొడవైన స్టబుల్ గడ్డం..

కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎక్కువగా కనిపించే గడ్డం లుక్స్ లో పొడవైన స్టబుల్ గడ్డం లుక్ ప్రధానమైనది. ఇలాంటి స్టైల్ ను ఫాలో అవ్వడానికి మీరు ముందుగా మీ గడ్డంపై జుట్టును మందంగా మార్చుకోవాలి. మీ పొడవాటి మరియు మందపాటి గడ్డం ఉన్న అబ్బాయిలకు ఈ శైలి సరిగ్గా సూటవుతుంది. ఈ లుక్ లో మీరు చాలా అద్భుతంగా కనిపిస్తారు.

షార్ప్ కటింగ్..

షార్ప్ కటింగ్..

విరాట్ కోహ్లీ యొక్క గడ్డం స్టైల్ యూత్ కు బాగా నచ్చిన వాటిలో షార్ప్ గా కత్తిరించిన గడ్డం ఒకటి. ఇది గడ్డం అంచున చాలా పదునుగా ఉంచబడింది. ఈ గడ్డం స్టైల్ అధికారిక దుస్తులకు కచ్చితంగా సరిపోతుంది.

డక్ టైల్ గడ్డం..

డక్ టైల్ గడ్డం..

ఈ రోజుల్లో డక్ టైల్ గడ్డం స్టైల్ చాలా ట్రెండింగులో ఉంది. చాలా మంది యువకులు ఈ స్టైల్ ను బాగా ఇష్టపడతారు. మీరు కూడా స్టైలిష్ డక్ టైల్ బియర్డ్ డిజైన్ కావాలనుకుంటే.. ముందుంగా మీ గడ్డాన్ని మందంగా మార్చుకోండి. ఇది డక్ టైల్ గడ్డం మొత్తం ముఖాన్ని కప్పేస్తుంది. ఇది బాతు తోకలా కనిపిస్తుంది. ఈ గడ్డం స్టైల్ లో కొంచెం కత్తిరించడం అవసరం.

విరాట్ కోహ్లీ 2021 సంవత్సరంలో ఎన్నో వసంతంలోకి అడుగు పెట్టాడు?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 2021 నవంబర్ 5వ తేదీన 33వ వసంతంలోకి అడుగు పెట్టాడు. 1988వ సంవత్సరంలో ఢిల్లీలో జన్మించారు.

English summary

Virat Kohli's Hairstyles & Beard Styles

Here are the virat kohli's hairstyles and beard styles. Take a look