For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

No shave November:ఈ నెలలో గడ్డం ఎందుకు చేసుకోకూడదంటే...!

నవంబరు నెలలో గడ్డం ఎందుకు చేసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఇటీవలి కాలంలో చాలా మంది మగవారు గడ్డం పెంచడంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఒకప్పుడు ఓన్లీ లేజీ ఫెలోసే గడ్డం పెంచుతారనే భావన చాలా మందిలో ఉండేది. ఇంకా కొంతమంది తమ గడ్డం గురించి అసలు కేర్ చేయరు.

What is No shave November? the history and how to participate in telugu

అయితే ఇటీవలి కాలంలో గడ్డం పెంచడం అనేది యువకులుగా ఒక స్టైల్ గా మార్చుకుంటున్నారు. సినిమా స్టార్లు.. స్పోర్ట్స్ స్టార్లు స్టైలిష్ గడ్డం లుక్స్ తో అందరినీ అలరించడంతో.. వారి అభిమానులు కూడా అదే శైలిని అనుసరిస్తున్నారు.

What is No shave November? the history and how to participate in telugu

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. No Shave November అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నవంబరు నెలలో ఎవ్వరూ కూడా గడ్డం గానీ.. కటింగ్ కానీ అస్సలు చేయించుకోకూడదంట.. ఇందుకోసం అయ్యే ఖర్చు చేసే డబ్బులను పేదలకు చేయండి అంటూ ఓ ఉద్యమం కూడా ప్రారంభమైంది.

What is No shave November? the history and how to participate in telugu

అయితే ఇది మన దేశంలో కాదు. అగ్రరాజ్యం అమెరికాలో. ఈ సందర్భంగా నో షేవ్ నవంబర్ అంటే ఏమిటి? దీని వెనుక చరిత్ర ఏమిటి? గడ్డం అందంగా పెరిగేందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

క్యాన్సర్ రోగుల కోసం

క్యాన్సర్ రోగుల కోసం

క్యాన్సర్ రోగులను ఆదుకునేందుకు అమెరికాలో No Shave November అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు నవంబర్ 1 నుండి నవంబర్ 30వ తేదీ వరకు కటింగ్, షేవింగ్ అస్సలు చేసుకోకూడదు.

ఆడవారు కూడా..

ఆడవారు కూడా..

ఈ కార్యక్రమంలో కేవలం మగవారు మాత్రమే కాదు.. ఆడవారు కూడా పాల్గొనవచ్చు. తమ హెయిర్ కటింగ్ కు ఒక నెలలో అయితే ఎంత ఖర్చు చేస్తారో.. ముఖ్యంగా నవంబర్ నెలలో సెలూన్ కోసం ఎంత సొమ్ము ఖర్చు చేస్తారో.. వాటిని విరాళంగా ఇవ్వొచ్చు.

నిత్యావసర సరుకులు, ఆహారం..

నిత్యావసర సరుకులు, ఆహారం..

ఈ కార్యక్రమం ద్వారా వచ్చే నిధులను క్యాన్సర్ రోగుల కోసం ఉపయోగిస్తారు. వారికి నిత్యావసర సరుకులు, ఆహారం, ఇతరత్రా వాటిని సహాయంగా అందిస్తారు. ప్రస్తుతం కరోనా వంటి మహమ్మారి సమయంలో కూడా క్యాన్సర్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చేతనైనా సాయం..

చేతనైనా సాయం..

వారి సమస్యల గురించి ప్రజలకు తెలియజేసేందుకు.. ఈ క్యాన్సర్ రోగులకు తమకు చేతనైంత సాయం చేసేందుకు ఈ No Shave November కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీనికి ఇప్పటికే 60 పోలీసు విభాగాలు మద్దతు పలికాయి.

2 లక్షల డాలర్లు టార్గెట్..

2 లక్షల డాలర్లు టార్గెట్..

కరోనా లాక్ టైమ్ లో ఈ కార్యక్రమం ద్వారా సుమారు 2 లక్షల డాలర్ల ఫండ్ ను కలెక్ట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారట. దీంతో లాక్ డౌన్ టైమ్ లో గడ్డం పెంచుకునే ఛాలెంజ్ చేపట్టారు సినీ సెలబ్రెటీలు. మగవారు గడ్డాన్ని అందంగా పెంచుకోవడమే ఈ ఛాలెంజ్.

సోషల్ మీడియాలో వైరల్..

సోషల్ మీడియాలో వైరల్..

#beardchallenge పేరిట సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో ఇది కాస్త బాగా వైరల్ అయిపోయింది. ట్రెండింగ్ మారిపోయిన ఈ చాలెంజ్ లో చాలా మంది సెలబ్రెటీలు పాల్గొన్నారు.

గడ్డం లుక్ లో..

గడ్డం లుక్ లో..

ఏదో సరదాగా లాక్ డౌన్ వల్ల వదిలేసిన గడ్డం లుక్ బాగుండటంతో చాలా మంది ఈ స్టైల్ నే ఫాలో అవుతున్నారు. ఇది కేవలం ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు. మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలకు వ్యాపించింది. హాలీవుడ్ స్టార్లంతా ఈ బియర్డ్ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు.

క్రమం తప్పకుండా..

క్రమం తప్పకుండా..

మీరు అందమైన గడ్డం కావాలనుకుంటే.. మీరు క్రమం తప్పకుండా గడ్డాన్ని కత్తిరించుకోవాలి. అప్పుడు మీరు కోరుకున్న స్టైల్ కచ్చితంగా పొందుతారు. దీని కోసం ప్రతిరోజూ దువ్వెనతో మీకు కావాల్సినట్టు గడ్డాన్ని సరి చేసుకోవాలి. గడ్డం కత్తిరించుకునేందుకు కొన్ని ప్రత్యేక సాధనాలను కూడా ఉపయోగించొచ్చు.

ఎక్కువగా ఇవి తినండండి..

ఎక్కువగా ఇవి తినండండి..

అందమైన గడ్డం.. ఎక్కువ గడ్డం రావాలంటే ప్రోటీన్ మరియు కొవ్వు కూడా చాలా అవసరం. కాబట్టి సన్నని మాంసాలు, కాయలు, గుడ్డు సొనలు, పాలు మరియు తాజా కూరగాయాలను ఎక్కువగా తీసుకోండి. ఇవి తరచుగా తీసుకోవడం వల్ల మీరు అందమైన గడ్డం పొందుతారు.

English summary

What is No shave November? the history and how to participate in telugu

Here we taking about the what is no shave november? the history and how to participate in telugu. Read on
Story first published:Monday, November 2, 2020, 16:28 [IST]
Desktop Bottom Promotion